HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Deepfry And Cancer: డీప్ ఫ్రై చేసిన ఆహారాలను ఇష్టంగా తింటున్నారా? అయితే మీకు మీరుగా క్యాన్సర్‌ను కొని తెచ్చుకుంటున్నట్టే

Deepfry and Cancer: డీప్ ఫ్రై చేసిన ఆహారాలను ఇష్టంగా తింటున్నారా? అయితే మీకు మీరుగా క్యాన్సర్‌ను కొని తెచ్చుకుంటున్నట్టే

Haritha Chappa HT Telugu

03 June 2024, 7:00 IST

    • Deepfry and Cancer: డీప్ ఫ్రై చేసిన ఆహారాలు రుచిగా ఉంటాయి. క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. అలా అని ఎక్కువగా తింటే కోరి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
డీప్ ఫ్రై వంటకాలు
డీప్ ఫ్రై వంటకాలు (Pixabay)

డీప్ ఫ్రై వంటకాలు

Deepfry and Cancer: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. రుచిగా ఉంటాయి కదా అని ఫ్రై చేసిన ఆహారాలను, నూనె పట్టించిన ఆహారాలను అధికంగా తింటే శరీరంలో క్యాన్సర్ కారకాలు చేరే అవకాశం ఉంది. ఇది శరీర వేడిని కూడా పెంచుతాయి. వేయించిన ఆహారాలలో హానికరమైన కార్సినోజెన్లు ఉంటాయి. అంటే క్యాన్సర్ కారక సమ్మేళనాలు ఉంటాయి. అలాగే టాక్సిన్లు నిండి ఉంటాయి. ఇవన్నీ కలిసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

బంగాళదుంప వంటి పదార్థాలతో అధిక ఉష్ణోగ్రతల వద్ద చిప్స్ ను తయారు చేస్తూ ఉంటారు. అలాగే అనేక రకాల ఆహారాలను కూడా డీప్ ఫ్రై చేస్తారు. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు అక్రిలమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది కార్సినోజెన్ లక్షణాలను కలిగి ఉంటుంది. తరచూ ఈ సమ్మేళనం శరీరంలో చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది.

ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం

మాంసాలను, ఇతర ఆహారాలను అధిక ఉష్ణోగ్రతల వద్ద లేదా నేరుగా నిప్పు పైన కాల్చినప్పుడు... పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్లు ఉంటాయి. ఇవి పొట్ట క్యాన్సర్‌కు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం అవుతాయి. ఇలా అధిక ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని కాల్చినప్పుడు హెటిరోసైక్లిక్ అమైన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి కొలెరెక్టల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

నిప్పుల మీద కాల్చిన ఆహారము లేదా డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఆ పదార్థాల్లోని పోషకాలు తీవ్రంగా నష్టపోతాయి. దీనివల్ల వాటిని తిన్నా, తినకపోయినా ఒకటే. విటమిన్ సి, కొన్ని రకాల బి విటమిన్లు తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా మన శరీర కణాలను కాపాడేవి. ఇవి లేని ఆహారం తినడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల అనారోగ్యకరమైన సమ్మేళనాలు శరీరంలో చేరి జబ్బులకు కారణం అవుతాయి.

వేయించిన ఆహారాలను అధికంగా తినడం వల్ల వాటిలో అనారోగ్యకనమైన కొవ్వులు నిండుగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఊబకాయం బారిన త్వరగా పడేలా చేస్తాయి. ఊబకాయం వల్ల రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్. అన్నవాహిక క్యాన్సర్, పిత్తాశచ క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్ కు కారణం అవుతుంది. కాబట్టి బరువును తగ్గించుకోవడంతో పాటు వేయించిన ఆహారాలు, కాల్చిన ఆహారాలను తినక పోవడమే మంచిది. డీహైడ్రేషన్ బారిన పడకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరంలో వేడి అధికంగా ఉత్పత్తి అయితే అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది.

ఏం తినాలి?

క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే తేలికగా ఉన్న ఆహారాన్ని, పోషకాలు నిండుగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా నీరు నిండిన పదార్థాలను తినడం మంచిది. తాజా పండ్లు, కూరగాయల్లో నీరు నిండుగా ఉంటుంది. అలాంటి వాటిని ఉడికించి... అంటే కూరలుగా వండుకొని తింటే మంచిది. లీన్ ప్రోటీన్ ఉండే మాంసాలను తిన్నా మంచిదే. తృణధాన్యాలు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వేసవిలో ఆహారాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం అవసరం. వేయించిన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్