తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pettarap Review: పేట్టా రాప్ రివ్యూ - కోలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Pettarap Review: పేట్టా రాప్ రివ్యూ - కోలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

08 December 2024, 13:21 IST

google News
  • Pettarap Review: ప్ర‌భుదేవా, వేదిక జంట‌గా న‌టించిన పేట్టా రాప్ మూవీ ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీలో స‌న్నీలియోన్ అతిథి పాత్ర‌లో న‌టించింది.

పేట్టా రాప్ రివ్యూ
పేట్టా రాప్ రివ్యూ

పేట్టా రాప్ రివ్యూ

Pettarap Review: ప్ర‌భుదేవా, వేదిక హీరోహీరోయిన్లుగా న‌టించిన పేట్టా రాప్ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈసినిమాలో స‌న్నీ లియోన్ గెస్ట్ రోల్‌లో న‌టించింది. ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి ఎస్‌జే సిను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పేట్టా రాప్ మూవీ ఎలా ఉందంటే?

బాల‌, జెన్ని ల‌వ్‌స్టోరీ...

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అలియాస్ బాల‌ (ప్ర‌భుదేవా) చిన్న‌త‌నం నుంచే సినిమా హీరో కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. స్కూల్ డేస్‌లో బాల‌ను జాన‌కి అనే అమ్మాయి ఇష్ట‌ప‌డుతుంది. కానీ ఆమెను కాద‌ని మ‌రో అమ్మాయిని ప్రేమిస్తాడు బాల‌. ఆమె బాల‌కు దూర‌మ‌వుతుంది. పెద్ద‌యిన త‌ర్వాత హీరోగా 114 ఆడిష‌న్స్ చేస్తాడు బాల‌. కానీ ఒక్క అవ‌కాశం రాదు.

జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ స్నేహితుల‌తో జ‌ల్సాలు చేస్తుంటాడు బాల‌. జెన్ని (వేదిక‌) సింగ‌ర్‌. సొంతంగా మ్యూజిక్ బ్యాండ్ న‌డుపుతుంటుంది. బాల డ్యాన్స్ న‌చ్చ‌డంతో అత‌డిని త‌న ట్రూప్‌లో జాయిన్ అవ్వ‌మ‌ని ఆఫ‌ర్ ఇస్తుంది జెన్ని. సెకండ్ హీరోగా ఓ మూవీలో ఛాన్స్ రావ‌డంతో జెన్ని ఆఫ‌ర్‌ను బాల రిజెక్ట్ చేస్తాడు.

కానీ షూటింగ్‌లో జ‌రిగిన అవ‌మానం కార‌ణంగా మెయిన్ హీరోతో పాటు ప్రొడ్యూస‌ర్‌ను కొడ‌తాడు బాల‌. ఆ గొడ‌వ కార‌ణంగా బాల సినిమా క‌ల‌ల‌కు పుల్‌స్టాప్ ప‌డుతుంది. ఆత్య‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు బాల‌. ఇంట్లో నుంచి డ‌బ్బు, న‌గ‌లు తీసుకొని పారిపోతాడు. మ‌రోవైపు త‌న‌ను ఇష్ట‌ప‌డిన గుణ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డానికి జెన్ని సిద్ధ‌ప‌డుతుంది. ఆమె పెళ్లికి బాల ఎందుకు వెళ్లాడు?

బాల‌తో పాటు జెన్నిని చంప‌డానికి మైఖేల్‌, వీర‌మ‌ణి, కింగ్ కుమార్ అనే రౌడీలు ఎందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు? జెన్ని పెళ్లి బాల వ‌ల్ల ఎలా చెడిపోయింది? త‌న‌ను ప్రేమించిన జాన‌కిని బాల క‌లుసుకున్నాడా? హీరో కావాల‌నే బాల క‌ల నెర‌వేరిందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

విడిపోయిన నాయ‌కానాయిక‌లు...

చిన్న‌నాడే విడిపోయిన హీరోహీరోయిన్లు...పెద్దైన త‌ర్వాత మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం...తాము ప్రేమికులం అనే విష‌యం తెలియ‌కుండా క‌లిసి జ‌ర్నీ చేయ‌డం అనే అంశాల‌తో ద‌క్షిణాదిలో చాలా సినిమాలే వ‌చ్చాయి. ప్ర‌భుదేవా పేట్టా రాప్ కూడా ఈ పాయింట్‌తోనే తెర‌కెక్కింది.

సినిమా అవ‌కాశాల కోసం...

