తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Health: పిల్లల్లో ఈ కారణం వల్ల గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.. తల్లిదండ్రులు జాగ్రత్త!

Kids Health: పిల్లల్లో ఈ కారణం వల్ల గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.. తల్లిదండ్రులు జాగ్రత్త!

01 December 2024, 14:00 IST

google News
    • Kids Health: ప్రస్తుత కాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల బరువు, వారు ఏం తింటున్నారనే దానిపై దృష్టి సారించాలి. ఎందుకంటే చిన్నతనంలో ఊబకాయం భవిష్యత్తులో అనేక సమస్యలకు దారి తీస్తుంది.
Kids Health: పిల్లల్లో ఈ కారణం వల్ల గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.. తల్లిదండ్రులు జాగ్రత్త!
Kids Health: పిల్లల్లో ఈ కారణం వల్ల గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.. తల్లిదండ్రులు జాగ్రత్త!

Kids Health: పిల్లల్లో ఈ కారణం వల్ల గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.. తల్లిదండ్రులు జాగ్రత్త!

ఇటీవలి కాలంలో పిల్లల్లో ఊబకాయం అధికమవుతోంది. ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువగా ఉండడమే ఊబకాయం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) చాలా ఎక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు చాలా తలెత్తుతాయి. ఊబకాయం పిల్లలకు చాలా ప్రమాదకరం. పెద్దయ్యాక వారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేందుకు ఇది దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 1975ల్లో 5 నుంచి 19 సంవత్సరాల మధ్య పిల్లల్లో ఒక శాతమే ఊబకాయం ఉండేది. అదే 2016 నాటికి 8 శాతం మంది మగపిల్లల్లో, ఆరు శాతం మంది ఆడపిల్లలకు ఊబకాయం ఉంది. ఆ సంఖ్య ఇప్పటికీ ఇంకా చాలా అధికమైందనే అంచనాలు ఉన్నాయి. చిన్నతనంలో ఊబకాయం వల్ల చాలా సమస్యలు తలెత్తే రిస్క్ ఉంటుంది.

ఊబకాయానికి ప్రధాన కారణాలు ఇవే

ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లాంటి అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం , శారీరక శ్రమ అవసరమైనంత లేకపోవడమే పిల్లల్లో ఊబకాయానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. పిల్లల్లో ఊబకాయం, ఆరోగ్య సమస్యల గురించి హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍తో ఇంటర్వ్యూలో మాట్లాడారు క్లౌడ్‍నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కన్సల్టంట్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిషన్ డాక్టర్ అభిషేక్ చోప్రా.

“శారీరకంగా ఎక్కువ యాక్టివ్‍గా లేకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ టూ ఈట్, క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాలు పరిమితి లేకుండా తినడం వల్లే ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఊబకాయం పెరిగేందుకు కారణంగా ఉంది. జన్యు పరమైన విషయాలతో పాటు వారు పెరుగుతున్న సామాజిక వాతావరణం కూడా కారణాలుగా ఉంటాయి” అని అభిషేక్ చోప్రా వెల్లడించారు.

ఊబకాయంతో పిల్లల్లో ఈ సమస్యలు

ఊబకాయం వల్ల చిన్న తనం నుంచే సమస్యలు మొదలై.. పెద్దయ్యాక కూడా కొనసాగుతాయని అభిషేక్ చెప్పారు. చిన్నతనం నుంచి ఊబకాయం ఉంటే గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుందని తెలిపారు. “చిన్నతనం నుంచే ఊబకాయం ఉండడం వల్ల హై బ్లడ్ ప్రెజర్, బ్లడ్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇవి పెద్దయ్యాక కూడా కొనసాగుతాయి. ఈ కారకాల కలయిక వల్ల ధమనులు, గుండె డ్యామేజ్ అయ్యేందుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నతనంలో ఊబకాయంతో ఉన్న పిల్లలు.. పెద్దయ్యాక కూడా ఉండాల్సిన దాని కంటే అధిక బరువుతో ఉండే రిస్క్ ఐదు రెట్లు అధికంగా ఉంటుంది. అందుకే చిన్నతనంలోనే ఊబకాయం రాకుండా జాగ్రత్త పడాలి. వచ్చినా త్వరగా తగ్గేలా చర్యలు తీసుకోవాలి.

తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న పిల్లలతో పోలిస్తే.. 40 శాతం కంటే ఎక్కువ బీఎంఐ ఉన్న పిల్లలకు మధ్య వయసులో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అధిక బీఎంఐ, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్‍కు తోడు పెద్దయ్యాక ధూమపానం లాంటివి తోడైతే గుండె పోటు ప్రమాదం ఎక్కువవుతుంది” అని డాక్టర్ అభిషేక్ చోప్రా వెల్లడించారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

పిల్లల్లో ఊబకాయం తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ అభిషేక్ చోప్రా వెల్లడించారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుందని తెలిపారు.

  • పిల్లలకు ప్రాసెస్డ్, రెడీ టూ ఈట్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినిపించకూడదు. పోషకాలు లేని క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంచాలి.
  • విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినిపించాలి.
  • రోజుకు పిల్లలు మూడుసార్లు భోజనం చేయించాలి. భోజనానికి, భోజనానికి మధ్య సమయంలో ఎక్కువగా వేరేవి తినకూడదు. ఆరోగ్యకరమైన స్నాక్స్ రోజుకు రెండుసార్లే ఇవ్వాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినేలా అలవాటు చేయాలి.
  • పిల్లలు శారీరక శ్రమ ఉండేలా వ్యాయామం, స్పోర్ట్స్ ఆడేలా చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ గురించి వారికి అవగాహన కల్పించాలి. వారంలో కనీసం మూడుసార్లు మజిల్ స్ట్రెంత్ యాక్టివిటీలు చేయించాలి. 
  • పిల్లలకు ఫ్రూట్ జ్యూస్‍లు కాకుండా పండ్లే తినిపించాలి. జ్యూస్‍లుగా చేసి ఇస్తే పోషకాలు ఎక్కువగా ఉండవు.
  • జాగ్రత్తలు తీసుకున్నా ఊబకాయం కొనసాగుతుంటే సంబంధిత నిపుణులను సంప్రదించి వారు చెప్పిన సూచనలు పాటించాలి.

తదుపరి వ్యాసం