తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Vs White Sesame Seeds: నల్లు నువ్వులు, తెల్ల నువ్వులు.. వేటిలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏవి బెస్ట్?

Black vs White Sesame Seeds: నల్లు నువ్వులు, తెల్ల నువ్వులు.. వేటిలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏవి బెస్ట్?

29 November 2024, 9:30 IST

google News
    • Black vs White Sesame Seeds: నువ్వుల్లో ఏది మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నల్ల నువ్వులు, తెల్ల నువ్వుల్లో వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయా అని ఆలోచిస్తుంటారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Black vs White Sesame Seeds: నల్లు నువ్వులు, తెల్ల నువ్వులు.. వేటిలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏవి బెస్ట్? (Photo: Freepik)
Black vs White Sesame Seeds: నల్లు నువ్వులు, తెల్ల నువ్వులు.. వేటిలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏవి బెస్ట్? (Photo: Freepik)

Black vs White Sesame Seeds: నల్లు నువ్వులు, తెల్ల నువ్వులు.. వేటిలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏవి బెస్ట్? (Photo: Freepik)

చాలా వంటకాల్లో నువ్వులు నిత్యం వాడుతుంటారు. వంటకాలకు ఇవి మంచి ఫ్లేవర్, టేస్ట్ అందిస్తాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులను వంటకాల్లో విరివిగా వినియోగిస్తుంటారు. అయితే, రెండింటిలో ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయనే విషయాన్ని చాలా మంది ఆలోచిస్తుంటారు. నల్ల, తెల్ల నువ్వుల్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదని డౌట్ ఉంటుంది.

నల్ల, తెల్ల నువ్వుల పోషకాలు విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. అయితే, రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, రెండింట్లో పోలిస్తే ప్రయోజనాల విషయంలో నల్ల నువ్వులు బెస్ట్. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

నల్ల నువ్లుల్లో ఎక్కువ పోషకాలు

తెల్ల వాటితో పోలిస్తే నల్ల నువ్వుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. నల్ల నువుల్లో యాంటీఆక్సిడెంట్లు అధికం. పొటాషియం, కాల్షియం, మెగ్నిషం, ఐరన్ లాంటివి నల్లవాటిలోనే అధికం. ఎముకల దృఢత్వంతో పాటు ఓవరాల్ ఆరోగ్యానికి తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే ఎక్కువ మేలు చేస్తాయి.

నల్ల నువ్వుల్లో ఫైబర్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో జీర్ణక్రియకు ఇవి బాగా మేలు చేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా సహకరిస్తాయి. పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తగ్గేందుకు తోడ్పడతాయి.

తెల్ల నువ్వులు ఇలా..

తెల్ల నువ్వుల కోసం దానిపై పొట్టును తొలగించేస్తారు. దీంతో మృధువుగా ఉంటాయి. అయితే, నల్ల వాటితో పోలిస్తే పోషకాలు తక్కువగానే ఉంటాయి. అయితే, తెల్ల నువ్వుల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటి వాసన కాస్త తక్కువగా ఉంటుంది. 

నల్ల వాటితో పోలిస్తే పోషకాలు తక్కువగానే ఉన్నా.. తెల్ల నువ్వుల్లో కాల్షియం పుష్కలంగానే ఉంటుంది. శరీరానికి మంచి కాల్షియం అందిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

నువ్వుల ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

  • నల్ల, తెల్ల నువ్వుల్లో ఏవి తిన్నా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే నల్ల వాటి ద్వారా ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. ఎక్కువ లాభాలు ఉంటాయి.
  • నల్ల నువ్వుల్లో ఉంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని మేలు చేస్తాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఇవి తగ్గించగలవు. గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల రిస్కును ఇవి తగ్గించగలవు.
  • నల్ల, తెల్ల నువ్వుల్లో మానుసాచురేటెడ్, పాలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెల్దీ ఫ్యాట్స్. ఇవి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంలో సహకరిస్తాయి. ఇలా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి.
  • నువ్వుల్లో ఫైబర్ కూడా ఉంటుంది. దీనివల్ల జీర్ణాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా నల్ల నువ్వులు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గేందుకు సహకరిస్తుంది.
  • నువ్వుల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మానికి, జుట్టుకు ఇవి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా నల్ల నువ్వులు తింటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. జుట్టుకు పోషకాలు బాగా అందుతాయి. జుట్టు రాలడం, తెల్లబడడాన్ని ఇవి తగ్గించగవు.
  • రెండు రకాల నువ్వుల్లో కాల్షియం మెండుగానే ఉంటుంది. దీంతో ఎముకల దృఢత్వం మెరుగ్గా ఉండేలా ఇవి సహకరిస్తాయి. దంతాలకు కూడా మేలు జరుగుతుంది.

తదుపరి వ్యాసం