తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Payal Rajput |ప్రియుడి కోసం హెయిర్ స్టైలిస్ట్​గా మారిన పాయ‌ల్ రాజ్‌పుత్‌

Payal Rajput |ప్రియుడి కోసం హెయిర్ స్టైలిస్ట్​గా మారిన పాయ‌ల్ రాజ్‌పుత్‌

HT Telugu Desk HT Telugu

13 May 2022, 14:52 IST

google News
  • మ్యూజిక్ కంపోజ‌ర్, న‌టుడు సౌర‌భ్ ధింగ్రాతో గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. వీరిద్ద‌రు ప్ర‌స్తుతం స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. కాగా ప్రియుడి కోసం పాయ‌ల్‌రాజ్‌పుత్ హెయిర్ స్టైలిస్ట్‌గా మారింది.

పాయ‌ల్ రాజ్‌పుత్‌
పాయ‌ల్ రాజ్‌పుత్‌ (instagram)

పాయ‌ల్ రాజ్‌పుత్‌

గ‌త రెండేళ్లుగా సౌర‌భ్ ధింగ్రాతో ప్రేమ‌లో ఉంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. 2020 ల‌వ‌ర్స్ డే రోజున అత‌డిని త‌న ప్రియుడిగా  అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. స్కూల్ డేస్ నుంచి పాయల్ తో సౌరభ్ కు  ప‌రిచ‌యం ఉన్న‌ట్లుగా స‌మాచారం. పాయ‌ల్ న‌టిగా నిల‌దొక్కుకోవడానికి సౌర‌భ్ ప్రోత్సాహాన్ని అందించిన‌ట్లు చెబుతున్నారు.

 ప్ర‌స్తుతం వీరిద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. అత‌డితో స‌న్నిహితంగా ఉంటున్న ఫొటోలు, వీడియోల‌ను త‌ర‌చుగా పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. తాజాగా ప్రియుడి కోసం హెయిర్ స్టైలిస్ట్ గా అవ‌తార‌మెత్తింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. కారావ్యాన్‌లో అత‌డి క్రాఫ్ ను సెట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సౌర‌భ్ కోసం స్టైలిస్ట్ గా మారిన‌ట్లు ఫ‌న్నీగా వ్యాఖ్యానించింది. 

పాయల్ షేర్ చేసిన ఈ వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం తెలుగులో మంచు విష్ణుతో ఓ సినిమా చేస్తోంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో  స‌న్నీలియోన్ మ‌రో నాయిక‌గా న‌టిస్తోంది. 

తదుపరి వ్యాసం