Happy Dasara 2023 Wishes : మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.. ఇలా విషెస్ చెప్పండి
22 October 2023, 14:00 IST
- Happy Dussehra 2023 Wishes : హిందువులు జరుపుకొనే ముఖ్యమైన పండగ దసరా. దేశవ్యాప్తంగా ఈ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మీ ప్రియమైనవారు మీకు దగ్గరగా లేకుంటే సోషల్ మీడియా ద్వారా దసరా శుభాకాంక్షలు చెప్పండి.
దసరా శుభాకాంక్షలు
Happy Dasara 2023 : దేశవ్యాప్తంగా నవరాత్రి సంబరాలు ఘనగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు దసరా. పురాణాల ప్రకారం..మహిషాసురుడు అనే రాక్షసునిపై దుర్గా దేవి సాధించిన విజయాన్ని, రావణుడిపై శ్రీరామ చంద్రుడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా జరుపుకొంటారు. చీకటిపై వెలుగు సాధించిన విజయోత్సవమే ఈ దసరా. చీకటిని అంతం చేసే పండగ ఇది. మీ సన్నిహితులకు కింది విధంగా శుభాకాంక్షలు చెప్పండి.
హ్రీంకారసన గర్భితానల శిఖాం సౌ:క్లీం కళాంభిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం..
త్రినేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం..
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్..
అందరికీ దసరా శుభాకాంక్షలు
ముక్తావిద్రువు హేమనీల ధవళాచ్ఛాయైుర్ముఖై స్త్రీక్షణై..
యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మీకామ్..
గాయత్రీం వరదాభయాంశ కశాశ్శుభ్రం కపాలం..
గదాం శంఖుచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే..
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే..
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే..
దసరా శుభాకాంక్షలు 2023
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా..
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా..
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా..
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
ఈ పండగ రోజున అందరికీ శుభాలు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
ఇక మీదట ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని విజయాలు కలగాలని కోరుతూ.. విజయ దశమి శుభాకాంక్షలు
మీరు కోరిన కోరికలు తీరాలి, ఆ అమ్మవారి దయ మీపై కలగాలి అని కోరుతూ.. దసరా శుభాకాంక్షలు
చల్లని అమ్మవారి ఆశీస్సులతో మీ సమస్యలన్నీ తీరిపోయి ఇకపై సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు
ఈరోజు నుంచి మీరు చేపట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరగాలని కోరుతూ.. విజయ దశమి శుభాకాంక్షలు
దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడు మీపై ఉండాలని కోరుతూ.. దసరా శుభాకాంక్షలు
ఈ పండుగ రోజు పాత బంధాలతో పాటు కొత్త బంధాలను కూడా ధృడంగా ఉంచాలని కోరుతూ.. దసరా శుభాకాంక్షలు
విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పడూ మీపై ఉండాలి.. దసరా పండుగ శుభాకాంక్షలు..
జీవితంలో చెడు చేయకుండా ఉంటూ.. మంచి పనులు చేయాలని కోరుతూ.. దసరా శుభాకాంక్షలు..
ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఉండాలని కోరుతూ.. విజయదశమి శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్నీ శుభాలే కలగాలని కోరుతూ దసరా శుభాకాంక్షలు
ఇది వేడుకకు సమయం.. చెడుపై మంచి సాధించిన విజయం.. అదే నిజమైన స్ఫూర్తిని కొనసాగిద్దాం.. మనలో చెడుని అంతం చేద్దాం.. దసరా శుభాకాంక్షలు
జీవితంలోని కొత్త విషయాలను ప్రారంభించేందుకు ఒక శుభ దినాన్ని జరుపుకొందాం.. దసరా శుభాకాంక్షలు
మీ కష్టాలు బాణా సంచా వలె పేలుతూ.. మీ ఆనందం వంద రెట్లు పెరుగాలని కోరుతూ.. హ్యాపీ దసరా
ఈ దసరా మీ జీవితంలో భక్తి, సంకల్పం, అంకితభావాన్ని తెస్తుంది.. దసరా శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయాన్ని చేసుకుందా.. హ్యాపీ దసరా 2023
ఈ దసరా రావణ దహనంతో మీ చింతలన్నింటినీ కాల్చేయండి.. దసరా శుభాకాంక్షలు 2023