Malayalam Web Series: ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్ - మలయాళం కామెడీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
25 May 2024, 6:11 IST
Malayalam Web Series: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మలయాళం యాక్టర్ సూరజ్ వెంజరమూడు కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. నాగేంద్రన్స్ హనీమూన్స్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్‌సిరీస్
Malayalam Web Series: డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సూరజ్ వెంజరమూడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. కామెడీ కథతో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌కు నాగేంద్రన్స్ హనీమూన్స్అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సిరీస్‌లో సూరజ్ వెంజరమూడుతో పాటు గ్రేస్ ఆంటోనీ, కనికుశృతి, శ్వేత మీనన్, ఆల్ఫీ పంజికరన్, నిరంజన అనూప్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
ఫస్ట్‌లుక్ రిలీజ్...
నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. వన్ లైఫ్... ఫైవ్ వైఫ్స్ అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. ఐదుగురు ఫిమేల్ లీడ్ యాక్టర్స్ మధ్యలో సూరజ్ వెంజరమూడు భయంభయంగా కూర్చొని కనిపిస్తోన్నాడు.
ఈ సిరీస్‌లో ఐదుగురు భార్యలున్న భర్తగా సూరజ్ వెంజరమూడు కనిపించబోతున్నాడు. ఐదుగురు భార్యలతో కలిసి భర్త హనీమూన్ ప్లాన్ చేయడానికి కారణం ఏమిటి? ఈ ట్రిప్‌లో అతడు ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఐదుగురిని అతడు ఎందుకు పెళ్లిచేసుకోవాల్సివచ్చిందనే అంశాలతో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కుతోంది.ఈ సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో...
నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ ఈ సిరీస్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. జూన్ ఫస్ట్ వీక్‌లో ఈ మలయాళం కామెడీ సిరీస్ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నాలుగో వెబ్ సిరీస్…
నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్‌సిరీస్‌కు నితిన్ రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో మలయాళంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ అనే వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించారు నితిన్ రెంజీ ఫణిక్కర్. ఈ సిరీస్‌లు దర్శకుడిగా అతడికి మంచు పేరుతెచ్చిపెట్టాడు. ఈ మూడు సిరీస్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే రిలీజయ్యాయి.
నాగేంద్రన్స్ హనీమూన్ నితిన్ రెంజీ ఫణిక్కర్ దర్శకత్వంలో వస్తోన్న నాలుగో వెబ్‌సిరీస్. తొలుత ఈ సిరీస్‌కు మధువిధు అనే టైటిల్‌ను అనుకున్నారు. కథకు యాప్ట్ అనే ఆలోచనతో నాగేంద్రన్స్ హనీమూన్స్ అని ఛేంజ్ చేశారు.
వెర్సటైల్ యాక్టర్...
మలయాళంలో సూరజ్ వెంజరమూడు వెర్సటైల్ యాక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్‌గా కథ నచ్చితే ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధపడుతుంటాడు. అతడు హీరోగా నటించిన డ్రైవింగ్ లైసెన్స్, వికృతి, ఆండ్రాయిడ్ కుంజప్పన్‌తో పాటు పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పలు అవార్డులను అందుకున్నాయి.
పెరారియతావార్ సినిమాతో 2015లో నేషనల్ అవార్డును అందుకున్నాడు సూరజ్ వెంజరమూడు. మలయాళంలో మూడు సినిమాలు చేస్తోన్న సూరజ్....విక్రమ్ ధీర వీర సూరన్ మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సూరజ్ హీరోగా నటించిన పలు మలయాళ సినిమాలు తెలుగులోకి రీమేకయ్యాయి.