Beauty hacks: ప్రతి అమ్మాయికి తెలియాల్సిన బ్యూటీ హ్యాక్స్..
25 June 2024, 17:30 IST
Beauty hacks: ఈ బ్యూటీ హ్యాక్స్ ప్రత్యేకత ఏమిటంటే దీని కోసం మీకు పెద్దగా సమయం, మేకప్ ఉత్పత్తులు కూడా అవసరం లేదు. వాటిని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎలా వాడాలో చూడండి.
beauty hacks
ఇంట్లో హాయిగా కూర్చొని ఉంటాం. ఉన్నట్లుండి హఠాత్తుగా ఎక్కడికైనా వెళ్లాల్సిరావచ్చు. ఆఫీసుకు వెళ్లాల్సిరావచ్చు. కానీ రెడీ అవ్వడానికి మీ దగ్గర సమయం లేకపోతే ఈ బ్యూటీ హ్యాక్స్ పనికొస్తాయి. ఇవి మీ సమస్యను సులభతరం చేస్తాయి. ఎక్కువ మేకప్ ఉత్పత్తులు అవసరం లేకుండా, చాలా తక్కువ సమయంలో రెడీ అయిపోవచ్చు. అవేంటో చూడండి..
ఎమర్జెన్సీలో పనికొచ్చే బ్యూటీహ్యాక్స్:
పెడిక్యూర్ చేసే సమయం లేదా?
మీ పాదాలు చాలా మురికిగా మారినట్లు అనిపిస్తే వెంటనే పెడిక్యూర్ చేయించుకుంటారు. కానీ దానికోసం పార్లర్ వెళ్లాలి. అందుకు సరిపడా సమయం లేకపోతే ఇంట్లోనే సింపుల్‌గా పెడిక్యూర్ చేయొచ్చు. ఒక గిన్నెలో తేనె, చక్కెర వేసి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను పాదాలకు 5 నిమిషాల పాటు మర్దనా చేయండి. మృతకణాలు తొలిగిపోవడమే కాకుండా, చర్మానికి మెరుపు వస్తుంది. మీ పాదాలు మెరిసిపోతాయి.
ఫౌండేషన్ లేకపోతే..
మీ దగ్గర ఫౌండేషన్ లేకపోతే, హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్‌లో కన్సీలర్ కలిపి ఫౌండేషన్ లాగా అప్లై చేసుకోవచ్చు. దాన్ని బ్యూటీ బ్లెండర్ తో ముఖానికి సరిగ్గా అప్లై చేసుకోవాలి. దీన్ని బేస్ లాగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి మంచి కవరేజీ లభిస్తుంది. మీ చర్మం రంగుకు నప్పే కన్సీలర్ ఉంటే చాలు.
కాజల్‌తో ఐషాడో చేసేయండి:
మీకు ఐషాడో లేకపోతే కంటి మేకప్ చేయడానికి కాజల్ పెన్సిల్ ఉపయోగించండి. ఇందుకోసం కనురెప్పల పై భాగంలో కాజల్ పెన్సిల్‌తో రెండు చుక్కలు పెట్టాలి. వేలితో దాన్ని తుడిచినట్లు చేసి రంగు కనురెప్ప అంతటా వచ్చేలా చేయాలి. కాస్త మెరిసే లుక్ రావాలంటే మీద కొద్దిగా లిప్ బామ్ అద్దితే సరిపోతుంది.
డ్రై షాంపూ:
దీని గురించి వినే ఉంటారు. కానీ ఒక్కసారి ఉపయోగిస్తే ఇది వాడటం ఎంత సులభమో అనిపిస్తుంది. అనుకోకుండా ఎక్కడికైనా వెళ్లాల్సివచ్చినప్పుడు.. తలస్నానం చేసే సమయం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ డ్రై షాంపూ వాడండి. దీన్ని తలకు రాసుకుని జుట్టును కుదుళ్ల నుంచి చివర్ల దాకా రాస్తున్నట్లు చేస్తే చాలు. జుట్టు పొడిగా అయిపోతుంది.
బ్లష్ తయారు చేయడానికి.. :
కొద్దిగా కొబ్బరి నూనెను గులాబీ లేదా ఎరుపు రంగు లిప్ స్టిక్ లో కలిపి బ్లష్ గా ఉపయోగించండి. కాస్త లేత రంగు షేడ్ కావాలనుకుంటే అందులో రెండు చుక్కల లిక్విడ్ ఫౌండేషన్ లేదా బీబీ క్రీమ్ కలుపుకుంటే సరిపోతుంది.
టాపిక్