Diabetes: రాత్రిపూట చేసే ఈ తప్పులు మీలో షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి, ప్రతి డయాబెటిస్ పేషెంట్ తెలుసుకోవాల్సిందే
23 November 2024, 9:30 IST
Diabetes: డయాబెటిస్ రోగులు చలికాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాత్రిపూట వారు చేసే కొన్ని తప్పులు వారిలో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
డయాబెటిస్
చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇవే డయాబెటిస్ లక్షణాలను తీవ్రంగా మార్చేస్తాయి. వీటి చెడు ప్రభావం ప్రజల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. నేటి కాలంలో డయాబెటిస్ ఎక్కువమందికి వస్తోంది. ఎవరికైనా డయాబెటిస్ వచ్చిన తర్వాత, అతను తన ఆహారపద్ధతులను, మొత్తం జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. చిన్న పొరపాటు కూడా చక్కెర స్థాయిని వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. ఈ రోజు చాలా మంది రాత్రిపూట తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల గురించి మీకు చెప్పబోతున్నాము. వీటి వల్ల వారిలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు మీ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచాలనుకుంటే ఈ తప్పులను వీలైనంత వరకు చేయకండి.
తగినంత నిద్ర లేకపోవడం
మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సరైన విశ్రాంతి అవసరం. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు రాత్రిపూట త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. సుమారు 8 గంటలు నిద్ర పొందడానికి ప్రయత్నించండి. మీరు మీ శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోతే డయాబెటిస్ పెరిగిపోయే అవకాశం ఉంది. రాత్రి ఆలస్యంగా మేల్కొంటే, అది జీవక్రియ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, తక్కువ నిద్ర కారణంగా పెరిగిన ఒత్తిడి, చిరాకు కారణంగా, కార్టిసాల్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది.
రాత్రి భోజనం తర్వాత
చల్లటి వాతావరణంలో శరీరం చాలా బద్ధకంగా మారుతుంది. భోజనం చేశాక నేరుగా దుప్పటి కప్పుకుని నిద్రపోవాలనిపిస్తుంది. కానీ మీరు షుగర్ పేషెంట్ అయితే ఇలా చేయడం మంచి పద్దతి కాదు. రాత్రి భోజనం తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాలు నడవండి. మీరు బయటికి వెళ్ళలేకపోతే ఇంట్లో నడవండి. కానీ తిన్న వెంటనే నేరుగా పడుకోకండి.
రాత్రి పడుకునే ముందు తిన్న తర్వాత స్వీట్లు తీసుకోవడం, టీ, కాఫీ తాగడం కొందరికి అలవాటు. మీకు కూడా ఈ అలవాట్లు ఏవైనా ఉంటే, ఈ రోజే వదిలేయండి. ఎందుకంటే ఈ అలవాట్లు మీ రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచడానికి పనిచేస్తాయి. స్వీట్ల మీద కోరికను తొలగించడానికి, మీరు తిన్న తర్వాత కొద్దిగా దేశీ బెల్లం తినవచ్చు, టీ లేదా కాఫీకి బదులుగా, మీరు మీ దినచర్యలో గ్రీన్ టీ లేదా బ్లాక్ టీని చేర్చవచ్చు.
డిన్నర్ పొరపాట్లు
బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలంటే డిన్నర్ కు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మొదట భోజనం చేసే సమయం నిర్ణయించండి. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. వీలైనంత త్వరగా డిన్నర్ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే నూనె పదార్థాలు, కార్బోహైడ్రేట్లు నిండిన పదార్థాలు తినకూడదు. తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా తెల్ల అన్నానికి, బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి. బదులుగా, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి.
ద్రవాలు అధికంగా
చలికాలంలో, మీకు తరచుగా దాహం అనిపించదు. దీని వల్ల శరీరానికి సరైన మొత్తంలో నీరు లభించదు. చాలా మంది రాత్రిపూట పదేపదే టాయిలెట్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండటానికి రాత్రిపూట నీరు తాగడం మానేస్తారు. మీరు కూడా చలికాలంలో చాలా తక్కువ నీరు త్రాగుతుంటే, వెంటనే ఈ అలవాటును విడిచిపెట్టండి. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయిజ ఇది డయాబెటిస్ రోగులకు ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల, ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం.