Hair styles: జుట్టు వదిలిపెట్టడం ట్రెండ్ కాదిప్పుడు.. కొత్త స్టైల్స్ చూడండి..
Published Jul 15, 2024 08:00 AM IST
Hair styles: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో పలువురు బాలీవుడ్ నటీమణుల హెయిర్ స్టైల్ ఆకట్టుకుంది. వాటిని మీరు కూడా సులభంగా ప్రయత్నించవచ్చు.
హెయిర్ స్టైల్స్
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహానికి సెలెబ్రిటీలంతా అబ్బుర పరిచే నగలు, దుస్తులతో వచ్చారు. కానీ వాళ్ల హెయిర్ స్టైల్స్ కూడా చాలా ప్రత్యేకంగా కనిపించాయి. కొందరు మాత్రమే లూజ్ హెయిర్, కర్లీ హెయిర్ తో కనిపించారు. మిగతా అంతా సిగ, జడలు, రకరకాల హెయిర్ స్టైల్స్‌లో కనిపించారు. అవేంటో చూడండి. ప్రత్యేక వేడుకలకూ మీరు కూడా వీటిని ప్రయత్నించొచ్చు.
జాహ్నవి కపూర్ జడ:
జుట్టు పొడవుగా ఉంటే జాన్వీ కపూర్ లాగా జడను కిందిదాకా అల్లుకోవాలి. కింద మీ దుస్తులకు మ్యాచింగ్ ఉండే బ్యాండ్ లేదా క్లిప్ పెట్టుకోవాలి. పాపిట మధ్యలో తీస్తే సాంప్రదాయ లుక్ వస్తుంది. ఇక వెనకవైపు మధ్యలో ఒక పిన్ పెట్టొచ్చు. చెంప స్వరాలు పెట్టుకున్నా లుక్ చాలా బాగుంటుంది. పాపిటలో పాపిట బిల్ల లేదా మాంగ్ టీకా పెట్టుకోవడం మర్చిపోవద్దు.
సౌత్ ఇండియన్ స్టైల్ బ్రైడ్:
జడబిల్లలను వాడే ట్రెండీగా జడ వేసుకోవచ్చు. కాస్త విభిన్న ఆకారాల్లో ఉన్నవాటిని ఎంచుకుంటే సరి. మెస్సీ జడను అల్లుకుని వాటిని పెట్టుకుంటే అటు సాంప్రదాయంగా ఉన్నట్లుంటుంది. ట్రెండీగానూ కనిపిస్తారు.
అనన్య పాండే లాగా జుట్టును స్ట్రెయిట్ చేసి, ఆపై పిన్స్ సహాయంతో సగం జుట్టును టక్ చేయండి. లేదా షనయా కపూర్ లాగా సగం జుట్టు తీసి పూన గుండ్రంగా సిగ లాగా చేసి సగం వెంట్రుకలకే పూల కొప్పు పెట్టుకోవాలి.సిగ కొప్పు ఫ్యాషన్ ఎప్పటికీ ట్రెండ్ నుంచి పోదు. మిడ్ హై రేంజ్ లో బన్ లాగా పెట్టుకుని జాన్వీ కపూర్ లాగా రంగురంగుల పూలతో అలంకరించుకోండి.