తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Payal Rajput | సినిమావాళ్ల‌తో ఫ్రెండ్‌షిప్‌ చేయ‌నంటున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌

Payal Rajput | సినిమావాళ్ల‌తో ఫ్రెండ్‌షిప్‌ చేయ‌నంటున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌

Nelki Naresh HT Telugu

21 March 2022, 17:33 IST

google News
  • సినిమా ఇండ‌స్ట్రీలో ఒక‌రిద్ద‌రు మిన‌హా త‌న‌కు పెద్ద‌గా స్నేహితులు లేర‌ని అంటోంది పంజాబీ సుంద‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.  ప్ర‌స్తుతం మంచి స్నేహితుల్నిసంపాదించుకోవడం ఛాలెంజింగ్ గా మారిపోయింద‌ని చెబుతోంది.

పాయ‌ల్ రాజ్‌పుత్‌
పాయ‌ల్ రాజ్‌పుత్‌ (instagram)

పాయ‌ల్ రాజ్‌పుత్‌

2018లో విడుద‌లైన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మైంది పంజాబీ సుంద‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌. నెగెటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ క్యారెక్ట‌ర్ తో యువ‌త‌రం క‌ల‌ల‌రాణిగా మారిపోయింది. తొలి సినిమాలోనే అందాల ఆర‌బోత‌తో ఆక‌ట్టుకున్న ఆమెకు తెలుగులో సినిమా ఆఫర్స్ వ‌రుస క‌ట్టాయి. వెంకీమామా, డిస్కోరాజాతో పాటు ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లో పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించింది. కానీ అవ‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిల‌వ‌డంతో పాయ‌ల్ రాజ్‌పుత్ కు సినీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆమె న‌టించిన సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లై రెండేళ్లు దాటిపోయింది. సోష‌ల్ మీడియాలో హాట్‌హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ సినీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

 ప్ర‌స్తుతం మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఫ్రెండ్‌షిప్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిద‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలో స్నేహ‌బంధం గురించి పాయ‌ల్ రాజ్‌పుత్ ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. రియ‌ల్‌లైఫ్ లో త‌న‌కు ఇద్ద‌రు, ముగ్గురికి మించి స్నేహితులు లేర‌ని చెప్పింది. వారితోనే తన వ్య‌క్తిగ‌త జీవితం తాలూకు ర‌హ‌స్యాల్ని పంచుకుంటాన‌ని చెప్పింది. ప్ర‌స్తుతం మంచి స్నేహితుల్ని సంపాదించుకోవ‌డం పెద్ద ఛాలెంజ్‌గా మారిపోయింద‌ని చెప్పింది. ఇండ‌స్ట్రీలో త‌న‌కు పెద్ద‌గా స్నేహితులు లేర‌ని అంటోంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. 

‘టాలీవుడ్ లో నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో రాశీఖ‌న్నా ఒక‌రు. ఆ త‌ర్వాత ఈషారెబ్బాతో స‌న్నిహితంగా ఉంటా. వీరు త‌ప్ప  ఇండ‌స్ట్రీలో నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన వారు ఎవ‌రూ లేరు. సినీ ప‌రిశ్ర‌మలోని వారితో పోలిస్తే అవుట్‌సైడ‌ర్స్ నాలోని త‌ప్పొప్పుల్ని నిజాయితీగా చెప్ప‌గ‌లుగుతారు. అందుకే ఇండ‌స్ట్రీలోని వారికంటే బ‌య‌టి పర్సన్స్ తో ఫ్రెండ్‌షిప్ చేయ‌డానికి నేను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తా’ అని చెప్పింది. ప్ర‌స్తుతం త‌మిళంలో జీవాతో ‘గోల్‌మాల్’ సినిమా చేస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. 

తదుపరి వ్యాసం