తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Milk Pulao: కొబ్బరి పాలతో ఇలా పులావ్ చేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు

Coconut Milk Pulao: కొబ్బరి పాలతో ఇలా పులావ్ చేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు

Haritha Chappa HT Telugu

30 December 2023, 11:45 IST

google News
    • Coconut Milk Pulao: కొబ్బరి పాలతో పులావ్ చేస్తే దానికి ప్రత్యేక రుచి వస్తుంది. దీన్ని ఏ కర్రీతో తిన్నా టేస్టీ గానే ఉంటుంది.
కొబ్బరిపాల పులావ్ రెసిపీ
కొబ్బరిపాల పులావ్ రెసిపీ (agameals)

కొబ్బరిపాల పులావ్ రెసిపీ

Coconut Milk Pulao: కొబ్బరి పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ కొబ్బరిపాలతో పులావ్ చేస్తే ఆ పరిమళం, రుచి నోరూరించేస్తాయి. ఇప్పుడు చికెన్ పులావ్, మటన్ పులావ్ తిని బోర్ కొడితే ఒకసారి కొబ్బరిపాలతో పులావ్ చేసుకుని చూడండి. దీంతోపాటు చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏది తిన్నా టేస్టీ గానే ఉంటుంది. పిల్లలకు ఇది బాగా నచ్చే అవకాశం ఉంది. కొబ్బరి పులావ్ రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

కొబ్బరిపాల పులావ్ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు

పచ్చి కొబ్బరి ముక్కలు - ఒక కప్పు

బిర్యానీ ఆకులు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - నాలుగు

టమోటో గుజ్జు - ఒక కప్పు

బియ్యం - ఒకటిన్నర కప్పు

పచ్చిమిర్చి - ఐదు

నూనె - సరిపడా

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కొబ్బరిపాల పులావు రెసిపీ ఇదే

1. కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. నీరు పోసి వాటి నుంచి కొబ్బరిపాలను తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మసాలా దినుసులైన లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కలపాలి.

3. నిలువుగా కోసిన పచ్చిమిర్చిని కూడా వేయాలి. అవి వేగాక నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి.

4. తర్వాత టమోటా ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి.

5. మూత పెట్టి టమోటా ముక్కలు బాగా మగ్గే దాకా ఉంచాలి.

6. బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు ముందే నానబెట్టుకుని, ఆ బియ్యాన్ని ఈ మిశ్రమంలో వేయాలి.

7. బియ్యాన్ని బాగా కలిపి స్టవ్ చిన్న మంట మీద ఉంచాలి.

8. ఇప్పుడు ముందుగా తీసుకున్న కొబ్బరి పాలను ఇందులో వేసి కలుపుకోవాలి.

9. బియ్యం ఉడకడానికి నీరు అవసరమైతే మరి కొంచెం నీరు వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

10. పైన మూత పెట్టి పావుగంట సేపు ఉడికిస్తే కొబ్బరిపాల పులావ్ రెడీ అయిపోతుంది ఇది.

11. మంచి పరిమళంతో ఘుమఘుమలాడుతుంది. దీంతోపాటు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, కోడి గుడ్డు మసాలా కర్రీ వంటివి తింటే టేస్టీగా ఉంటుంది.

కొబ్బరిపాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరిపాలను తీసుకోవడం వల్ల కొన్ని శరీర అవయవాలకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా జటరాశయంలో సమస్యలు రాకుండా ఉంటాయి. నోటిపూతలను తగ్గిస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి1, బి2, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే సెలెనియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి లభిస్తాయి. కొబ్బరి పాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తిని అందించడంలో ఇవి ముందుంటాయి. బరువు తగ్గడానికి కొబ్బరిపాలు సహాయపడతాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం సులువుగా మారుతుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారు కొబ్బరిపాలను అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోవాలి.

తదుపరి వ్యాసం