తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Daily Chicken Eating: ప్రతిరోజూ చికెన్ తినే వారికి షాకిస్తున్న కొత్త అధ్యయనం ఫలితాలు, చికెన్ మంచిదే కానీ

Daily Chicken Eating: ప్రతిరోజూ చికెన్ తినే వారికి షాకిస్తున్న కొత్త అధ్యయనం ఫలితాలు, చికెన్ మంచిదే కానీ

Haritha Chappa HT Telugu

20 August 2024, 16:30 IST

google News
    • Daily Chicken Eating: చికెన్ పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా వారానికి రెండు మూడు సార్లు మితంగా తింటే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి. కానీ రోజూ తింటే మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం.
చికెన్ రోజూ తింటే మీలో జరిగే మార్పులు ఏమిటి?
చికెన్ రోజూ తింటే మీలో జరిగే మార్పులు ఏమిటి? (Unsplash)

చికెన్ రోజూ తింటే మీలో జరిగే మార్పులు ఏమిటి?

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. చికెన్ వేపుడు, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ లాలీపాప్స్… ఇది గుర్తొస్తే ప్రతిరోజూ తినేయాలనిపిస్తుంది. కొంతమందికి రోజూ ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ అందుతుందని ఎంతో మంది భావిస్తారు. అది నిజం కూడా. కానీ ఇలా రోజూ చికెన్ తినేవారికి షాకిచ్చేలా ఉంది ఒక కొత్త అధ్యయనం. చికెన్ ఎక్కువగా తినడం లేదా ప్రతిరోజూ తినడం అనేది మనం అనుకున్నంత ఆరోగ్యకరమైనది కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

చికెన్ లాలీపాప్స్, డ్రమ్ స్టిక్స్ వంటివి తినేటప్పుడు వాటిని కెచప్ తో తినేవారి సంఖ్య ఎక్కువ. ఐస్ క్రీం, పిజ్జా, చీజ్ వంటివి ఇప్పటికే ఆరోగ్యకరమైనవి కావు అని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. కానీ చికెన్, కెచప్ తినడం విషయానికి వస్తే… అవి రెండూ మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని కొత్త అధ్యయనంలో తేలింది.

చికెన్ మంచిదే, కానీ...

ఓహియో స్టేట్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ మెడికల్ డైటెటిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ టేలర్ మాట్లాడుతూ, చికెన్ బ్రెస్ట్ తక్కువ సంతృప్త కొవ్వు ఆహారంగా చెప్పుకుంటారని అన్నారు. తక్కువ సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలు కూడా నెమ్మదిగా సంతృప్త ఆహారంగా మారిపోతాయి. చికెన్ ప్రతిరోజూ తినే కన్నా వారానికి ఒకటి లేదా రెండు సార్లు కేవలం వందగ్రాములకు మించకుండా తినాలి. ప్రజలలో ఉన్న అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పరిశోధించడానికి 35,000 మంది అమెరికన్లపై అధ్యయనం నిర్వహించారు. ఆ అధ్యయనంలోనే చికెన్ అధిక వినియోగం వల్ల వారికి మధుమేహం, రక్తనాలాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది.

వీటిలోనే కొవ్వు ఎక్కువ

చీజ్, పిజ్జా, ఐస్ క్రీం, గుడ్లు శరీరానికి సంతృప్త కొవ్వును అందించడంలో అగ్రస్థానంలో ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. కోల్డ్ కట్స్, క్రీమ్, వేయించిన బంగాళాదుంపల్లో కూడా సంతృప్త కొవ్వు కంటెంట్ అధికంగా ఉంటాయి. శీతల పానీయాలు, టీ, పండ్ల పానీయాలు, కేకుల్లోనూ అదనపు చక్కెర శరీరంలో చేరుతుంది. ఎనర్జీ డ్రింక్స్, కొన్ని రకాల బ్రెడ్‌లు కూడా శరీరంలో అదనపు చక్కెర చేరడానికి కారణం అవుతాయి.

చికెన్ ఆరోగ్యానికి హానికరం కాదు. దీనిలో ఉండే ప్రొటీన్ మనకు ఎంతో అవసరం. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. చికెన్ తింటే మంచిదే కానీ, అధికంగా తింటే మాత్రం నష్టం తప్పదు. అయితే ఈ కొత్త అధ్యయనం చెబుతున్న ప్రకారం చికెన్ అధికంగా తింటే మాత్రం కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. చికెన్ తినడం వల్ల బరువు కూడా త్వరగా పెరుగుతారు. కాబట్టి చికెన్ వారంలో రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు తినకపోవడమే మంచిది.

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చికెన్ తినకూడదు. యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు చికెన్ కు దూరంగా ఉండాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి చాలా సమస్యలు వస్తాయి. గౌట్ నొప్పిని కూడా ఇది పెంచుతుంది. కాబట్టి చికెన్ తినేటప్పుడు కేవలం 100 గ్రాములు మించకుండా ఉండాలి. అది కూడా మూడు రోజులకు ఒకసారి తింటే సరిపోతుంది.

తదుపరి వ్యాసం