Padded Bra: ప్యాడెడ్ బ్రా ఎందుకు అవసరం? దీని వల్ల ఉండే సౌకర్యం ఏంటి? ప్రయోజనాలు తెలుసుకోండి
19 September 2024, 9:24 IST
- Padded Bra: అమ్మాయిలు నాన్ ప్యాడెడ్ బ్రా లేదా ప్యాడెడ్ బ్రా ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలో సతమతమవుతూ ఉంటారు. ఒకప్పుడు ప్యాడెడ్ బ్రా ఎంచుకోవడంలో కొన్ని అపోహలు ఉండేవి. కానీ దీని వల్ల ఉండే సౌకర్యం తెలుసుకుంటే ఏంచక్కా మీరు దీనినే ఎంచుకుంటారు. ఎందుకో తెలుసుకోండి.
ప్యాడెడ్ బ్రా ఉపయోగాలు
Padded Bra: కుర్తా పైజామా వేసుకున్నా, చీర కట్టుకున్నా... అందంగా కనిపించాలంటే బ్రా తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. ఇవి రొమ్ములకు గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటాయి. మిమ్మల్ని అందంగా కనిపించేలా చేయడమే కాదు, రొమ్ముల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంటాయి. అయితే కొంతమందికి పాడెడ్ బ్రా వాడాలా? లేక నాన్ ప్యాడెడ్ వాడాలా? అనే సందేహం ఉంటుంది. నాన్ ప్యాడెడ్ బ్రా అంటే బ్రా లో కప్స్ పెట్టకుండా ఉండేవి. ప్యాడెడ్ బ్రా అంటే మందపాటి కప్స్‌ను బ్రాలో అమర్చి ఉంచుతారు. వీటిని వేసుకోవడం చాలా సులువు.
నాన్ పాడెడ్ బ్రా కన్నా ప్యాడెడ్ బ్రా రొమ్ములకు మంచి సపోర్ట్ ను అందిస్తుంది. ఇది అమ్మాయిలకు ఆధునిక కాలంలో దొరికిన బెస్ట్ ఉత్పత్తి అని చెప్పుకోవాలి. ఈ బ్రా రొమ్ములకు నిండుదనాన్ని ఇస్తుంది. ఆకృతి గుండ్రంగా కనిపించేలా చేస్తుంది.
ప్యాడెడ్ బ్రాలో తేలికపాటి ప్యాడ్‌లను వాడతారు. కాబట్టి పెద్దగా బరువు ఉండవు. పైగా అవి మెత్తగా కూడా ఉంటాయి. వీటిని వక్షోజాలు చిన్నగా ఉన్న మహిళలు మాత్రమే వేసుకుంటారని ఎక్కువమంది అనుకుంటారు. నిజానికి ఇవి వక్షోజాల పరిమాణంతో సంబంధం లేకుండా వేసుకోవచ్చు.
ఆత్మవిశ్వాసం పెంచుతుంది
అందం... ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక మహిళ తన రూపాన్ని ఎంతగా మెరుగుపరుచుకుంటే ఆమెలో ఆత్మవిశ్వాసం అంతగా పెరుగుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ప్యాడెడ్ బ్రాలు ధరించడం వల్ల మీ శరీరం అందంగా కనిపిస్తుంది. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. సాధారణ బ్రాలు పలుచగా ఉంటాయి. ఇవి అంత సౌకర్యాన్ని ఇవ్వవు. ప్యాడెడ్ బ్రాలు చాతీ బరువును మోయగలవు. అందువల్ల సపోర్ట్ మాత్రమే కాకుండా ఛాతి భాగం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఛాతీ భాగంలో అందమైన ఆకృతి కావాలనుకునేవారు ప్యాడెడ్ బ్రాలను ఎంచుకుంటే సరిపోతుంది. పక్షోజాలు చిన్నగా ఉన్న అమ్మాయిలు కూడా ప్యాడెడ్ బ్రాలను వేసుకుంటే సమస్య తీరిపోతుంది. టీ షర్ట్‌లు, బ్లౌజులు, కుర్తాలు ఇలా ఎందులో అయినా ప్యాడెడ్ బ్రా ధరించినా కూడా మీరు అందంగానే కనిపిస్తారు. వీటిని ప్రయత్నించి చూడండి.
మీ వార్డ్ రోబ్ కచ్చితంగా ఉండాల్సినవి ప్యాడెడ్ బ్రా. బ్రా లాంటి లోదుస్తులు స్త్రీలు ధరించడం ఈనాటి అలవాటు కాదు. వందల ఏళ్ల క్రితం నుంచి మహిళలు బ్రాలను వేసుకుంటున్నారని చెప్పే ఆధారాలు ఉన్నాయి. గ్రీకు - రోమన్ కాలంలో మహిళలు బ్రాలు వేసుకున్నట్టు చరిత్రకారులు నిర్ధారించారు. ఈజిప్టు మహిళలు లెదర్ తో చేసిన బ్రాలను ధరించినట్టు తెలుస్తోంది. ఆధునిక బ్రా చరిత్ర విషయానికి వస్తే వీటిని ఫ్రాన్స్ లో తయారుచేసినట్టు చెబుతున్నారు. అప్పట్నించి అన్ని దేశాల్లోను బ్రా ల తయారీ మొదలైంది. ఇవి వేసుకోవడం వల్ల కలిగే సౌకర్యం కూడా స్త్రీలు అర్థం చేసుకున్నారు. అయితే నిదురించే ముందు లోదుస్తులు తీసేయడం వల్ల రక్తప్రసరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని గుర్తించాలి.