తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: బ‌డ్జెట్ 120 కోట్లు - క‌లెక్ష‌న్స్ 325 కోట్లు - ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ - ఐదు భాష‌ల్లో రిలీజ్‌!

OTT: బ‌డ్జెట్ 120 కోట్లు - క‌లెక్ష‌న్స్ 325 కోట్లు - ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ - ఐదు భాష‌ల్లో రిలీజ్‌!

30 November 2024, 12:51 IST

google News
  • OTT: అమ‌ర‌న్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ఫిక్సైంది. డిసెంబ‌ర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఈస్ట్రీమింగ్ కాబోతోంది. శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ మూవీ ఓటీటీలో ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

ఓటీటీ
ఓటీటీ

ఓటీటీ

OTT: కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ అమ‌ర‌న్ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా వ‌చ్చేసింది. డిసెంబ‌ర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అమ‌ర‌న్ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్ల‌డించింది.

బ‌యోపిక్ వార్ డ్రామా...

బ‌యోపిక్ వార్ డ్రామా మూవీలో శివ‌కార్తికేయ‌న్, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించారు. అగ్ర హీరో క‌మ‌ల్‌హాస‌న్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియాసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆర్మీ మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 325కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ఇర‌వై కోట్ల లాభాలు...

థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు దాటినా ఇప్ప‌టికీ అమ‌ర‌న్ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. అమ‌ర‌న్ తెలుగు వెర్ష‌న్ 29 రోజుల్లో 46 కోట్ల గ్రాస్...25 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది. ఐదున్న‌ర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన నిర్మాత‌ల‌కు ఇర‌వై కోట్ల‌కుపైనే లాభాల‌ను మిగిల్చింది.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా...

వ‌ర‌ల్డ్ వైడ్‌గా కూడా అమ‌ర‌న్ కలెక్ష‌న్స్ ప‌రంగా ప‌లువురు స్టార్ హీరోల సినిమాల‌ను తిర‌గ‌రాసింది. 325 కోట్ల వ‌ర‌కు గ్రాస్ ...160 కోట్ల‌కు షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. నిర్మాత క‌మ‌ల్‌హాస‌న్‌కు 95 కోట్ల‌కుపైనే ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది. త‌మిళ వెర్ష‌న్ ఇప్ప‌టివ‌ర‌కు 160 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. త‌మిళం త‌ర్వాత తెలుగులోనే అమ‌ర‌న్ మూవీకి ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. .

అమ‌ర‌న్ క‌థ ఇదే...

ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ (శివ‌కార్తికేయ‌న్‌) చిన్న‌త‌నం నుంచే సైనికుడు కావాల‌ని క‌ల‌లు కంటాడు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ఉద్యోగానికి ఎంపిక అవుతాడు. కాలేజీలో చ‌దువుతోన్న టైమ్‌లోనే రెబెకా (సాయిప‌ల్ల‌వి) వ‌ర్గీస్‌ను ప్రేమిస్తాడు. ఆర్మీలో జాబ్ కావ‌డంలో ఇందు కుటుంబ‌స‌భ్యులు ముకుంద్‌తో పెళ్లికి అభ్యంత‌రం చెబుతారు. పెద్ద‌ల‌ను ఒప్పించి ముకుంద్‌, రెబెకా ఎలా ఒక్క‌ట‌య్యారు?

ఆర్మీలో మేజ‌ర్‌గా ప‌లు సీక్రెట్ ఆప‌రేష‌న్స్‌ను వ‌ర‌ద‌రాజ‌న్ ఎలా నిర్వ‌ర్తించాడు? వృత్తి నిర్వ‌హ‌ణ‌క‌కు, కుటుంబ బాధ్య‌త‌ల‌కు మ‌ధ్య ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్నాడు అన్నది స్ఫూర్తిదాయ‌కంగా అమ‌ర‌న్ మూవీలో డైరెక్ట‌ర్ చూపించారు.

తదుపరి వ్యాసం