తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Goa Beaches: గోవా బీచ్‍లో ప్రశాంతంగా చిల్ అవుదామనుకుంటున్నారా? పెద్దగా రద్దీ ఉండని 6 బీచ్‍లు ఇవి

Goa Beaches: గోవా బీచ్‍లో ప్రశాంతంగా చిల్ అవుదామనుకుంటున్నారా? పెద్దగా రద్దీ ఉండని 6 బీచ్‍లు ఇవి

13 December 2024, 18:30 IST

google News
    • Less Crowded Goa Beaches: గోవాలో చాలా బీచ్‍లు ఉన్నాయి. అందులో చాలా వాటిలో జనాలు ఎక్కువగా ఉంటారు. అయితే, పెద్దగా రద్దీ లేని బీచ్‍లకు వెళ్లి ఎంజాయ్ చేయాలని కొందరు అనుకుంటారు. అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఇక్కడ చూడండి.
Goa Beaches: గోవా బీచ్‍లో ప్రశాంతంగా చిల్ అవుదామనుకుంటున్నారా? పెద్దగా రద్దీ ఉండని 6 బీచ్‍లు ఇవి
Goa Beaches: గోవా బీచ్‍లో ప్రశాంతంగా చిల్ అవుదామనుకుంటున్నారా? పెద్దగా రద్దీ ఉండని 6 బీచ్‍లు ఇవి

Goa Beaches: గోవా బీచ్‍లో ప్రశాంతంగా చిల్ అవుదామనుకుంటున్నారా? పెద్దగా రద్దీ ఉండని 6 బీచ్‍లు ఇవి

గోవా అంటే అందమైన బీచ్‍లకు కేరాఫ్. ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎప్పుడూ ఉంటుంది. గోవాలోని బీచ్‍లు, నైట్‍లైఫ్ ఎంజాయ్ చేసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం ఏడాది ఆఖరి నెల డిసెంబర్ కావడంతో గోవాకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. చాలా బీచ్‍లు జనాలతో కిటకిటలాడుతూ రద్దీగా ఉంటాయి. అయితే, కొందరు ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా బీచ్‍ల్లో చిల్ కావాలని ఆలోచిస్తుంటారు. స్నేహితులతో ఎంజాయ్ చేసేందుకు యూత్ ఇలా అనుకుంటూ ఉంటారు. రద్దీ లేకుండా సమయాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు.

గోవాలో తక్కువ రద్దీ ఉండే బీచ్‍లు కూడా ఉన్నాయి. ఇతర వాటితో పోలిస్తే వీటిలో జనాలు తక్కువే ఉంటారు. వీటి గురించి ఎక్కువ మందికి తెలియదు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అలా.. గోవాలో ఎక్కువ రద్దీ ఉండని 5 ముఖ్యమైన బీచ్‍ల గురించి ఇక్కడ చూడండి.

బటర్‌ఫ్లై బీచ్

సౌత్ గోవాలోని కనాకొనా ప్రాంతంలో బటర్‌ఫ్లై బీచ్ ఉంటుంది. పాపులర్ అయిన పలోలెం బీచ్‍కు ఇది సమీపంలోనే ఉంటుంది. ఇతర వాటితో పోలిస్తే బటర్‌ఫ్లై బీచ్‍లో జనాలు తక్కువగానే ఉంటారు. ఈ బీచ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ట్రెక్కింగ్ చేస్తూ కూడా ఈ బీచ్‍కు వెళ్లవచ్చు. పెద్దగా గోల లేకుండా స్నేహితులతో ప్రశాంతంగా ఎంజాయ్ చేసేందుకు బటర్‌ఫ్లై బీచ్ మంచి ఆప్షన్‍గా ఉంటుంది.

బేతాళ్‍బాతిమ్ బీచ్

సౌత్ గోవాలోనే బేతాళ్‍బాతిమ్ బీచ్ కూడా ఉంటుంది. ఇక్కడికి కూడా పెద్దగా టూరిస్టులు రారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ పచ్చదనం కూడా మనసును హత్తుకుంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు.

కలాచా బీచ్

కలాచా బీచ్.. నార్త్ గోవాలో ఉంటుంది. ఈ బీచ్‍లోనూ జనాల హడావుడి ఎక్కువగా ఉండదు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ బీచ్‍ను హిడెన్ జెమ్ అని కూడా అంటుంటారు. ఇప్పటికీ చాలా మందికి కలాచా బీచ్ గురించి తెలియదు. అందుకే ఎక్కువ మంది సందర్శించరు. పీస్‍ఫుల్‍గా సముద్రపు అందాలను అనుభూతి చెందాలంటే ఈ బీచ్ కూడా బాగుంటుంది.

కాకోలెం బీచ్

సౌత్ గోవాలోని కాకోలెం బీచ్‍ను కూడా టూరిస్టులు సందర్శించరు. గోవాలో తక్కువ క్రౌడ్ ఉండే బీచ్‍ల్లో ఇదీ ఒకటి. బీచ్‍లో ప్రశాంతంగా ఉండాలనుకునే వారు కాకోలెం బీచ్‍కు వెళ్లవచ్చు. ఇక్కడ పెద్ద రాళ్లు ఉంటాయి. స్నేహితులతో ట్రిప్‍కు వెళ్లి ఎక్కువ సేపు గడపాలంటే ఈ బీచ్‍పై ఓ కన్నేయవచ్చు.

వైంగునిమ్ బీచ్

వైంగునిమ్ బీచ్.. నార్త్ గోవాలో ఉంటుంది. ఈ బీచ్‍లో రద్దీ ఎక్కువగా ఉండదు. ప్రకృతి ఆహ్లాదరకంగా ఉంటుంది. పీస్‍ఫుల్ వాతావరణం కావాలంటే ఈ బీచ్‍కు రావొచ్చు. మంచి అనుభూతి ఉంటుంది. సముద్రాన్ని చాలాసేపు ఆస్వాదించవచ్చు.

బేతుల్ బీచ్

సౌత్ గోవాలో బేతుల్ బీచ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బీచ్‍లోనూ రద్దీ ఎక్కువగా ఉండదు. ప్రశాంత వాతావరణంలో రిలాక్స్ కావాలనుకు వారికి ఈ బీచ్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. జనాల హడావుడి అంతగా ఉండదు. ఇక్కడి వాతావరణ కూడా మనసులను హత్తుకుంటుంది.

డిసెంబర్ బిజీ సీజన్ కావడంతో ఈ బీచ్‍ల్లో జనాలు కాస్త ఉండే అవకాశం ఉంటుంది. అయితే, మిగిలిన పాపులర్ బీచ్‍లతో పోలిస్తే రద్దీ తక్కువగానే ఉంటుంది. 

తదుపరి వ్యాసం