తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bhogi 2025 Wishes: భోగి పండుగ శుభాకాంక్షల కోసం 12 స్పెషల్ మెసేజెస్

Bhogi 2025 Wishes: భోగి పండుగ శుభాకాంక్షల కోసం 12 స్పెషల్ మెసేజెస్

Ramya Sri Marka HT Telugu

12 January 2025, 20:24 IST

google News
  • Bhogi 2025 Wishes: భోగి పండుగ సందర్భంగా మీ బంధువులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయాలా..? మీ కోసం. ఈ ప్రత్యేక శుభాకాంక్షల మెసేజ్ లు సిద్ధంగా ఉంచాం. నచ్చిన మెసేజ్ ఎంపిక చేసుకుని ఫార్వార్డ్ చేసేయండి మరి.

భోగి శుభాకాంక్షలు
భోగి శుభాకాంక్షలు

భోగి శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అయిన సంక్రాంతికి మొదటి రోజు భోగీనే. మూడు రోజుల పండుగలో మొదటి రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. పాత, చేదు సంగతులను మర్చిపోయి కొత్త ఆశలతో, సంతోషాలతో జీవితాలు వెలిగిపోవాలని కాంక్షిస్తారు. బంధుమిత్రులంతా ఒక చోట చేరి భోగి మంటలు వేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇలా చేరి పండుగ చేసుకునే సమయంలో మీ వారెవరైనా మిస్ అయినట్లు అనిపిస్తే, డోంట్ వర్రీ. మీ వాళ్ల కోసం, మీ కోసం స్పెషల్ మెసేజెస్ సిద్ధంగా ఉన్నాయి. ఇవి పంపి మీరు వాళ్ల సంతోషాలను కాంక్షిస్తున్నారని తెలియజేయండి.

భోగీ పండుగ శుభాకాంక్షలు

  1. "పాత గాయాలు, పాత బాధలు,

ఈ భోగి మంటల్లో కాలిపోవాలి,

కొత్త ఆశల వెలుగుల్లో,

మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి!"

2. "ముగ్గులలో మెరిసిపోతున్న పూరేకులు,

ఆకాశంలో కదిలిపోతున్న గాలి మబ్బులు,

భోగి మంటలు మనసులో తట్టిరేపుతున్న కొత్త ఆశలు నెరవేరాలని,

మీ కుటుంబానికి ఆశీర్వదాలు అందాలని కాంక్షిస్తూ,

భోగి పండుగ శుభాకాంక్షలు!"

3. "ఈ భోగి పండుగ, పాత బాధలను కాల్చివేసి,

కొత్త ఆశలను తీసుకువచ్చి,

మీ జీవితంలో సుఖం, శాంతిని,

ఇంతకుముందు లేనంత ఆనందాన్ని నింపాలి!"

4. "ఈ భోగి పండుగ, పాత మలినాలను వదిలించి,

మీకు శాంతి కలిగి, కొత్త ఆశలతో మీ జీవితం మెరిసిపోవాలి,

శుభాలు తీసుకొచ్చి మిమ్మల్ని ఆనందంతో నింపాలి!"

5. "పాతవన్నీ పోయి, కొత్త విషయాలతో

ఉత్సాహం నిండాలి,

మీ కుటుంబమంతా వైభవంగా కాంతులాడాలి,

ఈ భోగి పండుగ రోజు దశాబ్దాలకు సరిపడా ఆనందం తీసుకొచ్చి,

మీ జీవితాల్లో చైతన్యాన్ని పొందాలి!"

6."భోగి మంటల్లో చేదు ఙాపకాలు దగ్ధమై,

కొత్త ఆశల మెరుపులతో కొత్త దారులు చూపించాలి,

మీ కుటుంబం ప్రతి రోజు రాణించాలి,

ఈ పండుగతో ఆనందం నింపుకోవాలి!"

7. "నవభావ, నవవసంతంలో,

పాత దుఃఖాలను కాలంతో పాటు నాశనం చేసుకుంటూ,

ఈ భోగి పండుగ మీ జీవితాల్లో,

ఆశల స్ఫూర్తితో మెరిసిపోవాలి!"

8. "పాత దోషాలను కాల్చి,

కొత్త ఆశలు వెలుగులు విరియాలి,

భోగి పండుగతో మీ జీవితంలో,

శాంతి, సంతోషం నిండాలి."

9. "భోగి వచ్చి, కొత్త వసంతం తీసుకురావాలి,

మీ కుటుంబం ఆనందంతో నిండిపోవాలి,

మునుపెన్నడూ లేని శుభాలు మీ ఇంట కలిగి,

మీ జీవితాలు మెరిసిపోవాలి."

10. "కొత్త సంవత్సరంలో సరికొత్తగా,

కొత్త ఆశలతో కొత్తరోజు,

పాత బాధలు విరిగి పోవాలి,

భోగి పండుగ వెలుగులో,

మీ కుటుంబం సంతోషంగా జీవించాలి!"

11. "భోగి మంటల వెలుగుల్లో..

కన్నీళ్లు ఆవిరైపోవాలి, నవచైతన్యంతో,

జీవితంలో ప్రేమ, శాంతి పొంగాలి,

ఈ పండుగ ఆనందం తీసుకురావాలి!"

12. "ఆశ, శాంతి, ప్రేమలతో,

కుటుంబమంతా భోగి పండుగ జరుపుకోండి,

పాత దోషాలు తొలగిపోవాలి,

కొత్త ప్రయాణం మొదలు కావాలి!"

మీకు, మీ కుటుంబ సభ్యులకు మా తరఫు నుంచి భోగీ పండుగ శుభాకాంక్షలు

తదుపరి వ్యాసం