తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Tea: ప్రతిరోజూ మూడు కప్పుల గ్రీన్ టీ తాగండి చాలు, ఆ వ్యాధులు రావు

Green Tea: ప్రతిరోజూ మూడు కప్పుల గ్రీన్ టీ తాగండి చాలు, ఆ వ్యాధులు రావు

Haritha Chappa HT Telugu

16 January 2025, 10:30 IST

google News
  • Green Tea: గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్త అధ్యయనం ప్రకారం మెదడు ఆరోగ్యానికి తోడ్పడే యాంటీఆక్సిడెంట్లు గ్రీన్ టీలో అధికంగా ఉంటాయి. కాబట్టి మెదడు సంబంధ వ్యాధులు గ్రీన్ టీ వల్ల రాకుండా ఉంటాయి.

గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు
గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు (Shutterstock)

గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు

వయస్సు పెరిగేకొద్దీ, మెదడు ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి, వాస్కులర్ సమస్యలు, చిత్తవైకల్యం, ఇతర న్యూరోడెజెనరేటివ్ పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గించే ఆహారం, పానీయాలను తినాల్సిన అవసరం ఉంది. ఎన్ పీజే సైన్స్ ఆఫ్ ఫుడ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ ప్రతిరోజూ తాగడం వల్ల మెదడు ఆరోగ్యం క్షీణించకుండా కాపాడుతుంది. ఈ పాపులర్ డ్రింక్ తినడం వల్ల ప్రయోజనాల గురించి అధ్యయనం వివరించింది.

మెదడు ఆరోగ్యంపై గ్రీన్ టీ ప్రభావం

బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ శక్తివంతమైన పానీయంగా ఇప్పటికే ఎంతో గుర్తింపు పొందింది. గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఈ కొత్త అధ్యయనం, గ్రీన్ టీ ఇచ్చే ప్రయోజనాలను మరింతగా వివరించింది. మెదడు ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది.

గ్రీన్ టీ తాగడం మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. మెదడులో ఉండే సెరిబ్రల్ వైట్ మ్యాటర్ గాయాలను తగ్గిస్తుంది. వయసు పెరిగే కొద్దీ మెదడుకు తెల్ల పదార్థం దగ్గర ఉన్న గాయాలు వంటి సమస్యలు వస్తాయి. తెల్ల పదార్థ గాయాలు చిన్న నాళాల వ్యాధులను సూచిస్తాయి. ఇవి అభిజ్ఞా క్షీణత, వాస్కులర్, చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధితో ముడిపడి ఉంటాయి. అమెరికన్ బ్రెయిన్ ఫౌండేషన్ ప్రకారం, ఇన్ ఫ్లమ్మేషన్ వల్ల మెదడులోని ధమనుల సంకుచితం వల్ల చిన్న నాళాల వ్యాధులు సంభవిస్తాయి.

గ్రీన్ టీ ఎంత తాగాలి?

గ్రీన్ టీ తాగిన వారిలో మెదడులోని తెల్ల పదార్థం దగ్గర గాయాలు తక్కువగా ఉన్నాయని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి. ఫలితాలను విశ్లేషించిన తరువాత పరిశోధకులు గ్రీన్ టీని ఎంత తాగాలో చెప్పారు.

రోజూ దాదాపు మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. అంతకంటే ఎక్కువ గ్రీన్ టీ తాగక పోవడమే మంచిది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కాటెచిన్ అని పిలిచే సమ్మేళనం ఉందని అధ్యయనం వివరించింది, ఇది మెదడులో వాస్కులర్ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

కాబట్టి పాలతో చేసిన టీలు, కాఫీలు తాగే బదులు ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. గ్రీన్ టీ రుచి నచ్చక ఎంతో మంది తాగేందుకు ఇష్టపడరు. కానీ అందులో ఒక స్పూను తేనె కలుపుకుని తాగితే ఎంతో మంచిది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

తదుపరి వ్యాసం