తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Tea: మసాలా టీ ఎన్నిసార్లు చేసినా హోటల్ స్టైల్లో రావట్లేదా.. ? ఇలా చేశారంటే మీ ఛాయ్‌కి వంక పెట్టేవాళ్లు ఉండరు!

Masala Tea: మసాలా టీ ఎన్నిసార్లు చేసినా హోటల్ స్టైల్లో రావట్లేదా.. ? ఇలా చేశారంటే మీ ఛాయ్‌కి వంక పెట్టేవాళ్లు ఉండరు!

Ramya Sri Marka HT Telugu

Published Mar 21, 2025 06:30 AM IST

google News
    • Masala Tea: మీకు మసాలా టీ అంటే ఇష్టమా? ఎన్ని సార్లు చేసినా హోటల్ స్టైల్ రుచి రావడం లేదా. అయితే ఈ రెసిపీ మీ కోసమే. ఇలా చేశారంటే పర్ఫెక్ట్ రుచితో మసాలా ఛాయ్‌ని ప్రతిరోజూ ఆస్వాదించవచ్చు. ఇది చాలా సింపుల్ కూడా.
మసాలా దినుసులతో తయారు చేసిన రుచికరమైన ఛాయ్

మసాలా దినుసులతో తయారు చేసిన రుచికరమైన ఛాయ్

రోజూ రెగ్యులర్ టీ తాగాలంటే చాలా మందికి బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు మసాలా ఛాయ్ ఆస్వాదించాలనుకుంటారు. కానీ ఎన్ని సార్లు చేసినా హోటల్ స్టైల్ టేస్ట్ మాత్రం రానే రాదు. పదార్థాలన్నీ అవే కానీ రుచిలో ఎందుకు తేడా వస్తుందో అర్థం కాదు. మీదీ అదే పరిస్థితా? మీకు ఇష్టమైన మసాలా టీని మంచి టేస్టీగా చేయలేకపోతున్నారా? అయితే ఈ రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడుంది. పదార్థాలన్నీ అవే కానీ చేసే ప్రాసెస్‌లో ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించారంటే మసాలా టీ పెట్టడంలో మీరే పర్ఫక్ట్ అంటారు మీ ఇంట్లో వాళ్లు. అంత రుచిగా ఉంటుంది. అంత టేస్టీగా ఉండాలంటే ఎక్కువ కష్టపడాలి అనుకోకండి. సింపుల్ ప్రాసెస్ లోనే టేస్టీ మసాలా టీని సూపర్ గా చేయచ్చు. ఎలాగో ఇక్కడ వివరంగ ఉంది చూసేయండి.


హోటల్ స్టైల్ మసాలా టీ తయారీకి కావల్సిన పదార్థాలు:

  • చక్కెర - రుచికి సరిపడా
  • నీరు- పావు కప్పు
  • టీ పొడి- రెండు స్పూన్లు
  • పాలు - ఒక కప్పు
  • ఇలాచీ - నాలుగు
  • లవంగాలు - రెండు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • అల్లం - ఒక ఇంచు

హోటల్ స్టైల్ మసాలా టీ తయారీకి విధానం:

  1. మసాలా టీ తయారు చేయడం కోసం ముందుగా టీ గిన్నె తీసుకుని మీ రుచికి సరిపడా చక్కెర వేయండి.
  2. తర్వాత దీంట్లోనే నీరు పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయండి.
  3. చక్కెర అంతా కరిగి నీరు మరగడం ప్రారంభించగానే దాంట్లో టీ పొడి వేసి బాగా కలపండి.
  4. టీ పొడి కూడా కరిగి చిన్న పాటి పొంగు రావడం మొదలవగానే దీంట్లో పాలు పోయండి.
  5. పాలు పోసిన వెంటనే చక్కెర, టీపొడి కాస్త గడ్డ గట్టనట్లుగా అనిపిస్తుంది. ఇదంతా కరిగే వరకూ బాగా కలుపుతూ ఉండండి.
  6. అన్నీ కలిసిపోయి పాలు రంగు మారి మరుగుతున్న సమయంలో దీంట్లో నాలుగు ఇలాచీ, రెండు లవంగాలు, రెండు బిర్యానీ ఆకులు, చిన్న అల్లం ముక్క వేసి బాగా కలపండి.
  7. రెండు నిమిషాల పాటు వీటిని మరిగించిన తర్వాత వడకట్టి కప్పులో పోసుకున్నారంటే హోటల్ స్టైల్ టేస్టీ మసాలా ఛాయ్ రెడీ అయినట్టే. ఈ మసాలా టీని ఉదయాన్నే తాగచ్చు లేదంటే సాయంత్రం పూట తాగచ్చు.

మసాలా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • మసాలా టీ తాగడంలో వేసిన అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • దీంట్లో వాడే లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో చక్కట పాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టడంలో సహాయపడతాయి.
  • ఈ మసాలా టీలో వేసే అల్లం, లవంగాలు కండరాల నొప్పని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
  • ఇందులో కేలరీ తక్కువ పోషకాలు ఎక్కువ ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునే వారు కూడా మసాలా టీని తాగచ్చు.