Bread Omelette: నిమిషాల్లో బ్రెడ్ ఆమ్లెట్‌ని సింపుల్‌గా తయారు చేసుకోండిలా, రుచికరమైన టిఫిన్‌గా కూడా తినొచ్చు
15 October 2024, 12:21 IST
ఆమ్లెట్‌ను ఈరోజు ఇష్టపడని వారు ఉండరు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రుచికరమైనదే కాదు, పౌష్టికాహారంగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని నిమిషాల్లోనే ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
బ్రెడ్ ఆమ్లేట్
బ్రెడ్ ఆమ్లెట్‌ను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకునే సౌలభ్యం ఉన్న ఈ బ్రెడ్ ఆమ్లెట్ రుచితో పాటు మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆఫీస్ లేదా స్కూల్‌కి లేటయ్యే సమయాల్లో పెద్ద వాళ్లు తయారు చేసుకుని తిని వెళ్లడానికి ఈ బ్రెడ్ ఆమ్లెట్ బెస్ట్ ఆప్షన్. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.
బ్రెడ్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- బ్రెడ్ ముక్కలు - 4
- గుడ్లు - 2
- ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన)
- పచ్చిమిర్చి - 1 లేదా 2 (సన్నగా తరిగిన)
- కొత్తిమీర - రుచికి తగినంత
- ఉప్పు - రుచికి తగినంత
- మిరియాల పొడి - రుచికి తగినంత
- నెయ్యి లేదా నూనె - 1 టేబుల్ స్పూన్
బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గుడ్లు పగలగొట్టి వేయండి.
- గుడ్లలో అప్పటికే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసి కొన్ని క్షణాల పాటు బాగా కలపండి.
- అనంతరం స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాస్త వేడి చేయండి. పెనం వేడిగా అయ్యాక.. అప్పటికే కలిపిన గుడ్ల మిశ్రమాన్ని అందులో పోయండి.
- గుడ్ల మిశ్రమం కొంచెం గట్టిగా అయ్యే వరకు వేడి చేసి.. ఆ తర్వాత ఆ మిశ్రమంపై బ్రెడ్ ముక్కలను ఉంచండి. అలా కాసేపు సన్నని మంట మీద ఉండనివ్వండి. ఆ తర్వాత బ్రెడ్ ముక్కలను తిప్పి మరోవైపు కాల్చండి.
- బ్రెడ్ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు సన్నని మంటపై వేయించండి. ఇలా చేస్తే నిమిషాల్లోనే రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.
బ్రెడ్ ఆమ్లెట్‌ని టమాట సాస్ లేదా పచ్చడి ఆస్వాదిస్తూ తినండి.
బ్రెడ్ ఆమ్లెట్‌తో ప్రయోజనాలు
బ్రెడ్ ఆమ్లెట్ తినడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. గుడ్లలో విటమిన్లు మనకి కంటి చూపుతో పాటు ఎముకలకి బలం, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇక బ్రెడ్‌లో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తినిచ్చి, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
గుడ్లు మనలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. బ్రెడ్ ఆమ్లెట్‌తో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కలవడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే తీసుకుంటే టిఫిన్‌లా కూడా ఇది పనిచేస్తుంది.
టాపిక్