తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vada With Leftover Rice: మిగిలిపోయిన అన్నంతో ఇన్‍స్టంట్ వడలు.. రుచికరంగా ఇలా చేయొచ్చు

Vada with leftover Rice: మిగిలిపోయిన అన్నంతో ఇన్‍స్టంట్ వడలు.. రుచికరంగా ఇలా చేయొచ్చు

29 November 2024, 17:30 IST

google News
    • Vada with leftover Rice Recipe: మిగిలిన పోయిన అన్నంతో వడలు చేయవచ్చు. ఇవి క్రిస్పీగా, రుచికరంగా ఉంటాయి. ఈ వడలు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Vada with leftover Rice: మిగిలిన అన్నంతో ఇన్‍స్టంట్ వడలు.. రుచికరంగా ఇలా చేయొచ్చు
Vada with leftover Rice: మిగిలిన అన్నంతో ఇన్‍స్టంట్ వడలు.. రుచికరంగా ఇలా చేయొచ్చు

Vada with leftover Rice: మిగిలిన అన్నంతో ఇన్‍స్టంట్ వడలు.. రుచికరంగా ఇలా చేయొచ్చు

మిగిలిపోయిన చల్ల అన్నం ఒక్కోసారి తినాలని అనిపించదు. ఏం చేయాలా అనే ఆలోచన వస్తుంది. ఫ్రైడ్ రైస్ లాంటివి రొటీన్‍గా అనిపిస్తాయి. అలాంటప్పుడు.. డిఫరెంట్‍గా మిగిలిన అన్నంతో వడలు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్‍స్టంట్‍గా ఈ వడలు రెడీ అవుతాయి. ఇవి చేసుకోవడం కూడా సులభమే. మిగిలిన అన్నంతో వడలు ఏలా చేయాలో ఇక్కడ పూర్తిగా చూడండి.

మిగిలిన అన్నంతో వడలు చేసేందుకు కావాల్సిన పదార్థాలు

  • 2 కప్‍ల అన్నం
  • రెండు టేబుల్‍స్పూన్‍ల పెరుగు
  • రెండు టేబుల్‍ స్పూన్‍ల బియ్యం పిండి
  • రెండు టేబుల్‍స్పూన్‍ల ఉప్మా రవ్వ
  • ఓ ఉల్లిపాయ (సన్నగా తరుక్కోవాలి)
  • టీ స్పూన్ జీలకర్ర
  • రెండు పచ్చిమిర్చిలు (సన్నగా తరగాలి)
  • అర టీస్పూన్ మిరియాల పొడి
  • టేబుల్ స్పూన్ అల్లం తరుగు
  • కాస్త కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు
  • తగినంత ఉప్పు
  • డీప్ ఫ్రై చేసుకునేందుకు నూనె

అన్నంతో వడలు తయారు చేసుకునే విధానం

  1. ముందుగా ఓ మిక్సీ జార్‌లో అన్నం వేసుకోవాలి. అందులో పెరుగు వేయాలి.
  2. నీరు వేయకుండా అన్నం, పెరుగును కలిపి మొత్తంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
  3. గ్రైండ్ చేసుకున్న అన్నం, పెరుగు పిండిని గిన్నెలో తీసుకోవాలి. దాంట్లో బియ్యం పిండి, ఉప్మా రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ తరుగు, మిర్చి తరుగు, అల్లం తరుగు, మిరియాల పొడి, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి.
  4. బాగా కలుపుకున్న పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  5. ఆ తర్వాత వడలు చేసేందుకు కాస్త నూనెను చేతులకు రాసుకోవాలి. కాస్త పిండి తీసుకొని వత్తి మధ్యలో రంధ్రం చేసి వడలా చేసుకోవాలి. కవర్‌పై నీరు రాసి కూడా వడ వత్తుకోవచ్చు.
  6. ఆ తర్వాత వడలను నూనెలో ఫ్రైచేయాలి. నూనె మీడియం హీట్‍లో ఉన్నప్పుడు వండలను వేయాలి. మీడియం మంటపైనే ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వడలను కాల్చుకోవాలి.
  7. గోల్డెన్ కలర్ వచ్చాక వడలను నూనె నుంచి బయటికి తీయాలి. అంతే మిగిలిన పోయిన అన్నంతో క్రీస్పీ వడలు రెడీ అవుతాయి. ఎంచక్కా తినేయవచ్చు.

తదుపరి వ్యాసం