Pathan Teaser Released: యాక్షన్ సీన్లతో దుమ్మురేపుతోన్న పఠాన్.. గ్యాప్ ఇచ్చినా హైప్ పెంచిన కింగ్ ఖాన్
08 January 2024, 22:18 IST
- Pathan Teaser Released: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.
పఠాన్ టీజర్ విడుదల
Pathan Teaser Released: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వెండితెరపై కనిపించి నాలుగేళ్లు కావస్తుంది. ఆయన చివరగా నటించిన జీరో చిత్రం కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేదు. ప్రస్తుతం సెట్స్‌పైన రెండు చిత్రాలు ఉండగా.. మరికొన్ని ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. తాజాగా ఆయన నటించిన సరికొత్త చిత్రం పఠాన్. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసింది. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. బుధవారం షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం పఠాన్ టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్‌ను గమనిస్తే.. ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రంలో ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్లు, రొమాన్స్, విజువల్స్ కొదవేలేదన్నట్లుగా టీజర్‌లో చూపించారు. పఠాన్ గురించి నీకు ఏం తెలుసు? అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.
“మూడేళ్ల నుంచి అతడి జాడ లేదు. చివరి మిషన్‌లో అతడు పట్టుబడ్డాడు. అతడిని టార్చర్ చేశారని విన్నా. పఠాన్ ఇంకా బతికే ఉన్నాడో లేదో తెలియదు.” అనే డైలాగ్‌తో షారుఖ్ పాత్రను పరిచయం చేయగా.. ఇందుకు కింగ్ ఖాన్ నవ్వుతూ బతికే ఉన్నా అనడంతో ప్రేక్షకులను ఈలలు వేయించేలా ఉంది. ఇంతకీ ఈ పఠాన్ ఎవరు? అతడిని ఎందుకు అరెస్టు చేశారు? జాన్ అబ్రహం పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.
సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాను 2023 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఏక కాలంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.