Mutton Chops: మటన్ చాప్స్ ఇలా చేస్తే సూపర్ టేస్టీ, అతిథులకు వడ్డించి చూడండి, వారికి నచ్చడం ఖాయం
05 June 2024, 11:30 IST
- Mutton Chops: మటన్ వంటకాలు టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలాంటి మటన్ రెసిపీలు తినేకన్నా ఒకసారి కొత్తగా మటన్ చాప్స్ వండి చూడండి. ఇవి టేస్టీగా ఉంటాయి.
మటన్ చాప్స్ రెసిపీ
మటన్ తో కొత్తగా వంటకాలు ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే ఓసారి మటన్ చాప్స్ వండి చూడండి. ఇది మీకు నచ్చడం ఖాయం. ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఈ మటన్ చాప్స్ పెట్టండి… వారికి ఇవి నచ్చడం ఖాయం. మన దేశంలో ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్. ఆయన మటన్ చాప్స్ ఎలా చేయాలో తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పారు. ఆ రెసిపీని ఇక్కడ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.
మటన్ చాప్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ చాప్స్ - ఎనిమిది
పెరుగు - ముప్పావు కప్పు
కారం - రెండు స్పూన్లు
ధనియాల పొడి - రెండు స్పూన్లు
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి తగినంత
ఆవనూనె - మూడు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
మటన్ చాప్స్ రెసిపీ
- మటన్ చాప్స్ రెసిపీ కోసం మటన్ ముక్కలను తెచ్చుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- మటన్ చాప్స్ ఒక గిన్నెలో వేసి పెరుగు, ఎండుమిర్చి పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి అన్నీ కలపాలి. అరగంట పాటూ పక్కన వదిలేయాలి.
- స్టవ్ మీద కళాయి పెట్టి ఆవనూనె వేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి టొమాటోలు మెత్తబడే వరకు ఉడికించాలి.
- తర్వాత మటన్ మిశ్రమం వేసి మూడు నాలుగు నిమిషాలు హై హీట్ మీద వేయించాలి.
- తర్వాత మంట తగ్గించి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి 40-45 నిమిషాలు ఉడికించాలి..
- మరో బాణలిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి వేసి వేయించి మటన్ మిశ్రమంలో వేయాలి.
- కొత్తిమీరను పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే మటన్ చాప్స్ రెడీ అయినట్టే.
- మటన్ చాప్స్ ను సర్వింగ్ బౌల్ వేసుకోవాలి. పైన నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేయాలి. అంతే మటన్ చాప్స్ తినేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మటన్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అలాగే విటమిన్ బి12, విటమిన్ బి6, నియాసిన్, ఫాస్పరస్, జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైనవి. జీవక్రియను పెంచేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు, ఎముకల ఆరోగ్యానికి మటన్ చాలా అవసరం. మటన్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె పోటు, కిడ్నీ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి మటన్ వంటకాలను వారానికి ఒకసారి తింటే ఎంతో మంచిది.
టాపిక్