తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Awards To Rrr : ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో మూడు అవార్డులు

Awards To RRR : ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో మూడు అవార్డులు

HT Telugu Desk HT Telugu

19 December 2022, 22:09 IST

google News
    • Awards To RRR Movie : ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ అవార్డుల్లో మరోసారి సత్తాచాటింది. ఈ సినిమా ఖాతాలో మరో మూడు అవార్డులు వచ్చి చేరాయి.
ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డులు
ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డులు (twitter)

ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డులు

ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Cinema) ఈ ఏడాది.. ఎంత పెద్ద హిట్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే విదేశీ భాషల్లోనూ విడుదలైంది. ఇండియన్ స్క్రీన్ మీద పెద్ద హిట్ గా నిలిచింది. రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి(Rajmouli) తెరకెక్కించిన ఈ సినిమా.. ఎంతో పేరు తెచ్చుకుంది. తాజాగా మరో మూడు ఇంటర్నేషనల్ అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. ది ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్మిల్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా అందరి దృష్టిని ఆకర్శించింది.

ఈ అవార్డుల్లో మూడు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగం అవార్డు వచ్చింది. ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ సౌండ్ ట్రాక్ విభాగాల్లోనూ ఆర్ఆర్ఆర్ కు అవార్డులు వచ్చాయి. ఆస్కార్ బరిలో పోటీ పడుతోంది ఆర్ఆర్ఆర్. అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డుల్లో టాప్‌ టెన్ మూవీస్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ కు చోటు దక్కింది.

యూకే, అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లో ట్రిపుల్‌ ఆర్‌ మాయ చేస్తోంది. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ లెవల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకోవడంతోపాటు గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్ అవార్డుల్లో నామినేషన్లు కూడా పొందింది. యూకే బెస్ట్‌ మూవీస్‌ 2022 లిస్ట్‌లోనూ ఈ సినిమా చోటు దక్కించుకుంది. బ్రిటిష్‌ మ్యాగజైన ది గార్డియన్‌ ఈ మధ్యే 2022లో వచ్చిన 50 బెస్ట్‌ ఫిల్మ్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌కు కూడా స్థానం కల్పించింది. ఈ జాబితాలో 2022లో యూకేలో రిలీజైన సినిమాలు ఉన్నాయి. అంతేకాదు టాప్‌ 10లో ట్రిపుల్‌ ఆర్‌ నిలవడం విశేషం. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతానికి ఏడో స్థానం దక్కింది.

ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటూ.. ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది. ఇక మిగిలింది ఆస్కార్స్‌ నామినేషన్లే. దీనికోసం రాజమౌళితోపాటు మేకర్స్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రూ.50 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

తదుపరి వ్యాసం