Beauty Hacks: చిన్న వాసెలిన్ డబ్బా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది, దీన్ని ఎన్ని రకాలుగా వాడొచ్చంటే…
10 July 2024, 7:00 IST
- Beauty Hacks: రోజూ ఉపయోగించే సాధారణ వస్తువులలో వాసెలిన్ ఒకటి. మాయిశ్చరైజర్‌గా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాసెలిన్ కేవలం మాయిశ్చరైజర్ గానే కాదు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
వాసెలిన్ ఉపయోగాలు
అందరికీ చిన్నప్పటి నుండి వాసెలిన్ వాడడం అలవాటే. ఈ చిన్న వాసెలిన్ డబ్బా అందరికీ బాగా పరిచయమే. ఆ వాసెలిన్ మాయిశ్చరైజర్ గా ఉపయోగడపడుతుంది. ముఖ్యంగా వానాకాలం, శీతాకాలంలో కచ్చితంగా వాసెలిన్ ఉండాల్సిందే. లేకుంటే చర్మం పొడి బారిపోతుంది. అయితే వాసెలిన్‌ను కేవలం మాయిశ్చరైజర్ గానే కాదు, అనేక రకాలుగా వాడవచ్చు. వాసెలిన్ ను ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చో తెలుసుకోండి.
పెదవుల చివరలు చీరిపోవడం, పాదాల దగ్గర చీలమండలు రఫ్ గా మారడం , చర్మం పొడి బారడం వంటి సమస్యలు ఎక్కువగా చల్లని వాతావరణంలో కనిపిస్తాయి. అలాంటప్పుడు వాసెలిన్ ను అప్లై చేస్తే అది అద్భుతంగా పనిచేస్తుంది. మీ బ్యాగ్‌లో చిన్న వాసెలిన్ డబ్బా ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. దీన్ని అనేక రకాలుగా వాడవచ్చు.
కనురెప్పలకు వాసెలిన్
మీ కనురెప్పలను మరింత దట్టంగా, అందంగా చేయడానికి వాసెలిన్ ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ కనురెప్పలు, కనుబొమ్మలపై వాసెలిన్ అప్లయ్ చేయండి. ఇలా కొన్ని రోజుల పాటూ చేస్తే మీ కనురెప్పలు పొడవుగా, దట్టంగా, అందంగా మారతాయి.
వాసెలిన్ మంచి మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగించవచ్చు. మేకప్ తొలగించాల్సి వస్తే ముఖానికి వాసెలిన్ అప్లై చేయాలి. తరువాత దూది సహాయంతో మేకప్ ను సులభంగా తొలగించవచ్చు. వాసెలిన్ ను కాటన్‌కు పూసి ముఖంపై రుద్దడం ద్వారా మేకప్‌ను తొలగించవచ్చు.
కాలిన గాయాలకు
శరీరంలో ఎక్కడైనా కోతలు, కాలిన గాయాలు ఉన్నప్పుడు వాసెలిన్‌ను ప్రథమ చికిత్సగా ఉపయోగించవచ్చు. ఇది క్రిమినాశక మందుగా పనిచేస్తుంది. చర్మ గాయంపై వాసెలిన్ పూయడం వల్ల సూక్ష్మక్రిములు పెరగవు. అంతేకాదు ఆ గాయం సంక్రమణ వ్యాప్తి చెందదు. దీనిని ప్రథమ చికిత్సగా మాత్రమే ఉపయోగించవచ్చు, కానీ ఔషధంగా భావించకూడదు.
వాసెలిన్ వల్ల మేకప్ తొలగించుకోవడమే కాదు, మేకప్ ఎక్కువసేపు ఉండటానికి కూడా వాసెలిన్ ఉపయోగించవచ్చు. వాసెలిన్‌తో పెదాలు, ముఖాన్ని మాయిశ్చరైజ్ చేశాక మేకప్ వేసుకోవాలి. అలా వేసుకుంటే మేకప్‌కు మ్యాట్ లుక్ వస్తుంది. ఇది కాకుండా, వాసెలిన్ మేకప్ ఎక్కువ కాలం నిలిచేలా చేస్తుంది. శరీరానికి వాసెలిన్ రాసుకున్నాక పెర్ఫ్యూమ్ చల్లకుంటే ఎక్కువ కాలం పాటూ సువాసన ఎక్కువ కాలం పాటూ ఉంటుంది.
సోఫాలు, పర్సులు, బూట్లు వంటి రెక్సిన్, లెదర్ వస్తువులపై మరకలు పడితే, వాటిని తొలగించడానికి వాసెలిన్ కూడా ఉపయోగించవచ్చు. వాసెలిన్ అప్లై చేసి లెదర్ లేదా రెక్సిన్ తో చేసిన వస్తువులను వస్త్రంతో తుడుచుకోవాలి. దీని వల్ల మరకలు త్వరగా పోతాయి. వాసెలిన్ ఒకసారి ఇలా వాడి చూడండి…. దాని ఉపయోగం మీకే తెలుస్తుంది.
టాపిక్