Changed Mindset: యువత తీరు మారింది.. కాబోయే భాగస్వామిలో ఏం ఉండాలని కోరుకుంటున్నారో తెల్సా
16 August 2024, 19:28 IST
Changed Mindset: అబ్బాయిలకు, అమ్మాయిలకు పెళ్లి విషయంలో ఉండే అభిప్రాయాలు మారుతూ వస్తున్నాయి. వాళ్లు కోరుకునే భాగస్వామి విషయంలో వాళ్ల ఆలోచనా తీరు మారింది. పెళ్లి గురించి చేసిన సర్వే, ఆహారపు అలవాట్ల గురించి చేసిన సర్వేలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అవేంటో చూడండి.
యువతలో పెళ్లి విషయంలో మారిన అభిప్రాయాలు
అమ్మాయి అందంగా, సౌమ్యంగా, తెల్లగా ఉండాలి. ఇవే ఇది వరకు పెళ్లి కూతురుని చూసేటప్పుడు పట్టించుకునే విషయాలు. చాలా కాలంగా అమ్మాయిల వివక్షకు కారణమవుతున్న విషయాలు కూడా ఇవే. కానీ కొత్త తరం యువతలో కాబోయే భార్య గురించి ప్రాధాన్యత మారిపోయింది. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. గతంలో అమ్మాయిల రంగు, స్వభావం గురించి అనేక విషయాలు దాచిపెట్టి పెళ్లి చేయాలనుకునేవారు. ఇప్పుడు వాళ్లే ప్రత్యేకంగా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లో వాళ్ల ఇష్టాలను తెలుపుతు ప్రొఫైల్ తయారు చేసుకుంటున్నారు.
అలాంటి అమ్మాయిలు కావాలి:
ఇప్పటి అబ్బాయిలు.. అమ్మాయిల అందానికి, సౌమ్య స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని సర్వే చెబుతోంది. తెలివితేటలుండి, ఉద్యోగం చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు, సున్నితంగా ఉండే అమ్మాయిలకు కావాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా వధూవరులిద్దరికీ ధైర్యంగా ఉండే, సొంతంగా నిర్ణయాలు తీసుకునే, అతిగా ఆలోచించని భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న బాలికల్లో 46 శాతం మంది తమకు పెళ్లి కంటే కెరీర్ ముఖ్యమని చెప్పారు.
నేటి తరానికి ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యం. ఈ సర్వేతో సంబంధం ఉన్న రిలేషన్ షిప్ అడ్వైజర్ పూర్ణిమా భాస్కర్ మాట్లాడుతూ "ఈ మార్పు సమాజానికి చాలా ముఖ్యం. కొన్ని వివక్షల కారణంగా అమ్మాయిల ఆత్మవిశ్వాసం తరచుగా బలహీనపడుతుంది. అటువంటి మార్పు ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది వేస్తుంది. అన్నారు.
సర్వే వివరాలు:
యువర్ దోస్త్ అనే యూట్యూబ్ ఛానల్ ఇటీవల 5,000 మందిపై సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 72.2 శాతం మంది పనిలో ఒత్తిడికి గురవుతున్నట్లు అంగీకరించగా, 52 శాతం మంది పనిచేసే పురుషులు ఒత్తిడికి గురయ్యామన్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయానికి వస్తే, 18 శాతం మంది వర్కింగ్ ఉమెన్స్ దాన్ని సాధించడానికి కష్టపడుతున్నామని చెప్పారు. ఈ సర్వే ప్రకారం 20 శాతం మంది మహిళలు ఎల్లప్పుడూ నిరాశతో ఉంటున్నామని అంగీకరించారు. ఎమోషనల్ స్టేట్ ఆఫ్ ఎంప్లయి రిపోర్ట్ ప్రకారం 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఒత్తిడి శాతం ఎక్కువగా ఉందని తేలింది.
పండ్లు, కూరగాయలు:
తాజాగా ఆహారపు అలవాట్ల గురించి మరో అధ్యయనం కూడా జరిగింది. ఫిట్ నెస్ ట్రాకింగ్ యాప్ మై ఫిట్నెస్ పాల్ తాజా అధ్యయనంలో ప్రతి ఐదుగురిలో నలుగురు కొనుగోలు చేసినంతగా కూరగాయలు, పండ్లు తినడం లేదని వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం చాలా మంది ప్రతిరోజూ పండ్లు, ఆకుకూరలు తినాలని వారం ప్రారంభంలో నిర్ణయించుకుంటారట. కానీ మంగళవారం నాటికి ఆ ప్రామిస్‌కు బ్రేక్ పడుతోందట.
ఆహార పానీయాలకు సంబంధించిన అపోహలపై చేసిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 18 శాతం మంది తమకు అజీర్ణ సమస్యలు ఉన్నాయని అంగీకరించారు. 15 శాతం మంది తమకు మలబద్ధకం సమస్య ఉందని, 22 శాతం మంది వివిధ కారణాల వల్ల తాము కోరుకున్న ఆహారం తీసుకోలేకపోతున్నామని అంగీకరించారు. ఆహారానికి ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని పట్టించుకోని వారూ ఉన్నారిందులో. "ఈ అధ్యయనం సగటు వ్యక్తికి వారి పేగు ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన ఎంత తక్కువగా ఉందో తెలుపుతోంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న మూడింట రెండు వంతుల మంది ప్రజలు తమకు ఆహారం, పానీయాలు సరిగ్గానే తీసుకుంటామని నమ్ముతున్నప్పటికీ, వారి ఆరోగ్యం పేలవంగానే ఉంది.