తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఓటీటీ సినిమాలు- తొలి తెలుగు మూవీ ఇదే! ఇంట్లోనే సౌండ్ అదుర్స్- థియేటర్లకు లాభమా? నష్టమా?

OTT: డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఓటీటీ సినిమాలు- తొలి తెలుగు మూవీ ఇదే! ఇంట్లోనే సౌండ్ అదుర్స్- థియేటర్లకు లాభమా? నష్టమా?

Sanjiv Kumar HT Telugu

08 December 2024, 9:00 IST

google News
    • OTT Movies With Dolby Atmos Technology: ఓటీటీలో వచ్చే సినిమాలకు డాల్బీ అట్మాస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీతో ఇంట్లోనే ది బెస్ట్ క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అయితే, ఈ డాల్బీ టెక్నాలజీతో వచ్చే ఓటీటీ సినిమాల వల్ల థియేటర్లకు లాభమా? నష్టమా? అనేది చూడాలి.
డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఓటీటీ సినిమాలు- తొలి తెలుగు మూవీ ఇదే! ఇంట్లోనే సౌండ్ అదుర్స్- థియేటర్లకు లాభమా? నష్టమా?
డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఓటీటీ సినిమాలు- తొలి తెలుగు మూవీ ఇదే! ఇంట్లోనే సౌండ్ అదుర్స్- థియేటర్లకు లాభమా? నష్టమా?

డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఓటీటీ సినిమాలు- తొలి తెలుగు మూవీ ఇదే! ఇంట్లోనే సౌండ్ అదుర్స్- థియేటర్లకు లాభమా? నష్టమా?

Dolby Atmos Technology OTT Movies At Home: కరోనా తర్వాత ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. వరల్డ్ వైడ్‌గా ఉన్న డిఫరెంట్ కంటెంట్‌ను ఇంట్లోనే కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అంతేకాకుండా థియేటర్లకు వెళ్లడం తగ్గించి ఓటీటీల్లోనే సినిమాలు చూస్తూ హ్యాపీగా గడిపేస్తున్నారు ఓటీటీ లవర్స్.

మంచి సౌండ్ క్వాలిటీ

అయితే, ఇలా ఇంట్లోనే సినిమాలు చూడటం వల్ల మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మిస్ చేసుకుంటున్నారు ఆడియెన్స్. కానీ, ఇప్పుడు సాంకేతిక మరింతగా పెరిగింది. కొవిడ్‌కు ముందు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అంటే తెలియని ఆడియెన్స్‌కు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఓటీటీల్లో మంచి సౌండ్ క్వాలిటీతో సినిమాలు చూసే టెక్నాలజీ వచ్చేసింది.

అదే డాల్బీ అట్మాస్ టెక్నాలజీ. ఈ సాంకేతిక ద్వారా 3డీ ఆడియోను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అంటే, ఐమాక్స్, మల్టీప్లెక్స్ వంటి బిగ్గెస్ట్ థియేటర్లలో విని ఎంజాయ్ చేసే హై క్వాలిటీ సౌండ్‌ను డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ద్వారా ఇంట్లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. ఈ టెక్నాలజీలో సినిమాలో మూడు డైమెన్షన్లలో ఉన్న వచ్చే ధ్వనిని స్పష్టంగా వినేలా చేస్తుంది.

మరింత డీటెలియింగ్‌గా

అంటే, మూవీలో వచ్చే బీజీఎమ్, సాంగ్స్ మ్యూజిక్ ఎలా మూవ్ అవుతుంటే అలా, ఏ పిచ్‌లో ఉంటే అలా, ఎడమ నుంచి కుడికి, రైట్ నుంచి లెఫ్ట్‌కు, సెంటర్ పాయింట్‌లో ఉండే స్పీకర్స్ ద్వారా సౌండ్ మూవ్ అవుతూ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఐమాక్స్‌లో వచ్చే సౌండ్ అదిరిపోతుంది. అయితే, దీనికి మించి డాల్బీ అట్మాస్ టెక్నాలజీ గల సినిమాల్లోని సౌండ్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుందని టాక్.

డాల్బీ అట్మాస్ టెక్నాలజీలో మరింత డీటెలియింగ్‌గా సౌండ్ ఉండి హారర్, థ్రిల్లర్, ఫాంటసీ, యాక్షన్ జోనర్ సినిమాలకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందట. అయితే, ఈ డాల్బీ టెక్నాలజీతో వచ్చిన తొలి స్ట్రైట్ తెలుగు సినిమా క. కిరణ్ అబ్బవరం హీరోగా చేసి మంచి హిట్ కొట్టిన క మూవీని ఈటీవీ విన్‌ ఓటీటీలో డాల్బీ అట్మాస్ టెక్నాలజీలో అందుబాటులో ఉంచారు.

ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్స్‌కే

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ ప్లస్ టీవీ, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో సినిమాలను అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ యూజర్స్ మాత్రమే ఈ టెక్నాలజీతో సినిమాను వినగలరు. దాదాపుగా మిగతా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అంతే. అయితే, వీటిని టీవీలో వినాలంటే మాత్రం దానికి సపోర్ట్ చేసే సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ది గ్రే మ్యాన్, బర్డ్ బాక్స్‌, గన్‌పౌడర్ మిల్క్‌షేక్, ది అడమ్ ప్రాజెక్ట్, రెబల్ మూన్, అమెజాన్ ప్రైమ్‌లో ఇంటర్‌స్టెల్లార్, జాక్ రేయాన్ సిరీస్, ది టుమారో వార్, షాట్‌గన్ వెడ్డింగ్, స్కై ఫాల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్, ఏలియన్ రోములస్, విక్రమ్, కౌన్ ప్రవీణ్ తాంబే, బూత్ పోలీస్, బ్రో డాడీతోపాటు ఇతర ఓటీటీల్లో చాలా వరకు సినిమాలు డాల్బీ టెక్నాలజీతో ఉన్నాయి.

ఆ సినిమాలకు మాత్రమే

అయితే, ఓటీటీల్లో డాల్బీ టెక్నాలజీతో సినిమాలు స్ట్రీమింగ్ అయితే థియేటర్ యజమానులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది థియేటర్‌కు వెళ్లడం మానేసి ఓటీటీలకు పరిమితం అవుతున్నారు. టాక్ చాలా బాగుండి, విజువల్‌గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాలనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్తున్నారు.

ఇక అలాంటి డాల్బీ అట్మాస్, 4కే విజన్ క్వాలిటీ టెక్నాలజీతో ఓటీటీల్లో సినిమాలు వస్తే థియేటర్లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు విపరీతంగా ధరలు పెంచడంతో మధ్యతరగతి కుటుంబాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌నే ఎంచుకుంటున్నాయి. కాబట్టి, ఇంట్లోనే హై క్వాలిటీ విజువల్స్, సౌండ్ ఎక్స్‌పీరియన్స్ వస్తున్నప్పుడు థియేటర్లకు వెళ్లే అవకాశం చాలా తక్కువ అని అంచనా వేస్తున్నారు సినీ పండితులు.

తదుపరి వ్యాసం