తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  School Kids Safety In Rain। వర్షంలో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా? పేరేంట్స్ ఇది మీకే!

School Kids Safety in Rain। వర్షంలో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా? పేరేంట్స్ ఇది మీకే!

HT Telugu Desk HT Telugu

20 July 2023, 8:00 IST

google News
    • Monsoon Safety Tips for School Kids: వర్షాకాలంలో పిల్లలను పాఠశాలకు పంపే తల్లిదండ్రులు.. కొన్ని ముఖ్యమైన భద్రతా చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి. 
monsoon Safety Tips for School Kids:
monsoon Safety Tips for School Kids: (istock)

monsoon Safety Tips for School Kids:

Monsoon Safety Tips for School Kids: వర్షాకాలం అంటే మనందరికీ ఇష్టమైన సీజన్. ఇది చాలా అందమైన జ్ఞాపకాలను, వినోదాన్ని అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ సీజన్ ఎంతో ప్రత్యేకమైనది. వర్షంలో తడవటం, బురద నేలల్లో ఆటలు ఆడటం, కాగితపు పడవలను వదలడం వంటివి వారికెంతో సరదా. అదే సమయంలో పిల్లల ఆరోగ్యానికి సంబంధించి, వారి భద్రతకు సంబంధించి కొన్ని ఆందోళనలు కూడా తల్లిదండ్రులకు ఉంటాయి. వర్షాకాలంలో పిల్లలను పాఠశాలకు పంపడం దగ్గర్నించీ వారు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఒక బెంగ ఉంటుంది.

ఈ నేపథ్యంలో పిల్లలను స్కూలుకు పంపే తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉండేందుకు నిపుణులు కొన్ని ముఖ్యమైన భద్రతా చిట్కాలను అందించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.

స్కూల్ అన్ని వివరాలను తీసుకోండి

మీ పిల్లలను పాఠశాలకు పంపే ముందు, అవసరమైన అన్ని వివరాలను స్కూల్ నుంచి సేకరించండి. వారి రవాణా ఏర్పాట్లు, స్కూల్ వాహనంలో మీ పిల్లలతో పాటు వెళ్ళే ఇతర విద్యార్థులు ఎంతమంది, అందులోని ఉపాధ్యాయుల కాంటాక్ట్, డ్రైవర్ కాంటాక్ట్ అన్నింటిని తీసుకోండి. ఒకవేళ అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిస్తే స్కూల్ యాజమాన్యం అమలు చేసే భద్రతా చర్యల గురించి ఆరా తీయండి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించటానికి వైద్య సదుపాయాలు ఏమైనా ఉన్నాయా మొదలైన అన్ని వివరాలు సేకరించండి.

పిల్లలకు కఠినమైన సూచనలు ఇవ్వండి

పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వర్షాకాలంలో ఎలా మెలగాలి అనే దానిపై కఠినమైన సూచనలు ఇవ్వండి. అపరిచితులతో సన్నిహితంగా ఉండకూడదని లేదా వారి నుండి ఏదైనా తినుబండారాలు అంగీకరించకూడదని నొక్కి చెప్పండి. మీ పిల్లలను ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా, ఉపాధ్యాయులు, స్నేహితులతోనే ఉండేలా ప్రోత్సహించండి. ఎక్కడికైనా వెళ్లే ముందు ఉపాధ్యాయుల నుండి అనుమతి తీసుకోవాలని వారికి నేర్పండి.

నీరు నిలిచిన చోట అప్రమత్తంగా ఉండమనండి

వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల వైపు వెళ్లకుండా మీ పిల్లలకు జాగ్రత్తలు చెప్పండి. ఓపెన్ డ్రెయిన్‌లు, మ్యాన్ హోల్స్, కరెంటు స్తంభాలు మొదలైన ప్రమాదాలు పొంచి ఉండవచ్చు. కాబట్టి, అలాంటి ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండేలా మీ పిల్లలను హెచ్చరించండి.

వర్షంలో తడవకుండా అవసరమైన సామాగ్రి

వర్షాకాలంలో మీ పిల్లలు బయటకు వెళ్లినపుడు తడవకుండా వారికి వాటర్ ప్రూవ్ దుస్తులు, తలపై టోపీ, గొడుగు అందించండి. బురద కారణంగా నేలలు జారుడుగా ఉంటాయి, కాబట్టి పిల్లలకు తగిన పాదరక్షలతో సన్నద్ధం చేయండి. బురదలో జారిపడకుండా నిరోధించడానికి మంచి ట్రాక్షన్‌ను అందించే నాన్-స్లిప్ బూట్లు లేదా రెయిన్ బూట్లను సమకూర్చండి.

మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి

మీ పిల్లలు కుటుంబ సభ్యుల సంప్రదింపు నంబర్‌లను గుర్తుంచుకునేలా వారితో సాధన చేయించండి. అవసరమైతే మీ కాంటాక్ట్ నెంబర్లను వారి స్కూల్ బ్యాగులలో, వారి దుస్తులకు ఉండే పాకెట్లలో పలుచోట్ల రాసి ఉంచండి. ఇది అత్యవసర పరిస్థితుల్లో వారు తమ కుటుంబానికి కాంటాక్ట్ చేసేలా సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం