తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Nonstop | బిందు మాధవి- తేజస్వి మధ్య ఫైట్.. ఇద్దరిలో తప్పు ఎవరిదంటే?

Bigg Boss Nonstop | బిందు మాధవి- తేజస్వి మధ్య ఫైట్.. ఇద్దరిలో తప్పు ఎవరిదంటే?

08 March 2022, 20:47 IST

google News
    • బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఇవ్వాల్టి ఎపిసోడ్‌లో బిందు మాధవి- తేజస్వికి మధ్య గొడవ జరిగింది. టాస్క్‌లో భాగంగా జరిగిన ఈ ఫైట్‌ను తేజూ చాలా దూరం తీసుకెళ్లింది. ఎంత చెబుతున్నా వినకుండా మొండిగా వ్యవహరించింది.
బిందు- తేజూ మధ్య గొడవ
బిందు- తేజూ మధ్య గొడవ (yOUTUBE)

బిందు- తేజూ మధ్య గొడవ

బిగ్‌బాస్ ఓటీటీ షో రోజుకో రకంగా కంటెంట్ ఇస్తోంది. సభ్యులందరూ ఒకరికి మించి మరొకరు కంటెంట్ కోసం పాకులాడుతున్నారు. ఆరంభంలో విసుగ్గా అనిపించిన షో.. రాను రాను ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే గొడవలు స్టార్ట్ అయ్యాయి. నిన్న నామినేషన్ సమయంలో శివ-నటరాజ్ మాస్టర్, అషూ-మిత్రా మధ్య ఫైట్లు ఓ రేంజ్‌లో జరిగాయి. ముఖ్యంగా వారియర్స్, ఛాలెంజర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నామినేషన్లలో అయితే బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకున్నారు. తాజాగా మంగళవారం నాడు బిందు మాధవి, తేజస్వి, ఆర్జే చైతూ మధ్య గొడవలు జరిగాయి.

మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా బిగ్‌బాస్ ఇరు జట్లకు ఓ టాస్క్ ఇస్తాడు. వారియర్స్, చాలెంజర్స్ తమ తమ జట్ల నుంచి ఎవరోకరిని ఎంచుకుని ఒకరినొకరు ప్రశ్నలు అడగాలని, అయితే వాటికి సరైన సమాధానం కాకుండా ప్రత్యామ్నాయంగా ఏదోకటి బదులివ్వాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి అవకాశమివ్వాలని సూచించారు. అంతేకాకుండా ఈ టాస్క్‌లో ఎవరైతే సరైన సమాధానం చెబుతారో ఓటమి పాలవుతారని, ఇలా ఏ జట్టయితే ఎక్కువ సార్లు సరైన సమాధానం చెబుతుందో ఆ జట్టు ఓటమి పాలై.. ప్రత్యర్థి జట్టు సభ్యులు చెప్పిన శిక్షకు గురవుతారని బిగ్‌బాస్ షరతు విధించాడు.

ఇందులో భాగంగా కొంతమంది కంటెస్టెంట్లు ఫన్నీ ఆన్సర్లు ఇచ్చి నవ్వులు తెప్పించారు. ముఖ్యంగా యాంకర్ శివ, అరియానా గ్లోరీ, శ్రీ రాపాకా లాంటి తదితరులు విచిత్రమైన సమాధానాలు చెబుతూ కామెడీ క్రియేట్ చేశారు. చివరకు ఈ టాస్క్‌లో వారియర్స్ విజయం సాధిస్తారు. ఇందులో భాగంగా ఛాలెంజర్స్‌కు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా.. ఛాలెంజర్స్ వారి వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని రచిస్తారు. వారియర్స్ పనులను తమతో చేయిస్తారనే అనుమానంతో కొన్నింటిని ముందుగానే వారితో చేయించాలని అనుకుంటారు. ఎందుకంటే బిగ్‌బాస్ ఛాలెంజర్స్ పనులను వారియర్స్ చేయాలని షో మొదటి రోజే చెప్పారు. ఆ విధంగా టాస్క్‌ను ముందుగా తీసుకెళ్లడంలో భాగంగా బిందు మధవి, ఆర్జే చైతూ.. కుకింగ్ తేజస్విని చేయాలని తేజూకు చెబుతారు.

ఇప్పటికే తాను కుకింగ్ చేస్తున్నానని, మళ్లీ తానే వంట చేయాలని చెప్పడం రివేంజ్ తీసుకుంటున్నారని బిందు, ఆర్జే చైతూపై సీరియస్ అయింది. అంతేకాకుండా తాము టాస్క్‌లో విన్ అయ్యాం కాబట్టి మరో టాస్క్ మీరు గెలిచేంత వరకు తమ పనులన్నీ ఛాలెంజర్స్ చేయాలని తేజూ తేల్చి చెప్పింది. పదే పదే తనకు టాస్క్ ఇవ్వడం కాదని నొక్కి చెబుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చి తాము ఛాలెంజర్స్‌కు శిక్ష ఇచ్చే ఉద్దేశం లేదని, తమ పనులు చేయాలని, తాము కూడా సహాయం చేస్తామని స్పష్టం చేసింది. దీంతో తేజూ నువ్వు మాట మార్చావ్.. అంటూ బిందు మాధవి పదే పదే చెప్పింది. ఇందుకు అన్నీ పనులు మేమే చేయాలని చెప్పి ఇప్పుడు సహాయం చేస్తామని చెప్పడం మాట మార్చినట్లే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది బిందు. కానీ ఈ అంశంపై తేజూ అస్సలు తగ్గలేదు. బిందు, ఆర్జే చైతూపై విమర్శలు సంధించడమే కాకుండా కొన్ని అసభ్యకరమైన పదజాలలను కూడా వాడింది.

తేజూ-బిందులో తప్పెవరిది..

ఈ విషయంలో ఆర్జై చైతూ, బిందు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినా అర్థం చేసుకోలేదు. చాలా వరకు ఇదే మ్యాటర్‌ను డ్రాగ్ చేసింది. వీరిద్దరిలో నూటికి నూరుపాళ్లు తప్పు తేజూదే. ఎందుకంటే పనులు చేయాలని వారియర్స్‌కు బిగ్‌బాస్ ఆరంభంలోనే సూచించాడు. ఛాలెంజర్స్ ఎట్టిపరిస్థితుల్లోనూ వారియర్స్ పనులు చేయకూడదని నోట్ కూడా ఇచ్చాడు. అలాంటిది ఇంత చిన్న టాస్క్‌ను అడ్డం పెట్టుకుని తేజూ పనులన్నీ ఛాలెంజర్స్‌కు చెప్పడంలో అర్థం లేదు. అంతేకాకుండా మాట మార్చినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. మార్చలేదని వాదనపెట్టుకోవడం ఆమె చేసిన మరో తప్పు. అయితే బిందు మాధవి పదే పదే నాలుగు సార్లు మాట మార్చావ్ అనడం తేజూకు ఆగ్రహం తెప్పించింది. అయితే బిందు తప్పు పెద్దగా కనిపించలేదు. ఊరికే తేజూ వారితో గొడవ పడటం, ఆర్జే చైతూ ఆమెను సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా అతని మాట వినకుండా మొండిగా వ్యవహరించడం లాంటివి తేజూ చెప్పిన పెద్ద తప్పులు.

తదుపరి వ్యాసం