తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Hacks: మీ ఖరీదైన లిప్‌స్టిక్ విరిగిపోయిందా? బాధపడకండి ఈ టిప్స్‌తో మళ్ళీ కొత్తదానిలా మార్చుకోవచ్చు!

Beauty Hacks: మీ ఖరీదైన లిప్‌స్టిక్ విరిగిపోయిందా? బాధపడకండి ఈ టిప్స్‌తో మళ్ళీ కొత్తదానిలా మార్చుకోవచ్చు!

Ramya Sri Marka HT Telugu

14 January 2025, 14:00 IST

google News
  • Beauty Hacks: మీ ఖరీదైన లిప్‌స్టిక్ విరిగిపోయిందా?  బ్యాగులోని ఇతర వస్తువులతో కలిసిపోయి పాడైపోయిందా? దాన్ని పడేయడం తప్ప వేరే మార్గం లేదని బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ బ్యూటీ హాక్స్‌తో విరిగిపోయిన మీ ఫేవరెట్ లిప్‌స్టిక్‌ను మళ్ళీ కొత్తదానిలా మార్చుకోవచ్చు.  అవేంటో తెలుసుకుందాం రండి.

beauty hacks to fix broken lipsticks
beauty hacks to fix broken lipsticks (shutterstock)

beauty hacks to fix broken lipsticks

మేకప్ అంటే లిప్‌స్టిక్ లేకుండా పూర్తి కాదు. మేకప్ ఇష్టపడని వారు కూడా కేవలం పెదవులకు లిప్‌స్టిక్ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ముఖం అందాన్ని, రూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే చాలా మంది మహిళలు తమకు ఇష్టమైన బ్రాండ్, షేడ్స్‌లో లిప్‌స్టిక్‌లను తీసుకుంటు ఉంటారు. పెదవులకు రాసుకునేవి కాబట్టి ఖరీదైన వాటినే ఎంచుకుంటారు. దాన్ని ఎప్పటికీ పర్సులో పెట్టుకుని తమతో పాటే తీసుకెళతారు. వేరే వాళ్లతో లిప్‌స్టిక్‌ను పంచుకోవడానికి కూడా ఇష్టపడరు.

ఎంత జాగ్రత్తగా ఉంచినప్పటికీ కొన్ని సార్లు పర్సులోని ఇతర వస్తువులతో కలిసిపోయిన లిప్‌స్టిక్ పాడైపోతుంది. అలాగే కంగారులో ఎప్పుడైనా పెదవులకు రాసుకుంటున్నప్పుడు విరిగిపోతుంది. అలాంటి సమయంలో దాన్ని పారేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రతి మహిళా బాధపడుతుంది. మీకు కూడా ఇలాగే జరిగితే మీకు ఇష్టమైన లిప్‌స్టిక్‌ను పారేయడానికి బదులుగా ఈ బ్యూటీ హాక్స్ సహాయంతో దాన్ని మళ్ళీ కొత్తదిగా చేసుకోండి.

హీటింగ్(వేడి చేయడం):

విరిగిపోయిన మీ లిప్‌స్టిక్‌ను తిరిగి కొత్తదానిలా మార్చడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం తాపన ప్రక్రియ. ఈ పద్ధతిలో విరిగిన లిప్ స్టిక్ భాగాలను అతికించడానికి మీకు వేడి సహాయం కావాలి. ఇందుకోసం మీరు ఒక చెంచా(స్పూన్) తీసుకుని దాన్ని తేలికగా వేడి చేసి విరిగిన లిప్‌స్టిక్ అంచులకు అప్లై చేయాలి. రెండు అంచులకు వేడి సెగ తాకగానే అవి కాస్త కరగుతాయి. అలా కరుతున్న సమయంలో రెండింటినీ అతికించి పక్కక్కు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూస్తే మీ లిప్‌స్టిక్ చక్కగా అతుక్కుని కనిపిస్తుంది. మునుపటిలానే పనిచేస్తుంది.

ఫ్రీజింగ్( గడ్డ కట్టించడం) :

లిప్‌స్టిక్ ఇటీవల విరిగిపోయిన వెంటనే దాన్ని అతికించి ఫ్రిజీర్లో పెట్టారంటే అది అతుక్కుంటుంది. ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు డీప్ ఫ్రిజ్ లో పెట్టి తర్వాత బయటకు తీయండి. అంతే విరిగిన మీ ఖరీదైన లిప్ స్టిక్ అతుక్కుని కొత్తదానిలా మారిపోతుంది. మళ్లీ మీరు చక్కగా దీన్ని ఉపయోగించవచ్చు.

మెల్టింగ్ (కరిగించడం):

చాలాసార్లు లిప్ స్టిక్‌బాగా పాడైపోతుంది. హీటింగ్, ఫ్రీజింగ్ పద్ధతులతో కూడా దీన్ని అతికించలేనంతగా విరిగిపోతుంది. మీకు కూడా ఇలాగే జరిగితే మీకు ఇష్టమైన లిప్‌స్టిక్‌ను బయట పడేయకండి. లిప్ స్టిక్ ముక్కలన్నింటినీ శుభ్రం చేసి కరిగించండి. తరువాత కరిగిన మిశ్రమాన్ని కొత్త లిప్‌స్టిక్ కేస్ లో పోయండి. బుల్లెట్ లిప్‌స్టిక్ బ్రష్ సహాయంతో మీరు ఈ లిప్‌స్టిక్‌ను తిరిగి ఉపయోగించవచ్చు. మీ లిప్‌కలర్‌ను మునపటిలా ఆస్వాదించవచ్చు.

లిప్‌బాబ్:

ఇవన్నీ కాదనుకుంటే విరిగిపోయిన లిప్ స్టిక్ తో లిప్‌బాబ్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం విరిగిపోయిన ముక్కలన్నింటినీ ఒక ప్యాన్‌లో వేసి వేడి చేయండి. తర్వాత ఈ మిశ్రమంలో కొత్త బ్యూటీ ఉత్పత్తులను కలిపుకుని చిన్న గాజు సీసాలో లేదా డబ్బాలో పోసుకోండి. ఇది మీకు లిప్‌బామ్ లాగా సహాయపడుతుంది.

లిప్ గ్లాస్:

విరిగిన లిప్‌స్టిక్‌తో లిప్‌గ్లాస్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం విరిగిన లిప్‌స్టిక్‌ను మెత్తటి పేస్టులా చేసి దాంట్లో కాంతివంతమైన గ్లిట్టర్స్ లేదా పెర్ల్స్ వంటి పదార్థాలను కలుకోవచ్చు. ఇది మీరు పెదవులకు చక్కగా గ్లాసీ‌లుక్‌ను ఇస్తుంది.

తదుపరి వ్యాసం