తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Remuneration For Varisu: వారిసు కోసం విజయ్‌ భారీ రెమ్యునరేషన్.. ఇండియాలోనే అత్యధికం!

Vijay Remuneration for Varisu: వారిసు కోసం విజయ్‌ భారీ రెమ్యునరేషన్.. ఇండియాలోనే అత్యధికం!

Hari Prasad S HT Telugu

10 January 2023, 16:53 IST

google News
    • Vijay Remuneration for Varisu: వారిసు కోసం విజయ్‌ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇది ఇండియాలోనే ఇంతకు ముందు ఏ ఇతర నటుడూ తీసుకోలేదన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
వారిసు మూవీలో విజయ్
వారిసు మూవీలో విజయ్

వారిసు మూవీలో విజయ్

Vijay Remuneration for Varisu: తమిళ స్టార్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ వారిసు. ఈ సినిమా బుధవారం (జనవరి 11) తమిళంలో రిలీజ్‌ కాబోతోంది. తెలుగులో వారసుడుగా వస్తున్న ఈ మూవీ జనవరి 14కు వాయిదా పడిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో దిల్‌ రాజు, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే తాజాగా పింక్‌విల్లాలో వచ్చిన వార్త ప్రకారం.. ఈ మూవీ కోసం దళపతి విజయ్‌ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడట. ఇది మామూలు విషయం కాదు. ఇప్పటి వరకూ ఏ సౌత్ ఇండియా నటుడు కూడా ఇంత భారీ మొత్తం తీసుకోలేదు. ఆ మధ్య పుష్ప 2 మూవీ కోసం అల్లు అర్జున్‌ రూ.125 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను చూస్తుంటే అతడు ఎంత మొత్తం అడిగితే అంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వారిసు మూవీకి ఈ స్థాయి రెమ్యునరేషన్‌ అంటేనే విజయ్‌పై ప్రొడ్యూసర్స్‌ ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో ప్రస్తుతం అతనికి ఉన్న ఫాలోయింగ్‌ అలాంటిది.

తమిళనాడు, తెలుగు రాష్ట్రాలే కాదు ఓవర్సీస్‌లోనూ విజయ్‌కు మంచి మార్కెట్‌ ఉంది. దానిని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు భారీ రెమ్యునరేషన్‌లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు వారిసు మూవీ కూడా తమిళం, తెలుగుతోపాటు హిందీలోనూ రిలీజ్‌ కాబోతోంది. హిందీలో జనవరి 13న, తెలుగులో జనవరి 14న రిలీజ్‌ కానుంది.

నిజానికి తెలుగులోనూ జనవరి 11నే రిలీజ్‌ చేయాలని ముందుగా భావించినా.. తర్వాత చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కోసం తాను వాయిదా వేస్తున్నట్లు ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు చెప్పాడు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో వీర సింహా రెడ్డి, వాల్తేర్‌ వీరయ్యల కంటే కూడా వారసుడుకే తక్కువ థియేటర్లు ఉన్నట్లు కూడా తెలిపాడు.

తదుపరి వ్యాసం