తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Womens Health: ఆ దశ తరువాత మహిళల్లో లైంగిక ఆసక్తి తగ్గిపోతుందా? ఎందుకు అలా జరుగుతుంది?

Womens Health: ఆ దశ తరువాత మహిళల్లో లైంగిక ఆసక్తి తగ్గిపోతుందా? ఎందుకు అలా జరుగుతుంది?

Haritha Chappa HT Telugu

10 October 2024, 8:30 IST

google News
  • Womens Health: మెనోపాజ్ వచ్చాక మహిళలు అనేక శారీరక, మానసిక మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాదు, ఈ పరిస్థితి మహిళల లైంగిక జీవితం లేదా లైంగిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మహిళల్లో లైంగిక వాంఛలు తగ్గుతాయి.

మహిళ్లలో లైంగికాసక్తి ఎందుకు తగ్గుతుంది?
మహిళ్లలో లైంగికాసక్తి ఎందుకు తగ్గుతుంది? (shutterstock)

మహిళ్లలో లైంగికాసక్తి ఎందుకు తగ్గుతుంది?

మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో సహజమైన మార్పు. ఒక మహిళకు వరుసగా 12 నెలలు రుతుస్రావం కాకపోతే, ఈ పరిస్థితిని రుతువిరతి లేదా మెనోపాజ్ అంటారు. సాధారణంగా మహిళలకు 45 నుంచి 50 ఏళ్ల మధ్య మెనోపాజ్ దశ వస్తుంది. దీని వల్ల మహిళలు అనేక శారీరక, మానసిక మార్పులను ఎదుర్కోవలసి వస్తుంది. అంతే కాదు, ఈ పరిస్థితి మహిళల లైంగిక జీవితం లేదా లైంగిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మహిళల్లో లైంగిక వాంఛలు తగ్గుతాయి. అటువంటి పరిస్థితిలో, రుతువిరతి మహిళల జీవితం, లైంగిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వైద్యులు వివరిస్తున్నారు.

మెనోపాజ్ మహిళల లైంగిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

రుతువిరతి సమయంలో, మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ఉంటాయి. ఈ హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలు తమ లైంగిక జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. వాస్తవానికి, రుతువిరతి సమయంలో, మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. దీనివల్ల యోని పొడిబారడం, యోనిలో నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. ఈ సమస్యల కారణంగా, స్త్రీ లైంగిక కార్యకలాపాలు చేయడం కష్టమవుతుంది. దీనివల్ల మహిళల్లో లైంగిక వాంఛ తగ్గుతుంది. లైంగిక కార్యకలాపాల సమయంలో యోనిలో తీవ్ర నొప్పి, మంట వస్తాయి. ఇవన్నీ కూడా వారిలో సెక్స్ అంటేనే విరక్తి వచ్చేలా చేస్తాయి. అందుకే వారు లైంగిక కార్యకలాపాన్ని ఇష్టపడరు.

మెనోపాజ్ సమయంలో లైంగిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మహిళలు ఒత్తిడికి గురవుతారు. దాని వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, స్త్రీ తన భాగస్వామితో బహిరంగంగా మాట్లాడాలి, తన సమస్య గురించి వారికి చెప్పాలి. వారి సహాయాన్ని తీసుకోవాలి. జీవిత భాగస్వామి సహకారం ఉంటే మీరు త్వరగా ఆ బాధ నుంచి బయటపడగలరు.

రుతువిరతి సమయంలో, స్త్రీ తన పరిస్థితి గురించి వైద్యుడిని కూడా సంప్రదించాలి. వైద్యులు కొన్ని మందుల సహాయంతో లైంగిక జీవితంలో సమస్యలను అధిగమించవచ్చు. లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని కూడా తీసుకోవచ్చు.

రుతువిరతి సమయంలో, స్త్రీ తన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండండి. మెనోపాజ్ వల్ల మహిళల్లో ఒత్తిడి, మానసిక ఆందోళన పెరిగిపోతాయి. కాబట్టి ధ్యానం వంటివి చేయాల్సిన అవసరం ఉంది. ఫిట్ గా, హెల్తీగా ఉండాలంటే యోగా, ఎక్సర్ సైజ్ చేయాలి.

మెనోపాజ్ వచ్చాక లైంగిక ఆరోగ్యంలో మార్పులు చాలా సాధారణం అని ముందుగానే అర్థం చేసుకోవాలి. అందువల్ల, మీరు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. రుతువిరతి సమయంలో మీరు కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం చాలా అవసరం.

కొందరిలో 40 ఏళ్లకే మెనోపాజ్ వచ్చేస్తుంది. నలభై ఏళ్లు దాటాక మీ పీరియడ్స్ క్రమబద్ధంగా వస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. మూడు నాలుగు నెలల పాటూ వరుసగా రాకపోతే మెనోపాజ్ దశలో ఉన్నారేమో వైద్యుల వద్ద చెక్ చేయించుకోవాలి. మెనోపాజ్ వచ్చాక అనేక ఆరోగ్య సమస్యలు సులువుగా రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తదుపరి వ్యాసం