OTT Telugu: ఓటీటీలో రెండ్రోజుల్లో రిలీజైన 12 తెలుగు సినిమాలు.. ఒక్కదాంట్లోనే 5 స్ట్రీమింగ్.. హారర్ సహా అన్నీ జోనర్స్‌లో!
14 December 2024, 14:36 IST
- OTT Movies Telugu This Week: ఓటీటీలోకి రెండ్రోజుల్లోనే తెలుగు భాషలో 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే, వాటిలో నాలుగు స్ట్రైట్ తెలుగు సినిమాలు అయితే మిగతావన్నీ ఇతర భాషల నుంచి డబ్ చేసిన మూవీస్. అన్నీ రకాల జోనర్స్‌లో ఉన్న వీటన్నింటిలో 5 ఒక్క ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓటీటీలో రెండ్రోజుల్లో రిలీజైన 12 తెలుగు సినిమాలు.. ఒక్కదాంట్లోనే 5 స్ట్రీమింగ్.. హారర్ సహా అన్నీ జోనర్స్‌లో!
OTT Telugu Movies This Week: ఓటీటీలోకి ఈ వారం అనేక భాషల నుంచి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వాటిలో గురువారం, శుక్రవారం కలిపి రెండ్రోజుల్లోనే తెలుగు భాషలో 12 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. అయితే, ఈ 12లో నాలుగు మాత్రమే స్ట్రైట్ తెలుగు మూవీస్ కాగా మిగతావన్నీ ఇతర భాషల నుంచి డబ్బింగ్ అయినవే. మరి అవేంటో లుక్కేద్దాం.
మెకానిక్ రాకీ ఓటీటీ
విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డిసెంబర్ 13 నుంచి మెకానిక్ రాకీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హరికథ ఓటీటీ
తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హరికథ నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 13 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ బాస్ దివి నటించిన హరికథ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ వంటి 7 భాషల్లో అందుబాటులో ఉంది.
వేరే లెవెల్ ఆఫీస్ ఓటీటీ
తెలుగులో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్‌గా వచ్చిన వెరే లెవెల్ ఆఫీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 50 ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ నుంచి ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్స్‌ను ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు.
రోటి కపడా రొమాన్స్ ఓటీటీ
బోల్డ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన తెలుగు సినిమా రోటి కపడా రొమాన్స్ ఓటీటీలో డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
బొగెన్ విల్లా ఓటీటీ
మలయాళంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ బొగెన్ విల్లా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిసెంబర్ 13 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బొగెన్ విల్లా ఓటీటీ రిలీజ్ అయింది.
7జీ ఓటీటీ
తమిళంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 7జీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఆహాలో డిసెంబర్ 12 నుంచి 7జీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
బందిష్ బండిట్స్ 2 ఓటీటీ
హిందీలో రొమాంటిక్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ బందిష్ బండిట్స్. ఈ సిరీస్ నుంచి వచ్చిన సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో బందిష్ బండిట్స్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
మిస్ మ్యాచ్‌డ్ 3 ఓటీటీ
మరో హిందీ రొమాంటిక్ వెబ్ సిరీస్ మిస్ మ్యాచ్‌డ్ సీజన్ 3 డిసెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మిస్ మ్యాచ్‌డ్ 3 ఓటీటీలో హిందీతోపాటు తెలుగు, ఇంగ్లీష్, తమిళంలో అందుబాటులో ఉంది.
క్యారీ ఆన్ ఓటీటీ
ఇంగ్లీష్‌లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన మూవీ క్యారీ ఆన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 13న ఓటీటీ రిలీజ్ అయిన క్యారీ ఆన్ తెలుగు, హిందీ, తమిళలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
రెడ్ వన్ (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ అయిన ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12
హౌ టు విన్ ఏ ప్రిన్స్ (తెలుగు, హిందీ, తమిళంలో అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 12
హల్లో ఎగైన్ (తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న తైవానీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
ఇలా రెండ్రోజుల్లో తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 12 సినిమాలు, వెబ్ సిరీసుల్లో ఐదు ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో, రెండు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావడం విశేషం.