HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Manuka Honey: మామూలు తేనె మానేసి మానుకా తేనె వాడండి.. ఈ ఉత్తమ తేనె ప్రత్యేకత ఇదే

Manuka Honey: మామూలు తేనె మానేసి మానుకా తేనె వాడండి.. ఈ ఉత్తమ తేనె ప్రత్యేకత ఇదే

04 August 2024, 14:30 IST

  • Manuka Honey: మానుకా తేనె కాస్త ముదురు రంగులో ఉంటుంది. మామూలు తేనె కన్నా కాస్త వేరుగా ఉంటుంది. చర్మానికి, పేగు ఆరోగ్యానికి దీనివల్ల లాభాలుంటాయి. ఈ మానుకా తేనె ప్రయోజనాలు తెల్సుకోండి.

మానుకా తేనె
మానుకా తేనె (freepik)

మానుకా తేనె

మానుకా తేనె చాలా ప్రత్యేకమైనది. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాల్లో ఇది ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. మానుకా చెట్టు మకరందాన్ని వాడి ఈ తేనె తయారు చేస్తారు. బంగారు లేదా ముదురు గోదుమ రంగుల్లో ఉంటుందిది. మామూలు తేనెకన్నా దీని తీపి కాస్త తక్కువగా ఉంటుంది. దీనికున్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల తినడానికే కాకుండా కొన్ని వైద్య ప్రయోజనాల కోసం దీన్ని వాడతారు.

మామూలు తేనెకీ మానుకా తేనెకీ తేడా?

అన్ని రకాల తేనెల్లోనూ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. దీనివల్లే తేనెకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వస్తాయి. మానుకా తేనెలో మిథైల్ గ్లైయోక్సాల్ శాతం ఎక్కువుంటుంది. ఇది తేనె ప్రయోజనాలను మరింత పెంచుతుంది. అలాగే సాధారణ తేనె కన్నా మానుకా తేనె కాస్త చిక్కగా, రుచిలో గాఢత కాస్త ఎక్కువగానూ ఉంటుంది.

మానుకా తేనె రోజూ తినొచ్చా?

మామూలు తేనె లాగే దీన్ని కూడా రోజు వాడొచ్చు. రోజులో రెంటు చెంచాల తేనె తీసుకోవచ్చు. అయితే తేనెలో కూడా సహజ చక్కెరలుంటాయనే విషయం మర్చిపోకూడదు. ఎక్కువగా తింటే శరీరం మీద ప్రభావం పడుతుంది.

ఈ తేనెను ఎలా వాడాలి?

1. రోజూ నేరుగానే ఈ తేనెను తీసుకోవచ్చు. దాని ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి ఇది ఉత్తమ మార్గం.

2. హెర్బల్ టీలు, కాఫీలు, లేదంటే వేడి నీళ్లలో కలిపి అయినా ఈ తేనె తీసుకోవచ్చు.

3. పెరుగులో, లేదా టోస్ట్ బ్రెడ్ మీద రాసుకుని తీసుకోవచ్చు.

4. చర్మం సమస్యలు తగ్గించడానికి దీన్ని నేరుగా రాసుకోవచ్చు.

5. వేడి చేయడం వల్ల దీని పూర్తి ప్రయోజనాలు పొందలేం. అయినా కూడా వంటల్లో, బేకింగ్ చేసేటప్పుడు ఈ తేనె వాడొచ్చు. కొద్దిపాటి లాభాలైతే పొందగలం.

ఎన్నో ప్రయోజనాలు:

గాయాలు మాన్పడంలో:

2011లో ఏషియన్ పసిఫిక్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ బయోమెడిసిన్ పరిశోధనలో మానుకా తేనె ప్రత్యేకత గురించి వివరించారు. దీనికున్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం మీద అయిన గాయాలు తగ్గించడంలో సాయపడతాయి. కాలిన గాయాలనూ తగ్గిస్తాయి. నొప్పి తగ్గించి గాయం తొందరగా మానేలా ఈ తేనె సాయపడుతుంది.

క్యాన్సర్:

మానుకా తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరం దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. సహజం యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లాగా సాయపడుతుంది.

గొంతు నొప్పి:

గొంతులో నొప్పి ఉంటే ఈ తేనె తగ్గిస్తుంది. దీనికుండే యాంటీ వైరల్ లక్షణాలు దీనికి సాయపడతాయి. ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియాతో పోరాడి నొప్పి తగ్గిస్తుంది. జలుబు, దగ్గుకు ఈ తేనె మంచి మందు.

జీర్ణశక్తి:

యాసిడ్ రిఫ్లక్స్, అజీర్తి, కడుపులో అల్సర్లు లాంటివుంటే ఈ తేనె వాడొచ్చు. పేగులో ఉండే మైక్రోబయోటాను ఇది సమతుల్యం చేస్తుంది. దాంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. జీర్ణ సంబంధిత వ్యాధుల్ని నయం చేస్తుంది.

చర్మ అందానికి:

యాక్నె సమస్య ఉంటే ఈ మానుకా తేనెను చర్మానికి రాసుకోవచ్చు. దీనికుండా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమస్య తగ్గిస్తాయి. చర్మం మీద ర్యాషెస్ ఉన్నా తగ్గిపోతాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి

టాపిక్

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్