తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship: గర్ల్‌ఫ్రెండ్ తల్లిదండ్రులను ఎలా ఇంప్రెస్ చేయాలి?

Relationship: గర్ల్‌ఫ్రెండ్ తల్లిదండ్రులను ఎలా ఇంప్రెస్ చేయాలి?

29 November 2024, 19:00 IST

google News
    • Relationship: ప్రేమలో ఉన్న జంట ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పించడం కాస్త కష్టమైన పనే. ముఖ్యంగా ప్రేయసి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేయడం అబ్బాయిలకు అంత సులువు కాదు. కొన్ని టిప్స్ పాటిస్తే ఈ పని కాస్త సులభం అవుతుంది. అవేంటో ఇక్కడ చూడండి.
Relationship: గర్ల్‌ఫ్రెండ్ తల్లిదండ్రులను ఎలా ఇంప్రెస్ చేయాలి?
Relationship: గర్ల్‌ఫ్రెండ్ తల్లిదండ్రులను ఎలా ఇంప్రెస్ చేయాలి?

Relationship: గర్ల్‌ఫ్రెండ్ తల్లిదండ్రులను ఎలా ఇంప్రెస్ చేయాలి?

లవ్‍లో ఉన్న ప్రేమికులు తదుపరి పెళ్లి దిశగా అడుగులు వేస్తారు. ఇందుకోసం తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఒప్పిస్తే అంతా సాఫీగా సాగుతుంది. అయితే, ఇది కాస్త కష్టమైన పనిగానే ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేయడం కొందరు అబ్బాయిలు ఓ కష్టమైన పనిగా భావిస్తారు. అందుకే కంగారు పడుతుంటారు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ప్రేయసి తల్లిదండ్రులను ఎక్కువగా ఇంప్రెస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ చిట్కాలు ఏవో ఇక్కడ చూడండి.

ముందుగా వివరాలు తెలుసుకోవాలి

అమ్మాయి తల్లిదండ్రులను మెప్పించాలంటే ముందుగా ప్రిపేర్ అవ్వాలి. వారి కుటుంబ వివరాలను, వారి సంప్రదాయాలను, ఇష్టాఇష్టాలను, జీవనశైలి సహా మరిన్ని వివరాలను మీ ప్రేయసి నుంచి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే మీరు వారి వద్ద ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది.

డ్రెస్సింగ్ ఇలా..

ప్రేయసి ఇంటికి మొదటిసారి వెళ్లే సమయంలో వేసుకునే డ్రెస్‍పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. డ్రెస్సింగ్ స్టైల్‍తోనే ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిత్వాన్ని దుస్తులు ప్రతిబింబిస్తాయనే భావన ఉంటుంది. అందుకే డ్రెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫార్మల్, క్యాజుల్ డ్రెస్‍లు అయితే ఇలాంటి సందర్భాలకు సూటవుతాయి.

ఆత్మవిశ్వాసం ముఖ్యం

గర్ల్‌ఫ్రెండ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడకూడదు. అన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీ బాడీ లాగ్వేంజ్ కాన్ఫిడెంట్‍గా ఉండాలి. నిలబడడంలోనూ ఆత్మవిశ్వాసం కనిపించాలి. దీనివల్ల బాగా ఇంప్రెస్ చేయవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోని భయపడినట్టు అనిపించకూడదు.

స్పష్టంగా చెప్పాలి

మీరు ఏం చెప్పాలనుకుంటున్నా అమ్మాయి తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పాలి. అన్ని విషయాల్లో నిజాయితీ చాలా ముఖ్యం. మాట్లాడే సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా జాగ్రత్త పడాలి. జంకుతున్నట్టు అసలు అనిపించకూడదు. ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడే సమయంలో స్పష్టత తప్పనిసరి. ఇలా జీవితంపై క్లారిటీతో ఉన్నట్టు అనిపిస్తే అమ్మాయి కుటుంబ సభ్యులు త్వరగా ఇంప్రెస్ అవుతారు. వారి చెప్పే విషయాలను కూడా శ్రద్ధగా వినాలి. పెడచెవిన పెట్టినట్టు, ఇంట్రెస్ట్ లేనట్టు ఏ మాత్రం అనిపించకుండా జాగ్రత్త పడాలి.

ప్రవర్తన ఇలా..

అమ్మాయి కుటుంబ సభ్యుల వద్ద జాగ్రత్తగా ప్రవర్తించాలి. వినమ్రంగా ఉంటూనే ధైర్యవంతుడినని అనిపించుకోవాలి. పెద్దలకు గౌరవం ఇచ్చే విషయంలో అలసత్వం ఉండకూడదు. వారి కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు మీ ప్రేయసిపై మరీ ఎక్కువ దృష్టి పెట్టకూడదు. ఇలా చేస్తే కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మాట్లాడుతున్న సమయంలో దిక్కులు చూడకూడదు. పూర్తి శ్రద్ధ చూపించాలి.

తదుపరి వ్యాసం