Mr Bachchan OTT: ఓటీటీలోకి మిస్టర్ బచ్చన్ - రవితేజ డిజాస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?
07 September 2024, 12:59 IST
Mr Bachchan OTT: రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఆఫీషియల్‌గా వచ్చేసింది. సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డిజాస్టర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.
మిస్టర్ బచ్చన్ ఓటీటీ
Mr Bachchan OTT: రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీలోకి వస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. సెప్టెంబర్ 12న మిస్టర్ బచ్చన్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. థియేటర్లలో రిలీజైన నెలలోపే రవితేజ మూవీ ఓటీటీలోకి వస్తోండటం గమనార్హం.
హరీష్ శంకర్ డైరెక్టర్...
మిస్టర్ బచ్చన్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ రైడ్ ఆధారంగా మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కించాడు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్‌తో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జగపతిబాబు విలన్‌గా నటించిన ఈ మూవీలో సచిన్ ఖేడ్కర్, సత్య, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు.
భాగ్యశ్రీ బోర్సే గ్లామర్...
రిలీజ్‌కు ముందు మిస్టర్ బచ్చన్‌పై మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్స్‌తో పాటు ప్రమోషన్స్‌లో హరీష్ శంకర్ స్పీచ్‌లు, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ కారణంగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. కానీ ఔట్‌డేటెడ్ స్టోరీ, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీని హరీష్ శంకర్ సినిమాలో చూపించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దాదాపు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 10 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతలకు ఇరవై కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది.
మిస్టర్ బచ్చన్ కథ ఇదే...
మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీపరుడైన ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ పొగాకు వ్యాపారిపై జరిపిన రైడ్ కారణంగా సస్పెండ్ కావడంతో సొంతూరు కోటిపల్లి వచ్చేస్తాడు. స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా నిర్వహిస్తుంటాడు. అలాంటి టైమ్‌లోనే బచ్చన్ లైఫ్‌లోకి జిక్కి (భాగ్యశ్రీ బోర్సే) వస్తుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. బచ్చన్‌కు ఉద్యోగం లేదని జిక్కి ఫాదర్ పెళ్లికి అభ్యంతరం చెబుతాడు.
సరిగ్గా అప్పుడే బచ్చన్‌పై సస్పెన్సన్ ఎత్తేస్తారు. ఎంపీ ముత్యాల జగ్గయ్యపై (జగపతిబాబు) రైడ్ చేయాలని బచ్చన్‌కు ఆర్డర్స్ వస్తాయి. ఆ రైడ్‌లో ఏం జరిగింది? బచ్చన్‌కు తన ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు దొరక్కుండా జగ్గయ్య ఏం చేశాడు? ఈ రైడ్‌ను ఆపించేందుకు జగ్గయ్య చేసిన ప్రయత్నాలను బచ్చన్ ఎలా తిప్పికొట్టాడు? జగ్గయ్యకు, బచ్చన్‌కు ఉన్న పాత గొడవలేంటి? అన్నదే మిస్టర్ బచ్చన్ మూవీ కథ. మిస్టర్ బచ్చన్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశాడు.
డబుల్ ఇస్మార్ట్ కూడా...
మిస్టర్ బచ్చన్‌తో పాటు ఆగస్ట్ 15న రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ కూడా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. మిస్టర్ బచ్చన్ కంటే ముందేగానే ఇటీవలే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.