Scam 2003 On Sony Liv OTT: స్కామ్ 2003 రిలీజ్ డేట్ ఇదే.. ఈ సిరీస్ ఏం స్కామ్ గురించి అంటే!
18 June 2023, 21:52 IST
- Scam 2003 On Sony Liv OTT: స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ రిలీజ్ డేట్‍ను సోనీ లివ్ ప్రకటించింది. స్కామ్ ఫ్రాంచైజీలో కొనసాగింపుగా ఇది వస్తోంది.
Scam 2003 On Sony Liv OTT: స్కామ్ 2003 రిలీజ్ డేట్ ఇదే.. (Photo: Sony Liv)
Scam 2003 On Sony Liv OTT: స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ వెబ్ సిరీస్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ కింగ్‍గా చెలామణి అయి పతనం చెందిన హర్షద్ మెహతా జీవితంపై రూపొందిన ఈ సిరీస్ 2020లో సోనీ లివ్‍లో విడుదలై చాలా పాపులర్ అయింది. ఇప్పుడు స్కామ్ ఫ్రాంచైజీలో రెండో సిరీస్ వస్తోంది. ‘స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ’ పేరుతో ఈ సిరీస్ రానుంది. స్కామ్ 1992కు డైరెక్షన్ చేసిన హన్సల్ మెహతాతో పాటు తుషార్ హిరనందానీ ఈ ‘స్కామ్ 2003’కు దర్శకత్వం వహిస్తున్నాడు. స్కామ్ 2003 సిరీస్ విడుదల తేదీని సోనీ లివ్ ప్రకటించింది.
2003లో అబ్దుల్ కరీమ్ తెల్గీ చేసిన ఫేక్ స్టాంప్ పేపర్ల స్కామ్ అంశంపై.. ఈ స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ సిరీస్ రూపొందుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన ‘స్కామ్ 2003’ సిరీస్‍ను విడుదల చేయనున్నట్టు సోనీ లివ్ నేడు ప్రకటించింది. ఈ స్కామ్ గురించి జర్నలిస్ట్ సంజయ్ సింగ్ రాసిన హిందీ బుక్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‍ను రూపొందిస్తున్నారు దర్శకులు.
అబ్దుల్ కరీమ్ తెల్గీ 2003 స్టాంప్ పేపర్ స్కామ్ గురించి ఈ సిరీస్‍లో చూపించనున్నారు మేకర్స్. కర్ణాటకలోని ఖనాపూర్‌లో జన్మించిన కరీమ్ తెల్గీ ప్రయాణం.. ఫేక్ స్టాంప్ పేపర్ల స్కామ్ మాస్టర్ మైండ్‍గా మారే వరకు ఎలా సాగిందన్నది ఈ సిరీస్‍లో ఉండనుంది. మొత్తంగా 18 రాష్ట్రాల్లో ఈ స్కామ్ అప్పట్లో కలకలం సృష్టించింది. ఈ స్కామ్ విలువ రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా.
“సోనీ లివ్ 2.0కు నేడు మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. ప్రత్యేక ప్రకటనతో మేం సెలెబ్రేషన్స్ మొదలుపెడుతున్నాం” అంటూ సోనీ లివ్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. స్కామ్ 2003 సిరీస్‍ను సెప్టెంబర్ 2న సోనీ లివ్‍లో విడుదల చేయనున్నట్టు ఓ చిన్న టీజర్‌ను పోస్ట్ చేసింది.
స్కామ్ 2003 సిరీస్‍లో పాత్రను గంగన్ దేవ్ పోషిస్తున్నాడు. అప్లాజ్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై ఈ సిరీస్ వస్తోంది.