తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Tamil Dark Comedy: ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన తమిళ డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

OTT Tamil Dark Comedy: ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన తమిళ డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

29 November 2024, 9:38 IST

google News
    • OTT Tamil Dark Comedy: ఓటీటీలోకి ఓ తమిళ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే శుక్రవారం (నవంబర్ 29) నుంచి ఈ సినిమా ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ అసలు విశేషం.
ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన తమిళ డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన తమిళ డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన తమిళ డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

OTT Tamil Dark Comedy: తమిళ నటుడు కవిన్ నటించిన మూవీ బ్లడీ బెగ్గర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అయింది. అయితే ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చి ఆశ్చర్యపరిచింది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

బ్లడీ బెగ్గర్.. నాలుగు ఓటీటీల్లోకి..

తమిళ మూవీ బ్లడీ బెగ్గర్ అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. కానీ శుక్రవారం (నవంబర్ 29) నుంచి ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోతోపాటు సన్ నెక్ట్స్, సింప్లీ సౌత్, టెంట్‌కొట్టా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి.

అయితే ప్రైమ్ వీడియో, టెంట్‌కొట్టా ఓటీటీలో ఇండియాతోపాటు ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా సినిమాను చూసే అవకాశం ఉండగా.. సన్ నెక్ట్స్, సింప్లీ సౌత్ లలో కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. శివబాలన్ డైరెక్ట్ చేసిన ఈ బ్లడీ బెగ్గర్ సినిమాకు థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. మరో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఫిలమెంట్ పిక్చర్డ్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టిన అతనికి ఇదే తొలి సినిమా.

బ్లడీ బెగ్గర్ స్టోరీ ఇదీ..

తమిళ నటుడు కవిన్ భిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ క్రమంగా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ బ్లడీ బెగ్గర్ మూవీ ఓ సోమరిగా తిరిగే బిచ్చగాడి చుట్టూ తిరిగే కథ. అంగవైకల్యం ఉందంటూ నటిస్తూ భిక్షాటన చేస్తుంటాడు.

ఓరోజు ఇళ్లు లేని వారి కోసం ఓ ధనిక కుటుంబం ఏర్పాటు చేసే విందుకు అతడు వెళ్తాడు. అక్కడ కడుపు నిండా తిన్న తర్వాత కూడా అత్యాశకు పోయి ఆ ప్యాలెస్ లోనే ఉండిపోతాడు. ఆ సమయంలో అక్కడ ఉండే ధనికులు, క్రూరమైన కుటుంబ సభ్యుల చేతికి చిక్కుతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఈ బ్లడీ బెగ్గర్ మూవీలో చూడాలి.

ఈ సినిమాలో కవిన్ తోపాటు రెడిన్ కింగ్స్‌లే, రాధా రవి, మారుతి ప్రకాశ్ రాఝ్, సునీల్ సుఖాడాలాంటి వాళ్లు నటించారు. మొదట్లో ఈ మూవీకి సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే క్రమంగా అవి కాస్తా పాజిటివ్ రివ్యూలుగా మారడంతో ఈ మూవీ ఓ మోస్తరు విజయం అందుకుంది. ఈ డార్క్ కామెడీ సినిమాను ఇప్పుడు ప్రైమ్ వీడియో, టెంట్‌కొట్టా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.

తదుపరి వ్యాసం