World Emoji Day 2024: ప్రపంచంలో చాటింగ్ చేస్తూ ఎక్కువ మంది వాడే ఎమోజీ ఏదో తెలుసా?
Published Jul 17, 2024 03:30 PM IST
- World Emoji Day 2024: సోషల్ మెసేజింగ్ యాప్ లలో ఇప్పుడు ఎక్కువ మంది ఎమోజీలనే వాడుతున్నారు. తమ ఫీలింగ్స్ ను మెసేజ్ రూపంలో కాకుండా ఎమోజీ రూపంలో చెప్పేందుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ప్రపంచ ఎమోజీ డే 2024
మేసేజింగ్ యాప్‌లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌లలో అధికంగా మేసేజ్ లు పంపుతూ ఉంటారు. ఒకప్పుడు ప్రియమైన వారితో మాట్లాడటానికి గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవారు, కానీ కాలంతో పాటు అంతా మారిపోయింది. ఇప్పుడు ప్రజలు కాల్స్ కు బదులుగా అనేక మెసేజింగ్ యాప్ లలో చాట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. చాటింగ్ సమయంలో తమ ఫీలింగ్స్ చెప్పడానికి మాటల కన్నా ఎమోజీలను అధికంగా ఉపయోగిస్తున్నారు. తమ భావాలను వ్యక్తీకరించడానికి ఈ ఎమోజీలను ఉపయోగిస్తారు. ఎమోజీ ఇప్పుడు డిజిటల్ లాంగ్వేజ్ గా మారిపోయింది. ఈ ఎమోజీల కోసం ప్రత్యేకంగా ఒక దినోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం జూలై 17న ప్రపంచ ఎమోజీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఎక్కువగా ఉపయోగించే కొన్ని ఎమోజీలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
ఆనందం, కన్నీళ్లు
ఎమోజీలలో నవ్వు, ఆనందం, అతి ఆనందం, కన్నీళ్లు వంటివి ఉంటాయి. దీనిలో ఆనందభాష్పాలను రాల్చే ఎమోజీ కూడా ఉంటుంది. ఇది నవ్వి నవ్వి కన్నీళ్లు రావడాన్ని సూచిస్తారు. సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఈ ఎమోజీని ఉపయోగిస్తారు. అన్ని ఎమోజీలలో ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న ఎమోజీలలో ఇది అగ్రస్థానంలో ఉంది.
థంబ్స్ అప్ ఎమోజీ
కుడిచేతి బొటనవేలిని చూపించే థంబ్స్ అప్ ఎమోజీని అధికంగా వాడుతున్నారు. ఈ ఎమోజీని ఏదైనా అనుమతి ఇవ్వడానికి, అంగీకరించడానికి ఉపయోగిస్తారు. పని సక్రమంగా పూర్తయిన తర్వాత కూడా ఒకరినొకరు పంపుకోవడానికి ఉపయోగిస్తారు.
రెడ్ హార్ట్ ఎమోజీ ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞతను చూపిస్తుంది. ఇది అనేక సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్‌లలో డిఫాల్ట్ ఎమోజీ ఎంపికలలో ఒకటిగా కూడా ఉపయోగించబడుతుంది. ఎమోజీలో కళ్ల స్థానంలో రెండు లవ్ సింబల్స్ ఉంటాయి. దీన్ని కూడా వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చిరునవ్వుతో ఉన్న ముఖం కూడా ఎక్కువ మంది వినిషియోగిస్తున్నారు.
చప్పట్లు
రెండు చేతులను జోడించి చప్పట్లు కొడుతున్నట్టు మరో ఎమోజీ కూడా ఉంటుంది. దీన్ని కూడా అధికంగా వాడుతున్నారు. ఈ ఎమోజీని సాధారణంగా ఆశ, ప్రశంసలకు ఉపయోగిస్తారు. థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఈ ఎమోజీని ఉపయోగించవచ్చు.
ఏడుస్తున్న ఎమోజీ
బిగ్గరగా ఏడుస్తున్న ఏడుపు ఎమోజీని వాడే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. విచారం, దుఃఖాన్ని ఈ ఎమోజీ వ్యక్తపరుస్తుంది. ఈ ఎమోజీలో, మూసిన కళ్ళ నుండి భారీ కన్నీటి ప్రవాహాలు ప్రవహిస్తాయి. ఇవి విచారకరమైన భావాలను కూడా తెలియజేస్తాయి. ఈ ఎమోజీని గర్వం లేదా మరింత ఆనందాన్ని వ్యక్తం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
ఎమోజీలు కనిపెట్టినది
ఇప్పుడు అధికంగా వాడుతున్న ఎన్నో ఎమోజీలు ఉన్నాయి. ఇలా ఎమోజీలను మొదటసారిగా కనిపెట్టింది జపాన్ కు చెందిన షిగేటకా కురిటా. ఇతను 1999లో తొలిసారిగా ఎమోజీలు రూపొందించాడు. ఎమోజీ అనే పదం కూడా జపాన్ నుంచి వచ్చిందే.