LIC: ఎల్ఐసీ సూపర్ ప్లాన్.. రోజూ రూ. 29 డిపాజిట్ చేస్తే రూ. 4 లక్షలు రిటర్న్
15 April 2022, 18:19 IST
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC).. ఆధార్ శిల ప్లాన్ (LIC Aadhaar Shila Plan) పేరుతో అద్భుతమైన ప్లాన్ పరిచయం చేసింది.
LIC
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో అద్భుతమైన స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. . ఎల్ఐసీ ఆధార్ శిల ప్లాన్ (LIC Aadhaar Shila Plan) పేరుతో ఈ పాలసీని పరిచయం చేసింది. మీరు ప్రతి రోజూ రూ.29 చొప్పున జమ చేస్తే.. ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ సమయంలో రూ.4 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. LIC ఆధార్ శిలా యోజన అనేది మహిళలలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద బీమా కంపెనీ, అన్ని రకాల వయసు గల వారికి ఎల్ఐసీ.. బీమా ఎంపికలను అందిస్తుంది. బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌ల తర్వాత, LIC స్కీమ్‌లు డబ్బును ఆదా చేయడానికి ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్. ఎల్‌ఐపీ మెచ్యూరిటీపై నమ్మకంగా నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంది.
LIC ఆధార్ శిలా యోజన కింద కనీస పాలసీ హామీ మొత్తం రూ.75,000 వరకు ఉండగా.. గరిష్ట ప్రాథమిక హామీ మొత్తం రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ఈ పాలసీ మెచ్యూరిటీ వ్యవధి 10 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ప్రీమియంలను నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.
ఎల్ఐసీ ఆధార్ శిల ప్లాన్‌ను మహిళలు, ఆడపిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఈ పాలసీ తీసుకోవాలంటే పాలసీహోల్డర్‌కు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా కావాలి. మహిళలలు ఎవరైనా ఈ పాలసీ సులువుగా తీసుకోవచ్చు. 8 ఏళ్ల నుంచి గరిష్టంగా 55 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పాలసీకి అర్హులు. ఈ పాలసీ మెచ్యూరిటీ వ్యవధి 10 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ప్రీమియంలను నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.
రూ.4 లక్షల రాబడి
మీరు ఎల్‌ఐసి ఆధార్ శిలా యోజనలో రోజుకు రూ. 29 ఆదా చేస్తే, సంవత్సరంలో రూ.10,959 వరకు డిపాజిట్ అవుతాయి. అదే 20 సంవత్సరాలలో రూ. 2,14,696 వరకు పెట్టుబడి పెడతారు. చివరకు ఈ స్కీం మెచ్యూరిటీపై రూ. 3,97,000 రాబడిని పొందవచ్చు. ఇంచు మించుగా రూ.4 లక్షల రిటర్న్ పొందుతారు
ఆదాయపు పన్ను ప్రయోజనాలు
LIC ఆధార్ శిలా పాలసీ కింద ఆటో కవర్‌ను కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ స్కీం ద్వారా ఆదాయపు పన్ను ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ పాలసీ కోసం, LIC ద్వారా 15 రోజుల ఉచిత లుక్ పీరియడ్ ఇవ్వబడుతుంది. పాలసీలో పొందిన తర్వాత మీరు రెగ్యులర్ ప్రీమియం చెల్లించాలి. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ప్రీమియం విషయానికి వస్తే నెలవారీగా కాకుండా, మీరు త్రైమాసికంగా, అర్ధ వార్షిక ప్రాతిపదికన కూడా ప్రీమియం చెల్లించవచ్చు. పాలసీ టర్మ్ ఐదేళ్లు వరకు ఉంటుంది. కనీసం 5 వార్షిక ప్రీమియంలు చెల్లించినట్లయితే, పాలసీదారు నిష్క్రమణ సమయంలో లాయల్టీ అదనంగా పొందుతారు.
టాపిక్