తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Mythological Thriller: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. చిరంజీవితో లింకు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Mythological Thriller: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. చిరంజీవితో లింకు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

11 December 2024, 8:11 IST

google News
    • OTT Mythological Thriller: ఓటీటీలోకి తెలుగులో మరో మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు చిరంజీవ. గత అక్టోబర్లోనే ఈ సిరీస్ అనౌన్స్ చేసిన ఆహా వీడియో ఓటీటీ.. తాజాగా స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.
ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. చిరంజీవితో లింకు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. చిరంజీవితో లింకు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. చిరంజీవితో లింకు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Mythological Thriller: ఆహా వీడియో ఓటీటీ చాలా దూకుడుగా వెళ్తోంది. సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడంతోపాటు ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లను కూడా చాలానే నిర్మిస్తోంది. తాజాగా చిరంజీవ పేరుతో తొలిసారి ఈ ఓటీటీ ఓ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ లాంచ్ చేసింది.

చిరంజీవ ఓటీటీ స్ట్రీమింగ్

చిరంజీవ ఓ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ మధ్య కాలంలో మైథాలజీని జోడిస్తూ సరికొత్త కథలను చెప్పడం ఆనవాయితీగా మారింది. అలా ఈ చిరంజీవ సిరీస్ కూడా వస్తోంది. ఈ వెబ్ సిరీస్ జనవరి నెలలో ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెబుతూ ఓ కొత్త పోస్టర్ లాంచ్ చేసింది. అయితే కచ్చితమైన స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా చెప్పలేదు.

నిజానికి అక్టోబర్ 31న ఈ సిరీస్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీ వెల్లడించారు. డిసెంబర్లోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించినా.. వచ్చే ఏడాది జనవరికి అది వాయిదా పడింది. ఈ చిరంజీవ సిరీస్ కు యముడితో ఆట అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.

చిరంజీవ సిరీస్ గురించి..

చిరంజీవ వెబ్ సిరీస్ ను అభినయ కృష్ణ డైరెక్ట్ చేశాడు. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సిరీస్ స్టోరీ, ఇందులోని నటీనటుల గురించి మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నటీనటులు నటించబోతున్నట్లు మాత్రం తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ వాడటంతోపాటు విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు.

ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లి విభిన్నమైన అనుభూతిని కలిగించే మైథాలాజికల్ థ్రిల్లర్స్ అటు మూవీ లవర్స్‌తోపాటు సినీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయి. అందుకే ఈ తరహా జోనర్ మూవీస్, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు.

చిరంజీవ వెబ్ సిరీస్ అన్ని రకాల వయసు గల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికరమైన కంటెంట్‌తో అలరిస్తుందని ఆహా టీమ్ చెబుతోంది. అద్భుతమైన విజువల్స్‌తో మంచి అనుభూతిని అందించడం లక్ష్యంగా చిరంజీవ తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు మేకర్స్.

గతంలోనూ ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవ వెబ్ సిరీస్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా ఓటీటీ టీమ్. ఇందులో శివుడి వాహనమైన నంది చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తే.. రోడ్‌పై ఓ యువకుడిని వెనుకనుంచి చూపించారు. చిరంజీవ పోస్టర్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటూ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

తదుపరి వ్యాసం