సినిమా హీరో కావాల‌ని క‌ల‌లు కంటూ త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డి బ‌తికే ఓ యువ‌కుడు...సొంతంగా మ్యూజిక్ బ్యాండ్ న‌డుపుతూ స్వతంత్య్రంగా బ‌తికే ఓ యువ‌తి మ‌ధ్య ప్రేమాయ‌ణం...వారిద్ద‌రి జ‌ర్నీలోకి ముగ్గురు విల‌న్స్ ఎలా వ‌చ్చార‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ఎస్‌జే సుని పేట్టా రాప్ క‌థ‌ను రాసుకున్నాడు. ఈ ల‌వ్‌స్టోరీలో అంత‌ర్లీనంగా టాలెంట్ ఉండి కూడా సినిమా ఇండ‌స్ట్రీలో స‌రైన అవ‌కాశాలు రాక ఆర్టిస్టులు ప‌డే సంఘ‌ర్ష‌ణ‌, క‌ష్టాల‌ను ట‌చ్ చేశారు.

ఫ్రెష్‌నెస్ మిస్‌...

కొన్ని క‌థ‌లు పేప‌ర్‌పై రాసుకున్న‌ప్పుడు బాగుంటాయి. కానీ స్క్రీన్‌పై మాత్రం ఆ ఫ్రెష్‌నెస్ క‌నిపించ‌దు.

పేట్టా రాప్ అలాంటి ఫీల్‌నే క‌లిగిస్తుంది. హీరో చిన్న‌నాటి ల‌వ్‌స్టోరీతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొద‌ల‌వుతుంది. ఎప్పుడైతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుందో అక్క‌డి నుంచే సినిమా ప‌ట్టాలు త‌ప్పింది. మూవీ ఆఫ‌ర్ల‌ కోసం హీరో చేసే ప్ర‌య‌త్నాల్లో నాచురాలిటీ మిస్స‌యింది.

మైఖేల్ అండ్ గ్యాంగ్‌తో హీరోయిన్ గొడ‌వ‌, ఆ త‌ర్వాత బాల‌, జెన్ని మ‌ధ్య ప‌రిచ‌యం, వారి ప్రేమాయ‌ణం ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి సీన్స్ వ‌స్తూనే ఉంటాయి. వాటిలో ఎమోష‌న్‌, కామెడీ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేదు. హీరోహీరోయిన్ల మ‌ధ్య బాండింగ్‌ను స‌రిగ్గా ఎస్లాబ్లిష్ చేయ‌లేక‌పోయాడు డైరెక్ట‌ర్‌.

సిల్లీ జోక్స్‌, బోరింగ్ సీన్స్‌…

హీరో చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో సెకండాఫ్‌లో ఏదో ట్విస్ట్ ఉంటుంద‌ని ఊహించుకున్న ఆడియెన్స్ నిరాశే మిగిల్చాడు డైరెక్ట‌ర్‌. క‌థే లేకుండా సిల్లీ జోక్స్‌, బోరింగ్ సీన్స్‌తో సెకండాఫ్‌ను న‌డిపించాడు. విల‌న్స్ గ్యాంగ్స్ మ‌ధ్య ఆధిప‌త్య పోరును కామెడీగా చూపించాలా...సీరియ‌గ్‌గా ప్ర‌జెంట్ చేయాలా అనే విష‌యంలో డైరెక్ట‌ర్‌కే క్లారిటీ లేన‌ట్లుగా అనిపిస్తుంది. త‌న చిన్న‌నాటి ప్రియురాలిని బాల క‌లుసుకునే ఎపిసోడ్‌, ఫ్యామిలీ సీన్స్‌...ఇలా ప్ర‌తి విష‌యంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోయాడు.షార్ట్‌ఫిల్మ్ స్టోరీతో సినిమా చేసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

చిరాకు ఎక్కువ‌...

బాల పాత్ర‌లో ప్ర‌భుదేవా న‌ట‌న కొన్ని సీన్స్‌లో బాగుంది. సినిమా అవ‌కాశాల కోసం స్ట్ర‌గుల్స్ ప‌డే సీన్స్‌లో మెప్పించాడు. వేదిక పాత్ర‌లో ఎలాంటి ఛాలెంజెస్ లేవు. రొటీన్‌గా ఆమె క్యారెక్ట‌ర్ సాగింది. విల‌న్లు, హీరో ఫ్రెండ్స్ క్యారెక్ట‌ర్స్ చేసే కామెడీ చిరాకునే ఎక్కువ‌గా పెడుతుంది. ఓ సాంగ్‌లో స‌న్నీలియోన్ క‌నిపించింది. ఔట్‌డేటెడ్ మూవీలో ఇమాన్ మ్యూజిక్ ఒక్క‌టే బిగ్గెస్ట్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. పాట‌లు బాగున్నాయి.

ఓపిక‌కు ప‌రీక్ష‌...

పేట్టా రాప్ టైటిల్‌లో ఉన్న క్రియేటివిటీ సినిమాలు లేదు. సిల్లీ కాన్సెప్ట్‌, ఔట్‌డేటెడ్ స్టోరీతో రూపొందిన ఈ మూవీ చివ‌రి వ‌ర‌కు ఆడియెన్స్ ఓపిక‌కు పెద్ద ప‌రీక్ష‌గా నిలుస్తుంది.

తదుపరి వ్యాసం