తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Viral Meesho Products: 200 రూపాయల్లోపే వైరల్ మీషో ప్రొడక్ట్స్.. వర్షాకాల సమస్యలు తీరినట్లే

Viral Meesho products: 200 రూపాయల్లోపే వైరల్ మీషో ప్రొడక్ట్స్.. వర్షాకాల సమస్యలు తీరినట్లే

26 July 2024, 10:30 IST

google News
  • Viral Meesho products: మీషో యాప్ లో వర్షాకాలంలో ఉపయోగపడే వస్తువులు కొన్ని అందుబాటులో ఉన్నాయి. కేవలం 200 రూపాయల్లోనే దొరకుతున్న మీషో ఉత్పత్తులు ఏంటో చూడండి.

మీషో వైరల్ ప్రొడక్ట్స్
మీషో వైరల్ ప్రొడక్ట్స్

మీషో వైరల్ ప్రొడక్ట్స్

మీషో షాపింగ్ యాప్‌ ప్రొడక్ట్స్ చాలా వైరల్. తక్కువ ధర ఉత్పత్తులకు ఈ యాప్ పెట్టింది పేరు. అయితే వర్షాకాలంలో ఉపయోగపడే వస్తువులు కొన్ని మీషో యాప్ లో అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలోనే అంటే కేవలం 500 రూపాయల్లోపే ఉన్న ఈ వస్తువులేంటో చూడండి.

కార్ మిర్రర్ ఫిల్మ్స్:

వర్షాకాలంలో కారు సైడ్ మిర్రర్స్ మీద వర్షపు నీళ్లు పడి వెనక వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించవు. ఈ సమస్యను పూర్తిగా ఈ కార్ మిర్రర్ ఫిల్మ్స్ తగ్గిస్తాయి. వీటిని నీళ్లు స్ప్రే చేసి స్టిక్కర్ లాగా కారు అద్దాలకు అంటించేసి తీసేస్తే అద్దానికి ఒక కోటింగ్ స్టిక్కర్ లాగా ఉంటుంది. దాంతో నీటి బిందువులు పడినా ఆగవు, జారిపోతాయి. అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. వీటి ధర 200 రూపాయల దాకా ఉందంతే.

వాటర్ ప్రూఫ్ షూ కవర్:

వర్షం పడిన రోజు షూ గనక వేసకుని నడవాల్సి వస్తే ఎంత పాడైపోతాయో చెప్పలేం. ముఖ్యంగా పిల్లలు స్కూలు నుంచి వచ్చేటప్పుడు బురదలో నడిస్తే మరీ పాడైపోతాయి. అలాంటప్పుడు షూ మీద నుంచి ఈ వాటర్ ప్రూఫ్ కవర్ సాక్స్ లాగా తొడిగేయొచ్చు. దాంతో షూ నీటిలో తడవవు. వీటి ధర 200 రూపాయల్లోపే. వీటిలో డిస్పోజబుల్, రీ యూజబుల్ రకాలున్నాయి.

రెయిన్ కార్డ్, రెయిన్ బాల్:

వర్షాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో ఊహించలేం. అలాగనీ ప్రతిసారి వెంట రెయిన్ కోట్ పట్టుకుని తిరగలేం. కానీ ఈ రెయిన్ కార్డ్ రెయిన్ కోట్ మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సైజుంటుంది. చక్కగా పర్సులోనూ ఇమిడిపోతుంది. అవసరమైనప్పుడు తీసి వాడుకోవడమే. వీటిలో డిస్పోజబుల్ రకాలు, రీయూజబుల్ రకాలుంటాయి. వీటి ధర 150 కన్నా తక్కువే.

వీటిలోనే ఇంకోరకం రెయిన్ బాల్. అంటే రెయిన్ కోట్ కీచైన్ లాగా తగిలించుకోవచ్చు. అది చిన్న పింగ్ పాంగ్ బాల్ సైజులో ఉంటుంది. బ్యాగుకో, వ్యాలెట్ కో, బాటిల్ కో తగిలించేయొచ్చు దీన్ని. అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకోవడమే. దీని ధర కూడా 150 కంటే తక్కువే. కాస్త ఓపిగ్గా వెతికితే పాకెట్ రెయిన్ కోట్స్, డిస్పోజబుల్ రెయిన్ కోట్స్ లాంటివి చాలా అందుబాటులో ఉన్నాయి. ధర అవసరం బట్టి ఎంచుకోవచ్చు.

హుక్స్ రోప్:

వర్షాకాలంలో అతి పెద్ద సమస్య బట్టలు ఆరకపోవడం. వాటిని ఆరేయడానికి స్థలమే సరిపోదు. వర్షం పడుతుందంటే ఆరుబయట బట్టలు తెచ్చేలోపో తడిసిపోతాయి. అలాంటప్పుడు ఈ హుక్స్ రోప్ వాడండి. దీనికి తాడుకే బట్టల క్లిప్పుల్లాగా ఉంటాయి. టక్కుమని అవసరం అయినప్పుడు ఎక్కడైనా తగిలించుకోవచ్చు. వెంటనే తీసేయొచ్చు. దీని ధర కూడా 200 రూపాయల లోపే.

బ్యాగ్ కవర్స్:

వర్షంలో బ్యాగు తడవకుండా బ్యాగు మొత్తానికి కవర్ వేస్తే అందులోఉన్న వస్తువులేవీ తడవవు. అనుకోకుండా వర్షంలో తడిసినా ఏ భయం అక్కర్లేదు. ముఖ్యంగా పిల్లల బ్యాగుకు ఇవి వాడితే బెస్ట్. పుస్తకాలు తడిసిపోవు. వీటి ధర 100 నుంచి 150 రూపాయల్లోపు ఉందంతే.

 

తదుపరి వ్యాసం