Semiya Pakodi Recipe: డిఫరెంట్ టేస్ట్‌తో, క్రిస్పీగా సేమియా పకోడి.. సులువుగా చేసుకోండిలా
30 November 2024, 15:30 IST
- Semiya Pakodi Recipe: పకోడి డిఫరెంట్‍గా చేయాలనుకుంటే ఈ వెరైటీ అదిరిపోతుంది. సేమియాతో చేసే ఈ పకోడీ క్రిస్పీగా, విభిన్నమైన రుచితో సూపర్ అనిపిస్తుంది. ఈవెనింగ్ స్నాక్‍కు బాగా సూటవుతుంది.
Semiya Pakodi Recipe: డిఫరెంట్ టేస్ట్‌తో, క్రిస్పీగా సేమియా పకోడి.. సులువుగా చేసుకోండిలా (Dindigul Food Court/youtube)
Semiya Pakodi Recipe: డిఫరెంట్ టేస్ట్‌తో, క్రిస్పీగా సేమియా పకోడి.. సులువుగా చేసుకోండిలా
పకోడి చాలా పాపులర్ స్నాక్. ఇది బాగుంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఉల్లిపాయతోనే ఎక్కువగా పకోడి చేస్తుంటారు. అయితే, కాస్త డిఫరెంట్‍గా సేమియా కలిపి పకోడి చేయవచ్చు. ఈ ‘సేమియా పకోడీ’ విభిన్నమైన రుచితో, కరకలాడేలా క్రీస్పీగా ఉంటాయి. కొత్త తరహాలో పకోడీలు తినాలనుకునే వారిని మెప్పిస్తాయి. ఈ సేమియా పకోడీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
సేమియా పకోడీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల సేమియా
- ఓ కప్పు శనగపిండి
- రెండు ఉల్లిపాయలు (పొడవుగా తరుక్కోవాలి)
- నాలుగు పచ్చిమిర్చి (సన్నగా తరగాలి)
- ఐదు రెబ్బల టేబుల్‍స్పూన్ కరివేపాకు తరుగు
- పావు టీస్పూన్ వంటసోడా
- రెండు టేబుల్ స్పూన్‍ల కారం
- ఓ టేబుల్ స్పూన్ చాట్ మసాలా
- గుప్పెడు కొత్తిమీర తరుగు
- తరిగినంత ఉప్పు
- పకోడి వేపుకునేందుకు నూనె
సేమియా పకోడీకి తయారీ విధానం
- సేమియా ఉడికించేందుకు ముందుగా ఓ గిన్నెను స్టవ్‍పై పెట్టి రెండు లీటర్ల నీరు పోసి బాగా మరగనివ్వాలి. నీరు మరుగుతున్న సమయంలో అందులో సేమియా వేయాలి.
- సేమియాను సుమారు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి. పూర్తిగా ముద్దగా కాకుండా సేమియా 60 శాతం మాత్రమే ఉడికించాలి. పలుకుగా ఉండడం చాలా ముఖ్యం.
- ఉడికిన సేమియాను పూర్తిగా చల్లారనివ్వాలి. అందుకోసం వాటిలో చల్లటి నీరు పోసి వడకట్టుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాతే పకోడి పిండి తయారు చేసుకోవాలి.
- చల్లారిన తర్వాత సేమియాను ఓ మిక్సింగ్ బౌల్‍లో వేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, కారం, శనగపిండి, వంటసోడా, రుచికి తగినంత ఉప్పు, కొత్తమీర తరుగు, చాట్ మసాలా వేయాలి.
- వాటన్నింటినీ చేతి వేళ్లతో నెమ్మదిగా బాగా కలపాలి. ముందుగా నీరు వేయకుండానే ఈ పిండిని మిక్స్ చేయాలి. మరీ పొడిగా ఉంటే ఓ కాస్త నీటిని చిలకరించి మళ్లీ కలపాలి.
- బాగా వేడెక్కిన నూనెలో పిండిని పకోడీలాగా చేతి వెళ్లతో వేసుకోవాలి. సన్నటి మంటపై వీటిని ఫ్రై చేసుకోవాలి.
- గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా సన్నని మంటపై పకోడీలను వేయించుకోవాలి. ఆ తర్వాత నూనెలో నుంచి ప్లేట్‍లోకి తీసుకోవాలి. అంతే సేమియా పకోడీ రెడీ అవుతుంది.
సేమియా పకోడీ పర్‌ఫెక్ట్‌గా రావాలంటే సేమియాను పూర్తిగా ముద్దలా ఉడికించుకోకూదని గుర్తుంచుకోవాలి. పలుకుగా ఉండేలా ఉడికించుకోవాలి. లేకపోతే పకోడీ ముద్దలా, బజ్జీల్లా వస్తుంది. సేమియాను కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పిండి వేసి కలపాలి. అది కూడా ఎక్కువగా వత్తకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలి.