తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Og Ott: ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ఓజీ.. పోస్టర్‌తో ప్రకటించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

OG OTT: ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ఓజీ.. పోస్టర్‌తో ప్రకటించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu

14 January 2025, 11:50 IST

google News
    • Pawan Kalyan OG Movie OTT Platform Confirmed: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాపై ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఇప్పటికీ ఓజీ థియేట్రికల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. కానీ, థియేటర్లలో విడుదల కంటే ముందే ఓజీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ఓజీ.. పోస్టర్‌తో ప్రకటించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ఓజీ.. పోస్టర్‌తో ప్రకటించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ఓజీ.. పోస్టర్‌తో ప్రకటించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

Pawan Kalyan OG Movie OTT Platform: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తుంటారో తెలిసింది. పవన్ కల్యాణ్ సినిమాల కోసం పడిగాపులు పడుతుంటారు ఆయన ఫ్యాన్స్. అయితే, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీస్ కింద హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.

ముందుగా ఓజీ సినిమానే

వీటిలో ఏ ఒక్క సినిమా అయినా త్వరగా థియేటర్లలో రిలీజ్ కాకుండా ఉంటుందా అని వేయి కళ్లతో పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీటిలో అన్నిటికంటే ముందగా ఓజీ సినిమానే థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ (ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్) సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పాట కూడా పాడనున్నారని టాక్ వచ్చింది.

ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే, తాజాగా పవన్ కల్యాణ్ అభిమానులకే కాకుండా, ప్రేక్షకులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్. పవన్ కల్యాణ్ ఓజీ మూవీ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని అధికారికంగా సంక్రాంతి పండుగ పూట సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓజీ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసింది. తాజాగా ఇవాళ (జనవరి 14) నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. నెట్‌‌ఫ్లిక్స్ ఇండియా పేరుతో ఉన్న అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్‌లో పవన్ కల్యాణ్‌తో ఉన్న ఓజీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసింది. అలాగే, అందులో నెట్‌ఫ్లిక్స్ పండగ (#NetflixPandaga) అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ఉంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ "ఓజీ ఈజ్ బ్యాక్. ప్రతి ఒక్కరు ఆ హీట్‌ను ఫీల్ అవుతారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓజీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది" అని రాసుకొచ్చారు.

ఓజీ ఓటీటీ రైట్స్

దీంతో ఓజీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పక్కాగా ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఓజీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారుగా రూ. 92 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల లేదా రెండు నెలలకు ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్‌కు పవర్‌ఫుల్ విలన్‌గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఓజీలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి (సలార్ ఫేమ్), హరీష్ ఉత్తమన్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, షాన్ కక్కర్, అజయ్ ఘోష్, శ్యామ్ (రేసుగుర్రం ఫేమ్), శుభలేక సుధాకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తదుపరి వ్యాసం