Batani Chaat Recipe: ఇంట్లోనే టేస్టీగా బఠానీ చాట్ చేసుకోండిలా.. చలికాలానికి పర్‌ఫెక్ట్ హాట్ స్నాక్
29 November 2024, 15:30 IST
- Batani Chaat Recipe: చల్లటి వాతావణంలో వేడివేడిగా బఠానీ చాట్ తింటే వారెవా అనిపిస్తుంది. కారంగా సూపర్ అనేలా ఉంటుంది. బండి స్టైల్‍లో ఇంట్లోనే బఠానీ చాట్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి.
Batani Chaat Recipe: ఇంట్లోనే టేస్టీగా బఠానీ చాట్ చేసుకోండిలా.. చలికాలానికి పర్‌ఫెక్ట్ హాట్ స్నాక్
Batani Chaat Recipe: ఇంట్లోనే టేస్టీగా బఠానీ చాట్ చేసుకోండిలా.. చలికాలానికి పర్‌ఫెక్ట్ హాట్ స్నాక్
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా తినాలని అనిపిస్తుంది. కారంగా.. వేడిగా ఉన్న స్నాక్ తింటే వావ్ అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో హాట్ స్నాక్స్ తినాలనిపిస్తుంది. ‘బఠానీ చాట్’ను చాలా మంది ఇష్టంగా తింటారు. బయటే బండ్ల వద్ద ఎక్కువగా దీన్ని తింటుంటారు. అయితే, ఈ బఠానీ చాట్‍ను ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు. అదెలానో ఇక్కడ చూడండి.
బఠానీ చాట్‍కు కావాల్సిన పదార్థాలు
- రెండు కప్‍ల తెల్ల ఎండు బఠానీలు (రాత్రంతా నానబెట్టాలి)
- 2 టేబుల్ స్పూన్‍ల నూనె
- సుమారు ఒకటిన్నర లీటర్ల నీరు
- ఓ టీస్పూన్ జీలకర్ర
- మూడు ఎండుమిర్చి
- రెండు ఉల్లిపాయలు (సన్నగా తరగాలి)
- రెండు టమోటాలు (పండుగా ఉండాలి.. తరగాలి)
- ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- ఓ టీస్పూన్ జీలకర్ర పొడి
- అర టీస్పూన్ పసుపు
- ఓ టేబుల్‍స్పూన్ ధనియాల పొడి
- పావు టీస్పూన్ ఆమ్‍చూర్ పొడి
- ఓ టీస్పూన్ కారం పొడి
- పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ (ఆప్షనల్)
- ఓ టీస్పూన్ చాట్ మసాలా
- తగినంత ఉప్పు
బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం
- రాత్రంతా నానబెట్టుకున్న (కనీసం 7 గంటలు నానాలి) తెల్ల బఠానీలను ముందుగా ఉడికించుకోవాలి. ఓ కుక్కర్‌లో లీటర్ నీరు పోసి బఠానీలు ఉడికించాలి.
- ఐదారు విజిల్స్ వచ్చే వరకు బఠానీలను మెత్తగా ఉడికించాలి. మెత్తగా ఉడికాక బఠానీలను పట్టనపెట్టుకోవాలి.
- స్టవ్‍పై ఓ ప్యాన్ పెట్టుకొని ముందుగా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
- ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేయాలి. ఉల్లి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి. అనంతరం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి.
- అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయాక తరిగిన టమాటా ముక్కలను వేసి గుజ్జుగా అయ్యే వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, ఆమ్‍చూర్ పొడి, చాట్ మాసాలా, కారం. బ్లాక్ సాల్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ఉడికించుకున్న బఠానీలు వేయాలి. అవి ఉడికించాక కుక్కర్లో మిగిలిన నీరు కూడా ప్యాన్‍లో వేసేయాలి. సుమారు 200 మిల్లీలీటర్ల నీరు కూడా అదనంగా పోయాలి.
- బాగా ఉడికించుకుంటే బఠానీలకు మసాలాలు పడతాయి. మీడియం మంటపై దీన్ని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి. అంతే బఠానీ చాట్ రెడీ అవుతుంది.
బఠానీ చాట్‍పై సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయల ముక్కలు, నిమ్మరసం వేసుకొని తింటే మరింత రుచిరకంగా ఉంటుంది. కారంగా, పుల్లగా అదిరిపోయే టేస్ట్‌తో ఈ చాట్ వావ్ అనేలా ఉంటుంది.