Pushpa 2 box office collection: రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి పుష్ప 2.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆల్‌టైమ్ రికార్డ్
11 December 2024, 22:18 IST
Pushpa 2 box office collection: పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రూల్ చేస్తోంది. రూ.294 కోట్లతో తొలిరోజు అదిరిపోయే బోణి అందుకున్న అల్లు అర్జున్ మూవీ.. వారంలోపే వెయ్యి కోట్ల మార్క్‌ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో రిలీజైన పుష్ప 2 మూవీ.. వారంలోపే వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్‌ని అందుకుంది. భారత చలనచిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా ఈ మార్క్‌ని అందుకున్న తొలి చిత్రంగా పుష్ప2 మూవీ నిలిచింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా రూ.1,000 కోట్ల వసూళ్లని అధికారికంగా ధ్రువీకరించింది.
మరో నేషనల్ అవార్డ్ వస్తుందట
పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. అలానే మలయాళం హీరో ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
2021లో వచ్చిన పుష్ప : ది రైజ్ సినిమాకి పుష్ప 2 సీక్వెల్‌కాగా.. దర్శకుడు సుకుమార్ అందరి అంచనాలకి మించి మాస్ ఎంటర్‌టైనర్‌గా పుష్ప2ని తెరకెక్కించారు. పుష్ప 1లో అల్లు అర్జున్ నటనకి నేషనల్ అవార్డ్‌రాగా.. పుష్ప 2కి కూడా వస్తుందంటూ అప్పుడే కొంత మంది సెలెబ్రిటీలు జోస్యం చెప్తున్నారు.
అదిరిపోయే బోణితో..
రిలీజ్ రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు వసూళ్లతో బోణి కొట్టిన పుష్ప 2 మూవీ.. తాజాగా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ రికార్డులను కూడా తుడిచిపెట్టేస్తూ వేగంగా రూ.1,000 కోట్లు మార్క్‌ని చేరుకుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషల్లో పుష్ప2 రిలీజ్ అవగా.. తెలుగులో కంటే హిందీలోనే పుష్ప2కి ఎక్కువ కలెక్షన్లు వస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీ గత గురువారం రిలీజ్ అవగా.. ఆదివారం రోజు కూడా రూ.141.50 కోట్లు వసూళ్లు రావడం గమనార్హం.
బాలీవుడ్ సర్‌ప్రైజ్
పుష్ప 2 మూవీకి మంగళవారం నాటికి తెలుగులో రూ.222 కోట్లు రాగా.. హిందీలో రూ.370 కోట్లు పైచిలుకు వసూళ్లు రావడం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. తెలుగులోనే కాదు.. హిందీలోనూ థియేటర్ ఆక్యుపెన్సీలో పుష్ప2 ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ డిసెంబరులో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో పుష్ప2 జోరు కొనసాగే అవకాశం ఉంది. ఈ సినిమా రూ.1500 కోట్లుపైనే వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.