Amazfit GTS 4: భారత్‌లో Amazfit GTS 4 లాంచ్.. ధరెంతంటే!
19 September 2022, 21:19 IST
- భారత్‌లో Amazfit GTS 4 స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేశారు. స్పెషల్ ఫీచర్స్‌తో విడుదలైన ఈ వాచ్ ధర రూ. 16,999గా నిర్ణయించారు. స్క్రీన్‌పై యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్ ఉంది. ఇది ఇంటర్నల్ GPS, బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లే చేసే సదుపాయం కూడా ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉంది.
Amazfit GTS 4
ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ Amazfit భారత్‌లో తన ప్రీమియం స్మార్ట్ వాచ్ Amazfit GTS 4ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్‌లో AMOLED స్క్రీన్, ఇంటర్నల్ GPS, బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం ఉన్నాయి. దీనితో పాటు, ఈ తాజా స్మార్ట్ వాచ్‌లో అనేక ఫిట్‌నెస్, స్పోర్ట్స్ మోడ్‌లను కూడా అందించారు. ఈ Amazfit GTS 4 వాచ్ ఇండియాలో విడుదల చేయడం కంటే ముందే ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ చేశారు.
Amazfit GTS 4 స్మార్ట్‌వాచ్‌లో 390 x 450 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.76-అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్‌కి యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్ ఉంది. ఇది ఇంటర్నల్ GPS, బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్‌ను ఇస్తుంది. అంతే కాకుండా ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లే చేసే సదుపాయం కూడా స్మార్ట్‌వాచ్‌లో అందుబాటులోకి రానుంది.
Amazfit GTS 4 ఫీచర్లు
Amazfit యొక్క కొత్త స్మార్ట్‌వాచ్‌లో 150 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఈ మోడ్ సహాయంతో వినియోగదారులు తమ వ్యాయామాలను ట్రాక్ చేయవచ్చు. ఈ వాచ్‌కి 5 ATM రేటింగ్ వచ్చింది. ఈ డివైజ్ వాటర్‌ఫ్రూప్ కూడా.. Amazfit GTS 4 స్మార్ట్‌వాచ్ గుండె, నిద్ర, శ్వాస, ఒత్తిడి, రక్త ఆక్సిజన్‌ను పర్యవేక్షించగలదు. ఇది ఒక ఛార్జ్‌పై 8 రోజుల బ్యాకప్‌ను అందించే 300mAh బ్యాటరీతో పవర్‌ను పొందుతుంది. ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే, వినియోగదారులు ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ 5.0, ఇన్‌బిల్ట్ అలెక్సా, మినీ యాప్‌లు, జెప్ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.
Amazfit GTS 4 ధర
Amazfit GTS 4 స్మార్ట్‌వాచ్ ధర రూ. 16,999గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌ను రోజ్‌బడ్ పింక్, ఇన్ఫినిట్ బ్లాక్, మిస్టీ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇది సెప్టెంబర్ 22 నుండి అమెజాన్ ఇండియా, అమాజ్‌ఫిట్ ఇ-స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.
Amazfit GTS 4 కంటే ముందు Amazfit GTR 4ని విడుదలైంది. ఈ స్మార్ట్ వాచ్ 1.43-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 466×466 పిక్సెల్స్. ఇది GTSలా యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌ను కూడా పొందుతుంది. ఇది 200 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. ఇది కాకుండా, స్మార్ట్ వాచ్‌లో హృదయ స్పందన రేటు, నిద్ర, BP, ఆక్సిజన్‌ను పర్యవేక్షించే సదుపాయం ఉంది. Amazfit GTR 4 475mAh బ్యాటరీతో పవర్‌ను పొందుతుంది. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ తో 14 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్, ఫాల్ డిటెక్షన్‌కు కూడా సపోర్ట్‌ను ఇస్తుంది.