Lord Shiva and Leaf: శివుడికి ఇష్టమైన ఆకు ఇది, దీన్ని రోజూ తింటే డయాబెటిస్, పొట్ట సమస్యలు రావు
14 August 2024, 7:00 IST
- Lord Shiva and Leaf: శివుని ఆరాధనలో కచ్చితంగా ఉండే ఆకు తమలపాకు. ఇది లేనిదే శివ పూజ పూర్తి కాదు. ఈ ఆకుల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది చక్కెరను అదుపులో ఉంచి, పొట్ట సమస్యలను దూరంగా ఉంచుతుంది. తమలపాకును ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరంగా ఉంటాయి.
శివుడికి ఇష్టమైన ఆకులు ఏవో తెలుసా?
హిందూ మతంలో తమలపాకును చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ మతం ప్రకారం, తమలపాకు త్రిమూర్తులకు చిహ్నం అంటే బ్రహ్మ, విష్ణు, శివులకు చిహ్నం. హిందూ మతంలో జరిగే ప్రతి పూజలో, ప్రతి ఆరాధనలో తమలపాకు ఖచ్చితంగా ఉంటుంది. తమలపాకు అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఇది దేవతలకే ఇష్టమైన ఈ ఆకు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజుకో తమలపాకు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ రోజు శివునికి ఇష్టమైన తమలపాకు వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
శ్వాస సమస్యలు రాకుండా
వాతావరణం మారిన వెంటనే జలుబు, దగ్గు సమస్య మొదలవుతుంది. విపరీతమైన దగ్గు వల్ల ఛాతీలో బిగుసుకుపోయినట్టు అవుతుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. తమలపాకుల సహాయంతో ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఛాతీ బిగుతుగా లేకుండా సాధారణంగా ఉండేందకు తమలపాకు సహాయపడుతుంది. తమలపాకుపై ఆవ నూనెను పూసి కాస్త వేడి చేయండి. వేడెక్కిన ఆ ఆకును ఛాతీపై ఉంచండి. ఇది ఛాతీ బిగుతును తొలగిస్తుంది. జలుబు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
డయాబెటిస్‌కు చికిత్స
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లలకు కూడా మధుమేహం వస్తోంది. తమలపాకుల సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిని చాలా వరకు నియంత్రించవచ్చు. తమలపాకు రసంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయాలంటే రోజూ తమలపాకు రసాన్ని తీసుకోండి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను చాలా వరకు కంట్రోల్ లో ఉంచుతుంది.
తమలపాకుల సహాయంతో పొట్టకు సంబంధించిన అనేక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఆకలి లేక జీర్ణ సంబంధ వ్యాధులు ఉన్నా, కడుపులో గ్యాస్ సమస్య ఉన్నా వీటన్నింటినీ తొలగించడానికి తమలపాకులను ఉపయోగించవచ్చు. తమలపాకులను నమలడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమై కడుపులోని విషమంతా బయటకు వస్తుంది. ఆహారం తిన్న తర్వాత తమలపాకులను తినడం వల్ల పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు తొలగిపోతాయి.
తమలపాకులో యాంటీ సెప్టిక్, యాంటీ అలర్జీ గుణాలున్నాయి. ఇవి క్రిములను చంపడానికి పనిచేస్తాయి. శరీరంలో ఎక్కడైనా కోతల వల్ల గాయాలు అయితే తమలపాకు రసం అప్లై చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చర్మంపై మొటిమలు, నల్లమచ్చలు, అలెర్జీల కారణంగా దురదలు వచ్చినప్పుడు తమలపాకు రసంలో పసుపు కలిపి రాసుకుంటే మేలు జరుగుతుంది.
పాలిచ్చే తల్లులకు ఒక్కోసారి రొమ్ముల్లో పాలు గడ్డల్లా మారిపోతాయి. అలాంటప్పుడు తమలపాకులను కొద్దిగా వేడి చేసి రొమ్ములపై ఉంచుకుంటే ఆ గడ్డలు కరుగుతాయి. నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని తీసి ప్రతిరోజూ తాగుతుంటే గుండె బలహీనత తగ్గుతుంది. గుండె కండరాలు బలంగా మారుతాయి.