తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh Daughter Engagement: ఘ‌నంగా వెంక‌టేష్ కూతురు నిశ్చితార్థం - మార్చిలో పెళ్లి - ఫొటోలు వైర‌ల్‌

Venkatesh Daughter Engagement: ఘ‌నంగా వెంక‌టేష్ కూతురు నిశ్చితార్థం - మార్చిలో పెళ్లి - ఫొటోలు వైర‌ల్‌

26 October 2023, 11:02 IST

google News
  • Venkatesh Daughter Engagement: వెంక‌టేష్ రెండో కుమార్తె హ‌వ్య వాహిని నిశ్చితార్థం బుధ‌వారం జ‌రిగింది. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ డాక్ట‌ర్ త‌న‌యుడితో హ‌వ్య‌వాహిని పెళ్లి వ‌చ్చే ఏడాది మార్చిలో జ‌రుగ‌నుంది.

వెంక‌టేష్ రెండో కుమార్తె హ‌వ్య వాహిని నిశ్చితార్థం
వెంక‌టేష్ రెండో కుమార్తె హ‌వ్య వాహిని నిశ్చితార్థం

వెంక‌టేష్ రెండో కుమార్తె హ‌వ్య వాహిని నిశ్చితార్థం

Venkatesh Daughter Engagement: టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ ఇంట పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. వెంక‌టేష్ రెండో కూతురు హ‌వ్య‌వాహిని నిశ్చితార్థం విజ‌య‌వాడ‌కు చెందిన ఓ ప్ర‌ముఖ డాక్ట‌ర్ త‌న‌యుడితో బుధ‌వారం జ‌రిగింది. వెంక‌టేష్‌ స్వ‌గృహంలోనే హ‌వ్య‌వాహిని నిశ్చితార్థ వేడుక‌ను నిర్వ‌హించారు.

వ‌చ్చే ఏడాది మార్చిలో పెళ్లి జ‌రిపించాల‌ని ఇరు కుటుంబాల వారు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో చిరంజీవి, మ‌హేష్ బాబు, రానా, నాగ‌చైత‌న్య‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ హీరోలు సంద‌డి చేశారు. హ‌వ్య వాహిని ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

వెంక‌టేష్‌, నీరజ దంప‌తుల‌కు ఆశ్రీత‌, హ‌వ్య‌వాహిని, భావ‌న‌తో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. ఆశ్రీత పెళ్లి 2019లో జ‌రిగింది. తాను ప్రేమించిన వినాయ‌క్ రెడ్డితో ఆశ్రీత ఏడ‌డుగులు వేసింది. హ‌వ్య‌వాహినిది మాత్రం అరెంజెడ్ మ్యారేజీ అని స‌మాచారం.

సైంధ‌వ్‌తో బిజీ...

ప్ర‌స్తుతం వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్నీ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తొలుత ఈ సినిమాను డిసెంబ‌ర్ 22న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.

కానీ అదే రోజు స‌లార్ బ‌రిలో నిల‌వ‌డంతో సంక్రాంతికి సైంధ‌వ్‌ను వాయిదావేశారు. సైంధ‌వ్ త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్‌తో వెంక‌టేష్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

తదుపరి వ్యాసం