తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Kheer: తీయటి పాసయం క్యారెట్ ఖీర్, పిల్లలకు నచ్చేలా ఇలా చేయండి

Carrot Kheer: తీయటి పాసయం క్యారెట్ ఖీర్, పిల్లలకు నచ్చేలా ఇలా చేయండి

Haritha Chappa HT Telugu

Published Jul 17, 2024 06:00 PM IST

google News
    • Carrot Kheer: క్యారెట్ తో చేసే తీయటి పాయసం పిల్లలకు, పెద్దలకు నచ్చుతుంది. ముఖ్యంగా దీన్ని పూజల సమయంలో నైవేద్యంగా పెట్టవచ్చు. క్యారెట్ ఖీర్ రెసిపీ చాలా సులువు
క్యారెట్ పాయసం (Youtube)

క్యారెట్ పాయసం

Carrot Kheer: క్యారెట్ పాయసం చూస్తేనే నోరూరిపోతుంది. ముఖ్యంగా తెలుగిళ్లల్లో నెలకో పండుగ వస్తూనే ఉంటుంది. ఆ పండుగల సమయంలో ఇంట్లో పూజలు చేయడం చాలా సులువు. ఆ పూజల్లో ఏదైనా స్వీట్ పదార్థాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. ఇక్కడ మేము అలాంటి ఒక తీపి రెసిపీ ఇచ్చాము. ఇది క్యారెట్ ఖీర్. అంటే క్యారెట్లతో చేసే పాయసం. దీన్ని చేయడం చాలా సులువు.


క్యారెట్ పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పాలు - రెండున్నర కప్పులు

క్యారెట్ తురుము - ఒక కప్పు

చక్కెర - నాలుగు స్పూన్లు

యాలకులు - రెండు

కుంకుమ పువ్వు - రెండు రేకలు

బాదం పప్పు - నాలుగు

జీడిపప్పులు - అయిదు

నెయ్యి - రెండు స్పూన్లు

కిస్ మిస్‌లు - పది

క్యారెట్ పాయసం రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

2. అందులో కిస్ మిస్‌లు, బాదం పప్పులు, జీడిపప్పులు వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. అదే కళాయిలో తురిమిన క్యారెట్‌ను వేయాలి. చిన్న మంట మీద వేయించాలి.

4. అయిదు నిమిషాలు వేయించాక మరిగించిన పాలు వేయాలి.

5. పావుగంట సేపు చిన్న మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

6. యాలకుల పొడి, కుంకుమ పువ్వు రేకలు, వేయించిన జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్ మిస్‌లు వేసి కలపాలి.

7. ఈ మొత్తం చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పాయసాన్ని తిని చూడండి ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది.

క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థను ఇది బలంగా మారుస్తుంది. క్యారెట్లలో లభించే విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని గట్టిగా మారుస్తాయి. పచ్చి క్యారెట్ తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు ఒక క్యారెట్ తింటే కంటి చూపు మెరుగు పడుతుంది.